April 15th: ఏపీ ఎన్నికల సమాచారం | AP Elections Today Political News Updates And Headlines On April 15th In Telugu - Sakshi
Sakshi News home page

April 15th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Mon, Apr 15 2024 7:04 AM | Last Updated on Mon, Apr 15 2024 9:23 PM

AP Elections 2024: Political News In Telugu On April 15th Updates - Sakshi

April 15th AP Elections 2024 News Political Updates..

8:55 PM, Apr 15th, 2024

నెల్లూరు: 

నెల్లూరు జిల్లా ప్రజల కోసం నిస్వార్థంగా పని చేస్తాం: విజయసాయి రెడ్డి

  • నెల్లూరు పరిశుభ్రతకి..పట్టణంలో మౌలిక సదుపాయాల విషయంలో.. పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పని చేస్తా
  • కేంద్రం నుండి అత్యధిక నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతా
  • పార్కులు,క్రీడా మైదానాలు అభివృద్ధికి భూగర్భజలాల అభివృద్ధికి నా వంతు కృషి చేస్తాం
     

8:30 PM, Apr 15th, 2024

ప్రకాశం జిల్లా:

చంద్రబాబు చరిత్ర మొత్తం రక్తచరిత్రే: చెవిరెడ్డి

  • వంగవీటి రంగా దగ్గరి నుండి..బెల్లిలలిత వరకూ తనకు అడ్డుగా ఉన్నవారిని తొలగించిన చరిత్ర బాబుది
  •  ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడిలో చంద్రబాబు కుట్ర ఉంది
  • ఎన్నికల్లో ఓటమి భయంతోనే పచ్చపార్టీ దాడులకు తెగబడుతోంది:
     

5:30 PM, Apr 15th, 2024

గుడివాడ మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్‌ స్పీచ్‌లోని ముఖ్యంశాలు

  • ఇక్కడున్నది మంచి చేశామన్న ధైర్యంతో నిలబడిన ఒక్క మీ జగన్‌.
  • చుట్టుముట్టునది ఏ మంచి కూడా చేయని అబద్ధాలే పునాదాలుగా, మోసాలే అలవాటుగా పెట్టుకున్న కుట్రదారుల అటువైపున..
  • ఒక్క మీ జగన్‌ మీద ఎంతమంది దాడి చేస్తున్నారంటే.. ఓ చంద్రబాబు, ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ టీవీ-5, ఓ దత్తపుత్రుడు, ఓ బీజేపీ, ఓ కాంగ్రెస్‌.. ఇవన్నీ సరిపోవంటూ ఎన్నో కుట్రలు, ఎన్నో మోసాలు చేస్తున్నారు
  • కుటిల పద్మవ్యూహంలో ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్‌ మీద.
  • మీకు మంచి చేసిన మీ జగన్‌ మీద, మీ బిడ్డ మీద దాడి చేస్తున్నారు. 
  • అయినా మీ బిడ్డ అదరడు.. మీ బిడ్డ బెదరడు
  • కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ.
  • చేసిన మంచి మీద, ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టే..అర్జునుడి మీద ఒక్క బాణం వేసినంత మాత్రాన కౌరవులు గెలిచినట్లు కాదు
  • జగన్‌ మీద ఒక్క రాయి విసిరినంత మాత్రానా జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని, ఆ పెత్తందారుల ఓటమిని, మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు
  • ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు
  • పైగా మీరు ఈ స్థాయికి దిగజారారు అంటే.. విజయానికి మనం అంత చేరువగా ఉన్నామని, వారు విజయానికి అంత దూరంగా ఉన్నారనే కదా అని అర్థము
  • ఈ తాటాకు చప్పళ్లుకు మీ బిడ్డ అదరడు.. బెదరడు
  • మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే తప్పా ఏ మాత్రం తగ్గదు
  • నుదుటి మీద వారు చేసిన గాయంతో బయటపడ్డానంటే అంటే దానర్థం. దేవుడు  బిడ్డ విషయంలో  ఇంకా పెద్ద స్క్రిప్ట్‌ రాశాడు అని దానర్థం.
  • నా నుదుటి మీద వారు చేసిన గాయం బహుశా 10 రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ,  పేదల విషయంలో చంద్రబాబు చేసిన గాయాలు ఎప్పటికీ మానవు.
     
  • మీ జగన్‌పై చంద్రబాబు అండ్‌ కో దాడి చేస్తోంది
  • రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తే ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలని అది ఇవ్వొద్దని ఎవరు చెప్పారు.. అది బాబే
  • కిలో రెండో రూపాయిలకే బియ్యం ఇవ్వొద్దని ఎన్టీఆర్‌ను దింపేసి ఐదు రూపాయల 25 పైసలకు పెంచేసింది ఎవరు.. అది ఈ బాబే
  • ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వొద్దన్నది ఎవరు.. అది ఈ బాబే
  • గవర్నమెంట్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి కేసులు వేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
  • తాను ముఖ్యమంత్రిగా ఉంటూ  ఎస్సీలను, బీసీలను అవహేళన చేసింది ఎవరు.. అది కూడా ఈ బాబే
  • విడగొట్టిన రాష్ట్రానికి ప్రత్యేక హోదా వద్దన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
  • ప్రత్యేక హోదా ఏమైనా సంజీవినా అన్నది ఎవరు.. అది కూడా ఈ బాబే
  • ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టంది ఎవరంటే.. అది కూడా ఈ బాబే
  • చివరకు అన్ని ఓడిపోయిన ఈ చంద్రబాబును, అతాకుతలమైన ఈ చంద్రబాబును ఎన్టీఆర్‌ చేరదీసి కూతుర్ని ఇస్తే.. ఆ ఎన్టీఆర్‌ కుర్చీని లాగేసుకుని, ఎన్టీఆర్‌ చావుకు కారణమైన వ్యక్తి ఎవరంటే.. అది కూడా ఈ బాబే.

4:15 PM, Apr 15th, 2024

శ్రీకాకుళం 

వెనుక బడ్డ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాకు చంద్రబాబు ఏం చేసారో ఈ రోజు పలాస సభలో చెప్పాలి: మంత్రి సీదిరి అప్పలరాజ

  • ఉత్తరాంధ్ర వలసల నివారణకు చంద్రబాబు ఏం చేసారు..?
  • పాదయాత్రలో ఉత్తరాంధ్ర ప్రజల కష్టాలు జగన్ మోహన్ రెడ్డి చూసారు. అందుకే విశాఖ ను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేయాలనుకున్నారు
  • మా విశాఖ కి ఏం తక్కువ ..ఉత్తరాంద్రకు మంచి జరుగుతుందంటే ఎందుకు  ఒప్పుకోరు చంద్రబాబు...?
  • ఉత్తరాంధ్ర ప్రజలు మెల్కోవాల్సిన సమయం ఇది... చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు... బాబుకు ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్పాలి

4:10 PM, Apr 15th, 2024

కడప:

కుటుంబాల్లో చిచ్చుపెట్టడమే చంద్రబాబు పని: వైఎస్సార్‌సీపీ నేత రమేష్‌రెడ్డి

  • ఎల్లో మీడియాతో బురద జల్లిస్తున్నారు
  • వివేకా కుమార్తె సునీతను పావుగా వాడుకుంటున్నారు
  • సీఎం జగన్‌, అవినాష్‌రెడ్డిపై బురదజల్లుతున్నారు
  • ప్రతిపక్షాలు వాస్తవాలను పక్కదారి పట్టిస్తున్నాయి
  • అవినాష్‌రెడ్డి ఎంపీ కావాలని వివేకానే ప్రచారం చేశారు
  • ఈ కేసును బాబు రాజకీయాల కోసం వాడుకుంటున్నారు
  • ఎవరిపై కక్ష సాధించేందుకు షర్మిత ఏపీకి వచ్చారు?
  • షర్మిల, సునీత అసత్య ప్రచారాలు మానుకోవాలి
  • చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
  • ఎన్నికల తర్వాత టీడీపీ మూతపడటం ఖాయం

3:50 PM, Apr 15th, 2024

తిరుపతి:

అవతలి వాళ్ళను నాశనం చేయడమే చంద్రబాబు నైజం: భూమన కరుణాకర్ రెడ్డి

  • చంద్రబాబు హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి 
  • రాజారెడ్డి హత్య కేసులో నిందితులకు షెల్టర్ ఇచ్చాడు
  • చంద్రబాబు చేసిన తప్పులు ప్రజలు ఎవరూ మర్చిపోరు
  • సీఎం జగన్ పై దాడి జరిగిన వెంటనే అచ్చెన్నాయుడు డ్రామా అంటున్నాడు
  • చంద్రబాబు జీవితం అంతా హత్యా  రాజకీయమే
  • చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ లేదు అని గ్రహించి జగన్‌ను నిర్మూలించాలి అని కుట్ర చేశాడు
  • పవన్ కళ్యాణ్ దుర్మార్గంగా మాట్లాతున్నారు
  • 2003 లో చంద్రబాబుపై అలిపిరి దాడి జరిగినప్పుడు టీ పోసే వ్యక్తి కూడా స్పందించలేదు
  • చంద్రబాబు పై దాడి జరిగిన రోజు గాంధీ విగ్రహం దగ్గర దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు 
  • అది వైఎస్సార్ కుటుంబం గొప్పతనం
  • నీపై దాడులు, నీ గత దుర్మార్గాలు చూస్తే నీపై దాడి జరిగితే ప్రజలు నమ్మరు
  • చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టడం వల్లనే దాడి జరిగింది

3:20 PM, Apr 15th, 2024

తాడేపల్లి

సీఎం జగన్ మీద దాడి బాధాకరం: ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

  • ఆయన త్వరగా కోలుకోవాలని అల్లాకు ప్రార్థనలు చేస్తున్నాం
  • మక్కా మసీద్ నుండి ప్రార్థనలు చేసిన నీరు సీఎం గారికి ఇవ్వడం జరిగింది
  • షార్ప్ షూటర్ తో దాడి చేయించినట్టు అర్థమవుతోంది
  • జగన్ పై దాడి  పక్కదోవ పట్టించడానికి చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు
  • నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగితే సినిమా స్టార్స్ అందరూ ఇక్కడే ఉండే వారు వారితో బాగా పబ్లిసిటీ చేయించుకునేవాడు
  • ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ తీరు మార్చుకుంటే మంచిది
  • పెత్తందారులే సీఎంపై దాడి చేయించారు

3:01 PM, Apr 15th, 2024

తిరుపతి జిల్లా: 

చంద్రబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే..:  ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్‌రెడ్డి

  • చంద్రబాబు నాయుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం వల్లనే సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగింది
  • చంద్రబాబుకు ప్రజాదరణ లేదు
  • సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి నవరత్రాలు సంక్షేమ పథకాలు ఉన్నాయి
  • చంద్రబాబు చెప్పుకోవడానికి ఒక్క రత్నం కూడా లేదు
  • గతంలో ఇచ్చిన 600 హామీలు గాలికి వదిలేసిన చంద్రబాబు.. ఇప్పుడు సూపర్‌ సిక్స్‌ అంటున్నాడు
  • చంద్రబాబు పాత బ్లాక్‌ అండ్‌ వైట్‌ సినిమా తరహా మాదిరి కుట్ర ఆలోచన, దాడులు చేయిస్తున్నారు

2:10 PM, Apr 15th, 2024
ప్రజలకు మంచి జరిగితే చంద్రబాబు ఓర్చుకోలేడు: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

  • ఎన్టీఆర్ చనిపోయే ముందు చంద్రబాబును పశువు కంటే దారుణమైన వ్యక్తిగా సంబోధించారు
  • చంద్రబాబు రాజకీయ ప్రస్థానమంతా దాడులు, దౌర్జన్యాలే
  • చంద్రబాబు ప్రజలకు మంచి జరిగితే ఓర్చుకోలేడు
  • పదవీ దాహంతోనే ఎన్టీఆర్‌ను తుదముట్టించాడు
  • విద్యార్ధి దశనుంచే చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెట్టి కళాశాలలో రాజకీయాలు చేసేవాడు
  • బానిసత్వం నుండి స్వేచ్ఛవైపు నడిపించే వ్యక్తులను పెత్తందారులు పొట్టన పెట్టుకున్న ఘటనలున్నాయి
  • సీఎం జగన్ పేదవాళ్ల తలరాతలు మార్చడం తట్టుకోలేకే హత్యాప్రయత్నం చేసారు
  • ముఖ్యమంత్రి జగన్‌ను తుదముట్టించేందుకు ఎప్పటినుంచే ప్లాన్ చేస్తున్నారు.. ఇన్నాళ్లకు సఫలీకృతమైంది
  • దెబ్బ కణితపై తగిలి ఉంటే ప్రాణం పోయేది.
  • కన్నుకు తగిలి ఉంటే కన్ను పోయేది.
  • తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఉంటున్న ప్రాంతంలోనే దాడి జరిగింది
  • పవన్ కల్యాణ్‌కి కనీస మానవత్వం లేదు
  • సినిమా అనుకుంటున్నాడేమే.. రాయి తగిలితే ఏమవుతుందని అంటున్నారు
  • దనదాహం, ప్యాకేజ్ తో పవన్ మాట్లాడుతున్నారు
  • వెల్లంపల్లి శ్రీనివాస్ కన్ను తీవ్రంగా దెబ్బతిన్నది
  • చంద్రబాబుది రాక్షస మనస్తత్వం.. ఆయనలో మానవత్వం నశించిపోయింది
  • జగన్‌పై దాడి చేయండి అంటూ రాక్షస మూకలను రెచ్చగొడుతున్నారు
  • పుష్కరాల్లో భక్తులు చనిపోయినా, తన రోడ్ షోల్లో ప్రజలు చనిపోయినా కనికరం లేదు
  • చంద్రబాబు ఒళ్లంతా విషం నింపుకున్నారు
  • పేదవాళ్లకు అండగా ఎదిగిన రంగాను చంద్రబాబే తుదముట్టించారు
  • రంగా హత్యకు కారకుడు చంద్రబాబే
  • కారంచేడు హత్యల సమయంలో, పుష్కరాల్లో ప్రజలు చనిపోయినపుడు ఇంటెలిజెన్స్ వ్యవస్థల రిపోర్టులు బయటకు రానివ్వలేదు
  • చంద్రబాబు వెన్నుపోటుదారుడు, నరరూప రాక్షకుడు
  • చంద్రబాబు ఎన్నిసార్లు పరిపాలించినా పేదల గుండెల్లో లేరు
  • గొడవలు సృష్టించి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలనేది చంద్రబాబు ఆలోచన
  • ఎంతమంది చనిపోయినా పదవులు పొందాలనేదే ఆయన కోరిక
  • చంద్రబాబు పూర్తిగా క్రూరత్వంతో నిండిపోయారు

1:50 PM, Apr 15th, 2024
చంద్రబాబు, లోకేష్‌కు మంత్రి అమర్నాథ్‌ కౌంటర్‌ 

  • సీఎం జగన్ మీద జరిగిన దాడిపై కూటమి నేతలు చేస్తున్న మాటలను ఖండిస్తున్నాను.
  • సీఎం జగన్‌కు వస్తున్న స్పందన చూసి ఓర్వలేక దాడి చేయించారు.
  • కంటిపైన రాయి తగిలింది కాబట్టి సరిపోయింది. లేదంటే కన్ను పోయేది.
  • సింపతీ పొందాల్సిన అవసరం సీఎం జగన్‌కు ఏముంది.
  • ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేశారు.
  • జరిగిన దాడిని దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు ఖండించారు.
  • సీఎం జగన్ ఏమీ తప్పు చేశారని దాడులు చేస్తున్నారు.
  • చంద్రబాబు ఆయన మీద ఆయన రాళ్ళు వేయించుకొని ప్రచారం కోసం వాడుకుంటున్నాడు.
  • రాయి చుట్టూ ఒక షార్ట్ ఫిల్మ్ తీసే పనిలో ఉన్నారు.
  • అమిత్ షాపై రాళ్ళు వేసింది టీడీపీ కార్యకర్తలు కాదా?.
  • ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించింది చంద్రబాబు కాదా?.
  • వంగవీటి రంగాను చంపించింది చంద్రబాబు కాదా?.
  • ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్సీపీ హయంలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ సభకు సిద్ధం.
  • టీడీపీ హయాంలో కంటే ఉద్యోగాలు పెట్టుబడులు మూడు రెట్లు అధికంగా తీసుకువచ్చాము.
  • బ్రెయిన్ లెస్ ఫెలో లోకేష్ నా గురించి మాట్లాడుతున్నారు.
  • స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు స్టాండ్ ఏమిటో చెప్పకుండా పారిపోయాడు.
  • స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం.
  • స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ అండగా ఉంది.
  • ప్రత్యేక హోదా, పోలవరంను ఎలా తాకట్టు పెట్టారో స్టీల్ ప్లాంట్‌ను కూడా అదే విధంగా చంద్రబాబు తాకట్టు పెడతారు.
  • లోకేష్, చంద్రబాబు లా బ్యాక్ డోర్ పొలిటీషియన్‌ను కాదు.

1:30 PM, Apr 15th, 2024
సైకిల్‌కి కూడా తుప్పు పట్టింది.. బొత్స కౌంటర్‌

  • సీఎం జగన్‌ను టార్గెట్ చేసి షూటర్‌ను పెట్టి అటాక్ చేసినట్టు ఉంది.
  • పవన్ వంటి సినిమా సెలబ్రిటీలకు డ్రామాలు తెలుసు. 
  • జగన్ యాక్టర్ కాదు.. రియల్ హీరో.
  • సైకిల్‌కి కూడా తుప్పు పట్టింది.
  • రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పార్టీ అధ్యక్షుని చూడలేదు.
  • పవన్‌కు పరిపక్వాత లేదు అది రావాలంటే 25 ఏళ్ళు పడుతుంది.
  • పవన్ ఎన్ని సీట్లు గెలుస్తాడో చెప్పగలడా? 
  • పిఠాపురంలో పార్టీ కోసం కాకుండా ఆయన కోసం పవన్ మాట్లాడుతున్నాడు.
  • పవన్ బాషలోనే డొల్లతనం కనపడుతుంది.
  • చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం పేరు ఒకటి చెప్పమనండి.
  • పవన్‌కి వ్యవస్థల గురించి ఏమి తెలుసు.
  • సీఎం జగన్‌కు గాయం అయితే ప్రధాని సహా ఎందుకు స్పందించారు.. అది వ్యవస్థ.
     

1:15 PM, Apr 15th, 2024
పవన్‌పై ముద్రగడ ఫైర్...

  • పవన్ కళ్యాణ్‌ను నమ్మితే సినిమా చూపిస్తాడు
  • సంవత్సరానికో.. ఆరు నెలలకో ఒకసారి వచ్చి హలో అనే పవన్‌కు ఓటు వెయ్యాలా?
  • జనసేన నుండి పోటీ చేసే అభ్యర్ధులకు కనీసం తన నెంబర్ ​కూడా పవన్ ఇవ్వలేదు.
  • పవన్‌ను ఓడిస్తే జీవితంలో మళ్ళీ సినిమా వాళ్ళు రాజకీయాల్లో రావడానికి సాహసం చేయ్యరు.
  • సినిమాల్లో సంపాదించుకుంటున్నారు.. మధ్యలో నటించడం కోసం ఎమ్మెల్యే పదవులు కావాలంటున్నారు.
  • ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్యే పదవులు కాదు. 
  • వారు సినిమా షూటింగ్‌లు చేసుకోవడానికి ఎమ్మెల్యే పదవులు
  • హైదరాబాద్‌, విజయవాడలో ఆస్తులు అమ్ముకుని పవన్‌ను పిఠాపురం వచ్చేయమనండీ
  • చంద్రబాబు తన ఎస్టేట్‌కు జనరల్ మేనేజర్‌తో పాటుగా మార్కెటింగ్ మేనేజర్ పోస్టును పవన్‌కి ఇచ్చేశాడు
  • మొత్తం కాపులందర్ని గుత్తగా కొనేయడానికి పవన్‌కు మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ ఇచ్చాడు.
  • ఈ ఉద్యోగం తప్పా.. ప్రజలకు సేవ చేయాలని పవన్‌కు లేదు.
  • పిఠాపురం ఎమ్మెల్యేగా వంగా గీతా, ఎంపీగా సునీల్‌ను గెలిపించుకోవాలి.
  • సీఎం జగన్ దృష్టిలో పిఠాపురం మొదటి స్ధానంలో ఉండేలా కష్టపడి పని చేయాలి

12:55 PM, Apr 15th, 2024
ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నా: సీఎం జగన్‌

  • పార్టీ నేతలకు ధైర్యం చెప్పిన సీఎం జగన్‌
  • మనకు దేవుడి దయ, ప్రజల ఆశ్వీరాదం ఉంది. 
  • ప్రజల ఆశీర్వాదం వల్లే దాడి నుంచి తప్పించుకున్నాను.
  • ఇలాంటి దాడులు మనల్ని ఆపలేవు. 
  • ధైర్యంగా ముందుకు అడుగువేద్దాం. 
  • ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. 

12:40 PM, Apr 15th, 2024
మంచి చేసే వారికే ఓటెయ్యాలి: మంత్రి బొత్స 

  • మంత్రి బొత్స సత్యనారాయణ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన యువకులు.
  • యువతకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది.
  • యువతకు క్రమశిక్షణ, పోటీతత్వం చాలా అవసరం.
  • యువత ఓటు వేసే ముందు ఆలోచించాలి.
  • మీకు మంచి చేసిన వారికి ఓటు వేయాలి.
  • రాష్ట్రంలో యువతకు అన్ని రంగాల్లో వైసీపీ ప్రధాన్యత ఇస్తుంది.
     

12:20 PM, Apr 15th, 2024
చంద్రబాబుకు మంత్రి అంబటి కౌంటర్‌.. 

  • సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు 
  • సీఎం జగన్‌ పాలనలో చంద్రబాబు ఆటలు సాగవని పచ్చ బ్యాచ్‌కు తెలుసు. 
  • అందుకే ఇలా దాడికి ప్లాన్‌ చేశారు.
  • సీఎం జగన్‌ ఏరోజు ఏరోజు సానుభూతి కోసం ప్రయత్నించలేదు.
  • సంక్షేమ పథకాలే సీఎం జగన్‌ను గెలిపిస్తాయి. 
  • ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదు. 
  • అందుకే కూటమిగా వస్తూ కుట్రలు చేస్తున్నాయి. 
  • మీరు ముగ్గురు కలిసినా 30 మంది కలిసినా సీఎం జగన్‌ను ఓడించలేరు. 
  • సీఎం జగన్‌పై దాడిని ప్రధాని మోదీ కూడా ఖండించారు. 
  • కానీ, చంద్రబాబు, పవన్‌లకు మాత్రం వెటకారంగా ఉంది. 
  • నాదెండ్ల మనోహార్‌ కోసం ప్రచారం చేసేందుకు పవన్‌ వచ్చారు. 
  • నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి నాశనమే. 
  • ముఖ్యమంత్రి జగన్‌ గాయంపై పవన్‌ కల్యాణ్‌ ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు. 
  • పవన్‌ సినిమా యాక్టర్‌ కాబట్టి చూసేందుకు వస్తున్నారు. 
  • సీఎం జగన్‌ పేదల పక్షపాతి కనుక ఆయనను చూసేందుకు, కలిసేందుకు వస్తున్నారు. 
  • సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. 
  • పవన్‌ ఎన్నోసార్లు అనుచితంగా మాట్లాడారు. 
  • మళ్లీ వైఎస్సార్‌సీపీ నేతలు బూతులు తిడతారంటూ ఆరోపిస్తారు. 
  • గతంలో పవన్‌ తాను మాట్లాడిన బూతులు మరచిపోయారా?. 
  • దీనికి పవన్‌ ఏం సమాధానం చెబుతారు?. 
  • అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడు. 
  • టీడీపీ వాళ్లు అశాంతిని సృష్టిస్తారు. వైస్సార్‌సీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలి.
     

11:50 AM, Apr 15th, 2024
టీడీపీలో భగ్గుమన్న విబేధాలు..

  • నందికొట్కూరు టీడీపీలో మరోసారి భగ్గుమన్న విబేధాలు
  • మాండ్రా శివానందరెడ్డి, బైరెడ్డి వర్గీయుల మధ్య వర్గవిబేధాలు
  • బాలయ్య పర్యటనలో భాగంగా నందికొట్కూరు పటేల్ కూడలిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో ఎక్కడ కనిపించని టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఫోటో
  • బైరెడ్డి వర్గీయులు ఫ్లెక్సీల ముందు ఆందోళన చేపట్టడానికి సిద్ధమైనట్లు సమాచారం.

11:30 AM, Apr 15th, 2024
వైఎస్సార్‌సీపీలోకి చేరికలు.. 

  • కేసరపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద వైస్సార్‌సీపీలో చేరికలు. 
  • నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక కీలక నేతలు. 
  • కేసరపల్లి నైట్‌ స్టే పాయింట్‌ వద్ద తెలుగుదేశం నుంచి వైయస్సార్సీపీలో చేరిన వారికి కండువాలు వేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.
  • వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన టీడీపీ నేత, ఉమ్మడి రాష్ట్రంలో 
  • ఉమ్మడి ఏపీలో మైనార్టీ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌, హజ్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అహ్మద్‌ హుస్సేన్, టీడీపీ అఫీసియల్‌ స్పోక్స్‌ పర్సన్‌ ముస్తాఫా మొమిన్, కర్నూలు జిల్లా తాలిమీ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ నూర్‌ మహమ్మద్, మహమ్మద్‌ ఇలియాస్‌లు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • వీరికి పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌. 

11:10 AM, Apr 15th, 2024
వైఎస్సార్‌సీపీదే గెలుపు: మంత్రి చెల్లుబోయిన 

  •  గతంలో ఎన్నడూ లేనివిధంగా రాజమండ్రి పార్లమెంట్‌ సీటు బీసీలకు కేటాయించారు. 
  • రాజమండ్రి అర్బన్‌, రూరల్‌ నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీదే గెలుపు. 
  • సామాజిక సాధికార యాత్ర సీఎం జగన్‌తోనే సాధ్యమైంది. 

10:45 AM, Apr 15th, 2024
గన్నవరంలోకి ప్రవేశించిన సీఎం జగన్‌ బస్సు యాత్ర

  • కృష్ణా జిల్లాలోని సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్ర
  • సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికిన ప్రజలు..

10:00 AM, Apr 15th, 2024
రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు..

  • పల్నాడు జిల్లా..
  • ముప్పాళ్ళ మండలం తొండపిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తల దాడి 
  • ఎన్నికల ప్రచారం పాల్గొన్న మాజీ మేయర్ కన్నా నాగరాజు 
  • ప్రచారం ముగించుకొని ఇళ్లకు వెళ్లే క్రమంలో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు. 
  • టీడీపీ కార్యకర్తల దాడిలో నలుగురికి గాయాలు, ఆస్పత్రికి తరలింపు 
  • గ్రామంలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు. 

9:00 AM, Apr 15th, 2024
బండారును బూతులు తిట్టిన చంద్రబాబు!

  • పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని బండారుకి ఆశచూపి ఆఖర్లో హ్యాండిచ్చిన చంద్రబాబు.
  • జనసేన తరఫున బండారు చిరకాల ప్రత్యర్థి పంచకర్ల రమేష్‌బాబుకు టికెట్‌ ఇచ్చిన బాబు. 
  • మనస్థాపంతో ఎన్నికల ప్రచారానికి దూరంగా బండారు. 
  • దాంతో పిలిచి మాట్లాడినా వినకపోవడంతో అందరి ముందే బాబు తిట్ల దండకం 
  • ఇదేనా నీ సంస్కారం అంటూ చంద్రబాబుపై నెటిజన్లు సీరియస్‌. 

8:15 AM, Apr 15th, 2024
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి సీరియస్‌

  • చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
  • చంద్రబాబు వయస్సు తగినట్లు మాట్లాడటం లేదు
  • రాజకీయాల్లో హుందాగా వ్యవహరించాలి, హత్య రాజకీయాలు చేస్తున్నాడు చంద్రబాబు
  • చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు అందరు గమనిస్తున్నారు
  • తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో రాళ్ళ దాడి అంటూ చంద్రబాబు డ్రామా చేశాడు.
  • చంద్రబాబుపై గతంలో అలిపిరి బాంబు దాడి జరిగి ముందస్తు ఎన్నికలకు వెళ్తే చిత్తుగా ఓడించారు.
  • ఈ విషయం బాబు గుర్తుంచుకోవాలి
  • రాళ్ళతో కొట్టండి అంటూ సీఎం జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యలు చేశాడు
  • ప్రజలకు అధికారంలో అండగా సంక్షేమంగా చూస్తే మనపై నమ్మకం ఉంచుతారు
  • సీఎం జగన్‌పై జరిగిన దాడి ఘటనను ప్రజలు అందరు ఖండిస్తున్నారు
  • గతంలో ప్రతిపక్ష నేతగా, ఇప్పుడు సీఎంగా ఉన్న జగన్‌పై దాడి జరిగితే కనీసం పరామర్శకు రావాల్సింది పోయి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడు 
  • చంద్రబాబును ప్రజలు అంతా గమనిస్తున్నారు, తగిన బుద్ధి చెప్పేందుకు సిద్దంగా ఉన్నారు

7:30 AM, Apr 15th, 2024
అయ్యన్న..హన్నన్న..నేరాల ప్రీతిపాత్రుడు

  • లేటరైట్‌ను దోచుకున్న మాజీ మంత్రి కుటుంబీకులు 
  • అధికారాన్ని అడ్డుపెట్టుకుని రూ.వందల కోట్ల అక్రమార్జన 
  • అప్పట్లో లేటరైట్‌ అనుమతులు రద్దు చేస్తూ ఇచ్చిన కలెక్టర్‌ ఆదేశాలు బేఖాతర్‌ 
  • పంట కాలువనూ కబ్జా చేసి అక్రమ నిర్మాణం 
  • విధుల్లో ఉన్న ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌పై దాడి
  • కొండలనూ కొల్లగొట్టిన ఘనుడు  

7:15 AM, Apr 15th, 2024
నారాసురుడిది ఆది నుంచీ రక్త చరిత్రే.. 

  • సీఎం జగన్‌కు జనం బ్రహ్మరథం.. ఓర్వేలేని చంద్రబాబు 
  • రాళ్లు.. చేతికి ఏది దొరికితే దానితో సీఎం జగన్‌పై దాడి చేయాలంటూ శనివారం తాడికొండలో టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టిన వైనం 
  • విజయవాడ సింగ్‌నగర్‌లో డాబా కొట్ల సెంటర్‌లో అదే రోజు రాత్రి 8.10 గంటలకు సీఎం జగన్‌పై హత్యాయత్నం 
  • చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ హత్యాయత్నానికి తెగబడ్డారంటున్న వైఎస్సార్‌సీపీ నేతలు, రాజకీయ విశ్లేషకులు 
  • స్కిల్‌ స్కామ్‌లో రాజమండ్రి సెంట్రల్‌ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాMý... చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగని రీతిలో సీఎం జగన్‌ను దారుణంగా శిక్షిస్తానని రంకెలు  
  • ఆది నుంచి కుట్రలు, కుతంత్రాలు, అరాచకత్వం..వెన్నుపోట్లు.. హత్యా రాజకీయాలే చంద్రబాబు సిద్ధాంతం 
  • విద్యార్థి దశలోనే కుల రాజకీయాలతో ఎస్వీ యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు.. 
  • అస్థిత్వం కోసం టీడీపీలో చేరి కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలు.. తన దోపీడీ గుట్టును రట్టు చేస్తున్నారనే నెపంతో నాటి సీఎం ఎన్టీఆర్‌ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావును మట్టుబెట్టించడంతో రక్తదాహం ప్రారంభం 
  • టీడీపీపై పట్టు కోసం ఎన్టీఆర్‌పై మల్లెల బాబ్జీతో హత్యాయత్నం చేయించారని ఆరోపించిన మాజీ సీఎం నాదెండ్ల  
  • వంగవీటి రంగాను అంత మొందించడంలో చంద్రబాబుదే కీలకపాత్ర అని స్పష్టం చేసిన చేగొండి హరిరామజోగయ్య  
  • అధికారం కోసం పిల్లనిచి్చన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు.. వైశ్రాయ్‌ హోటల్‌ వద్ద చెప్పులతో దాడి 
  • అవమాన భారం, మనస్థాపంతో మృతి చెందిన ఎన్టీఆర్‌ 
  • ఎన్టీఆర్‌ మృతికి ప్రత్యక్ష కారకుడు చంద్రబాబేనని నాడూ, నేడూ చెబుతున్న రాజకీయ విశ్లేషకులు 
  • 1995 నుంచి 2004 మధ్య రాజకీయ ప్రత్యర్థులను వెంటాడి, వేటాడి మట్టుబెట్టించడమే ధ్యేయం 
  • రాజకీయ ప్రాబల్యం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన మహానేత వైఎస్‌ కుటుంబంపై కక్ష తీర్చుకునేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు 
  • విశాఖ ఎయిర్‌పోర్టులో నాటి ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం చేయించిన వైనం 
  • గత ఎన్నికలప్పుడు సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపైనే తిరుపతిలో రాళ్లతో దాడి చేయించిన బాబు 
  • ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో అమిత్‌ షాతో కాళ్లబేరం 
  • దుష్టచతుష్టయంతో కలిసి అనునిత్యం కుట్రలే
  • సీఎం జగన్‌పై హత్యాయత్నంతో చంద్రబాబు క్రూర స్వభావం మరోమారు బట్టబయలు 

7:00 AM, Apr 15th, 2024
నేడు సీఎం జగన్‌ బస్సు యాత్ర ఇలా.. 

  • కేసరపల్లి నుంచి ఉదయం 9 గంటలకు సీఎం బస్సు యాత్ర ప్రారంభం 
  • జొన్నపాడు వద్ద భోజన విరామం 
  • సాయంత్రం గుడివాడ వద్ద బహిరంగ సభ 
  • హనుమాన్‌ జంక్షన్‌ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం చేరుకుంటారు. 
  • నారాయణపురం వద్ద రాత్రి బస   

6:55 AM, Apr 15th, 2024
రెచ్చిపోయిన టీడీపీ, జనసేన మూకలు.. 

  • విజయవాడ
  • యనమలకుదురులో తెలుగుదేశం, జనసేనకు చెందిన రౌడీ మూకల దౌర్జన్యం
  • వైఎస్సార్‌సీపీ పార్టీ ప్రచార ఆటోను ధ్వంసం చేసి డ్రైవర్‌ను వెంటపడి తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు
  • ఓటమి తథ్యమని భావించి దాడులకు తెగబడుతున్న ప్రతిపక్షాలు
  • ముఖ్యమంత్రి జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెనువెంటనే మరో ఘటన 
  • పెనమలూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జోగి రమేష్ ప్రచార ఆటోపై దాడి
  • డ్రైవర్‌ను దూషించి, బ్యానర్లు చింపి, ఆటో ధ్వంసం చేసిన బోడే ప్రసాద్ అనుచరులు
  • రానున్న ఎన్నికల్లో ఓటమి తప్పదని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ దాడులకు తెగబడుతున్న వైనం
  • ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులకు ప్రజల నుండి స్పందన లభించకపోవడంతో విధ్వంసం
  • స్థానికంగా అల్లర్లు సృష్టించి పెనమలూరులో శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్న వైనం

6:50 AM, Apr 15th, 2024
టీడీపీ హ్యతా రాజకీయాలపై నిరసనలు..

  • జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్రవ్యాప్తంగా  అభిమానులు, వైఎస్సార్‌సీపీ నేతలు నల్లబ్యాడ్జీలతో ర్యాలీలు 
  • చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌ ప్రోద్బలంతోనే హత్యాయత్నానికి తెగబడ్డారని ఆగ్రహావేశాలు 
  • పలుచోట్ల చంద్రబాబు దిష్టిబొమ్మలు దగ్థం 
  • నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ 
  • చంద్రబాబు, ఆయన భజన బృందాలు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక

6:40 AM, Apr 15th, 2024
టీడీపీ అభ్యర్థికి షాక్‌.. 

  • కృష్ణాజిల్లా..
  • దళితవాడలో గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాముకి చేదు అనుభవం 
  • గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో ఘటన
  • తమ వాడకు రావొద్దంటూ దళిత సంఘాలు ఆందోళన
  • గుడివాడ గడ్డ కొడాలి అడ్డా అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణుల నినాదాలు

6:30 AM, Apr 15th, 2024
కూటమిలో కుంపట్లు.. 

  • విశాఖపట్నం..
  • టీడీపీ కార్పొరేటర్‌పై జనసేన కార్యకర్తలు దాడి
  • 88వ వార్డ్ టీడీపీ కార్పొరేటర్ మొల్లి ముత్యాల నాయుడుపై ఆ వార్డ్ సీనియర్ జనసేన నాయకుడు గల్లా శ్రీను దాడి..
  • ⁠కార్పొరేటర్‌ను చితకబాదిన శ్రీను.
  • ⁠వార్డ్‌లో టీడీపీ, జనసేన నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో దాడి
  • పెందుర్తి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన మొల్లి ముత్యాల నాయుడు 
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పెందుర్తి పోలీసులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement