AP Political News And Election News April 1st Telugu Updates
7:45PM, April 1st 2024
ఏలూరు జిల్లా:
టీడీపీ నేతలను నిలదీస్తున్న ప్రజలు
- నూజివీడులో టీడీపీ అభ్యర్ధి కొలుసు పార్ధసారథికి షాకిచ్చిన నూజివీడు ప్రజలు
- నూజివీడు 10వ వార్డులో ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్న పార్ధసారథి
- మొఘల్ చెరువు ప్రాంతం ప్రజలకు ఇళ్లపట్టాలిస్తానన్న పార్ధసారథి
- కోర్టులో ఉన్న చెరువులో ఇళ్లపట్టాలు ఎట్లా ఇస్తారో సమాధానం చెప్పాలని నిలదీసిన స్థానికులు
- టీడీపీ అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇస్తామన్న పార్ధసారథి
- అదే విషయం బాండ్ రాసివ్వాలని కోరిన వృద్ధురాలు
- వృద్ధురాలి ప్రశ్నలకు ఖంగుతిన్న పార్థసారథి , టీడీపీ నేతలు
- మొఘల్ చెరువు ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పలేక అక్కడ్నుంచి జారుకున్న పార్థసారథి, టీడీపీ నేతలు
6:50 PM, April 1st 2024
ప్రకాశం
ఎన్నికల ముందే వాలంటీర్ వ్యవస్థపై విషం కక్కుతున్నారు చంద్రబాబు:మంత్రి సురేష్
- తెలుగుదేశంలోని బీటీమ్.. అవ్వాతాతల పై కక్ష తీర్చుకొంటున్నారు
- అవ్వ తాతలు వికలాంగుల ఉసురుతో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయం
- పించన్ దారుల చేతిలో ఓటు అనే ఆయుదం ఉన్నది.. వారే ఎవరు ముఖ్యమంత్రి కావాలో నిర్ణయిస్తారు
6:40 PM, April 1st 2024
డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా:
పింఛన్ల విషయంలో రాజకీయాలు చేస్తున్న టీడీపీ నాయకులకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం దగ్గరలోనే ఉంది:
ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
- రాష్ట్రంలో పింఛను దార్లు అంతా సీఎం జగన్‌కు జేజేలు పలుకుతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు ఆదేశాల మేరకు నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేయడం సిగ్గు చేటు
- చంద్రబాబుకు అమాయక ప్రజల పట్ల ఎందుకింత కడుపుమంట అన్నది అర్థం కావడం లేదు
- మొదటి నుంచి ప్రతిపక్షాలు వాలంటీర్లు అంటే వ్యతిరేఖ ధోరణిలో ఉన్నారు
- టిప్పర్ డ్రైవర్‌కి పార్టీ టికెట్ ఇస్తే వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు సిగ్గు పడాలి
- అతి సాధారణ వ్యక్తిని శాసన సభకు పంపించాలనుకోవడం జగన్ ఔన్నత్యానికి నిదర్శనం
- బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపడం టీడీపీకి పరిపాటిగా మారింది
- పింఛన్ల విషయమై ఎన్నికల సంఘానికి పిర్యాదు చేసిన నీచ బుధ్ధి చంద్రబాబుది
6:35 PM, April 1st 2024
తాడేపల్లి:
చంద్రబాబుది నోరా లేకా.. తాటిమట్టా?: పేర్ని నాని
- వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తా అని చంద్రబాబు ఇప్పుడు అంటున్నారు
- ఐదారు నెలల క్రితం వాలంటీర్ వ్యవస్థను తీసేస్తాం అని చంద్రబాబు అనలేదా?
- పెన్షర్లకు డబ్బులు ఇవ్వకుండా ఆపింది ఎవరు?
- వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేశారు
- ప్రభుత్వ కార్యక్రమాల నిలుపుదల చేసింది చంద్రబాబు కాదా?
- నిమ్మగడ్డ రమేష్‌కు ఎవరితో సంబంధాలు ఉన్నాయో తెలియదు
- ఎన్టీఆర్‌ను కూలదోసింది ప్రజలకు తెలియదా?
- చంద్రబాబు చరిత్ర అందరికీ తెలుసు
- ఎవరు దిగివచ్చినా పెన్షన్లు ఆపడం వారితరం కాదు
6:00 PM, April 1st 2024
విశాఖపట్నం:
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చంద్రబాబులో రాక్షస ఆలోచన కనిపిస్తోంది: అవంతి శ్రీనివాస్
- అవ్వ తాతలకు అందే పెన్షన్‌ను అడ్డుకున్నారు
- నిమ్మ గడ్డ రమేష్‌తో వాలంటీర్ల ద్వారా పెన్షన్ అందకుండా అడ్డం పడ్డారు
- టీడీపీ హయాంలో 58 వేల మందికి పెన్షన్ వస్తే.. సీఎం జగన్ ప్రభుత్వం హయాంలో 30 లక్షల మందికి పెన్షన్ అందుతోంది
- వాలంటీర్లు అంటే చంద్రబాబుకు కక్ష.. వాలంటీర్లు ... సచివాలయం వ్యవస్థ వృధా అని చంద్రబాబు అంటారు
- అసలు సచివాలయం వ్యవస్థ వల్లే కోవిడ్ సమయంలో మేలు జరిగిందని ప్రధాని మోదీ అభినందించారు
- తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఆ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు
- వాలంటీర్లు వైఎస్సార్‌సీపీకి ఓటు వేసేస్తారని బాబు భయ పడుతున్నారు
- ఎన్నికల కమిషన్ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి
- మూడు నెలలు ఎన్నికల కోడ్ వుంది. అప్పటి వరకు ఎన్నికల కమిషన్ ఆలోచన చేయాలి.. వృద్ధుల పరిస్థితి గమనించాలి
- చంద్రబాబు కపట వన్నెల పులి...చంద్రబాబు శని...పెన్షన్ ఆపమని అతనే పిటిషన్ వేసి అతనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమని లేఖ రాయడం విడ్డూరం
- ఎన్టీఆర్‌ను వేధించి ఆయన ఫోటోతో రాజకీయం చేసిన కపట నాయకుడు చంద్రబాబు
- ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి ఓటు వేయాలని ఇప్పటికే నిర్ణయించారు
5:40 PM, April 1st 2024
కర్నూలు జిల్లా:
వెల్దుర్తిలో 68 మంది వాలంటీర్లు మూకుమ్మడి రాజీనామా
- జగనన్నకు అండగా నిలిచేందుకు స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్టు ప్రకటించిన వాలంటీర్లు
- ప్రజలకు సేవ చేసేందుకు అవకాశం లేకుండా చేశారంటూ టీడీపీపై విమర్శలు
4:50 PM, April 1st 2024
అనంతపురం:
సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం గా ముందుకు సాగుతోంది: మంత్రి ఉషాశ్రీచరణ్
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ప్రజల మద్దతు మరింతగా పెరిగింది
- బస్సు యాత్ర ద్వారా ప్రజల బాగోగులను సీఎం జగన్ స్వయంగా తెలుసుకుంటున్నారు
- ప్రజలు, మేధావులు ఇచ్చే సలహాలు సూచనలు సీఎం జగన్ వింటున్నారు
- టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు వారికే నష్టం చేకూరుస్తుంది
- వాలంటీర్లపై చంద్రబాబు కక్షసాధింపు లకు పాల్పడుతున్నారు
- చంద్రబాబు నిర్వాకం వల్లే వృద్ధులు, దివ్యాంగులకు సకాలంలో పింఛన్లు అందలేదు
- పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కచ్చితంగా ఓడిపోతారు
4:45 PM, April 1st 2024
అల్లూరి సీతారామరాజు జిల్లా:
పాడేరు తెదేపాలో చల్లారని చిచ్చు
- గిడ్డి ఈశ్వరికి న్యాయం చేయాలి అంటూ టీడీపీ నాయకుల ర్యాలీ
- రమేష్ నాయుడు వద్దు. గిడ్డి ఈశ్వరి ముద్దు అంటూ నినాదాలు
- గిడ్డి ఈశ్వరికి మద్దతుగా పాడేరులో భారీ ర్యాలీ
- పాడేరు సీటుపై అధిష్టానం పునరలోచన చేయాలి
- ఇండిపెండెంట్‌గా గిడ్డి ఈశ్వరిని గెలిపించుకుంటాం కార్యకర్తలు నినాదాలు
4:30 PM, April 1st 2024
నెల్లూరు:
వాలంటీర్ వ్యవస్థ లేకుండా జన్మభూమి కమిటీలు ఉండాలని టీడీపీ భావిస్తోంది
జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు చంద్రశేఖర్‌రెడ్డి
- వాలంటీర్ల సేవలను పొందుతున్న కుటుంబాలను చంద్రబాబు అవమానించారు
- నెల్లూరు నగర అభివృద్ధి మీద మాజీ మంత్రి నారాయణపై చెప్పిన ప్రతిమాట వాస్తవమే
- నెల్లూరు అభివృద్ధి అంటూ హడ్కో ద్వారా మాజీ మంత్రి నారాయణ అప్పు తీసుకుని పనులు పూర్తి చేయలేకపోయారు
- రూ. 830 కోట్లు టీడీపీ హయాంలో నెల్లూరు నగరం కోసం అప్పులు తెచ్చారు.
- గత ప్రభుత్వంలో అప్పులు తీసుకుని అభివృద్ధి అంటూ నారాయణ నాటక మాడితే, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో రూ. 1100 కోట్లతో నెల్లూరును అభివృద్ధి చేశారు
- నెల్లూరు సిటీలో జరిగిన అభివృద్ధిపై మాజీ మంత్రి నారాయణ దమ్ముంటే చర్చకు రావాలి
4:15 PM, April 1st 2024
విశాఖ:
సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి పెన్షన్ దారుడు సంతోషంగా ఉన్నారు: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ
- వాలంటీర్లు నిస్వార్ధంగా సేవ చేస్తున్నారు
- ఎక్కడ అవినీతి లేకుండా పెన్షన్లు అందుతున్నాయి
- సీఎం జగన్ కు వస్తున్న మంచి పేరు చూసి ఓర్వలేక చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు
- చంద్రబాబు చేసిన తీరుతో పెన్షన్ దారుల తీవ్ర ఇబ్బందులు పడతారు
- పేదలు సంతోషంగా ఉండటం చంద్రబాబు నచ్చదు
- పేదలు ఉసురు చంద్రబాబుకు తగులుతుంది
- చంద్రబాబు కుట్రలను ప్రజలు గమనిస్తున్నారన్నారు
2:18 PM, April 1st 2024
కృష్ణాజిల్లా:
మూకుమ్మడి రాజీనామాలు చేసిన వాలంటీర్లు
- మచిలీపట్నం నియోజకవర్గంలో వాలంటీర్లు రాజీనామా
- రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో నిండిపోయిన మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం
- రాజీనామా పత్రాలను మున్సిపల్ కమిషనర్‌కి అందించిన వాలంటీర్లు
- చంద్రబాబు,పవన్, బీజేపీ తీరుపై మనస్థాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వెల్లడి
- ప్రజలకు సేవ చేస్తుంటే మా పై రాజకీయ పార్టీలు నిందలు వేస్తున్నాయి
- పెన్షన్లు ఇవ్వకుండా మమ్మల్ని అడ్డుకోవడం మమ్మల్ని కలచివేసింది
- మా దగ్గర్నుంచి సిమ్స్..డివైస్ లు తీసేసుకున్నారు
- ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారన్నారు
- మేం ఎవరిదగ్గర డేటా సేకరించామో మాకు సమాధానం చెప్పాలి
- మమ్మల్ని ఎన్నో రకాలుగా అవమానించినా భరించాం
- పేదలకు ఇచ్చే పెన్షన్లను ఇవ్వకుండా అడ్డుకోవడం మమ్మల్ని బాధించింది
- ఉదయం నుంచి వృద్ధులు ఫోన్లమీద ఫోన్లు చేస్తున్నారు
- ఇంతకు ముందులా మేం బాధపడాల్సిన పరిస్థితులొచ్చాయని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
2:15 PM, April 1st 2024
జనసేనలో చేరిన మండలి, జయకృష్ణ
- పవన్ సమక్షంలో జనసేనలో చేరిన మండలి బుద్ధ ప్రసాద్, నిమ్మక జయకృష్ణ
- ఇద్దరి నేపథ్యం టీడీపీనే
- అవనిగడ్డ, పాలకొండ స్థానాలకు అభ్యర్థులుగా లైన్‌క్లియర్
- నేడో, రేపో అధికారిక ప్రకటన
- నిరసనలు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న జనసేన కేడర్
1:48 PM, April 1st 2024
అమ్మకానికి అవనిగడ్డ సీటు?
- అమ్మకానికి అవనిగడ్డ, పాలకొండ సీట్లంటూ జనసేనపై విమర్శలు
- అవనిగడ్డ వేలంపాటలో ఓడిన జనసేన నేతలు
- ముగ్గురు జనసేన నేతల పేర్లతో సర్వే చేయించిన పవన్ కల్యాణ్
- డబ్బులకు వేలంపాట పెట్టిన జనసేన
- అవనిగడ్డ అభ్యర్థిగా మండలి బుద్ధ ప్రసాద్ పేరు?
- మండలి బుద్ధ ప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తున్న జనసైనికులు
- ప్రసాద్‌కు టికెట్ ఇస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు
- మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైన వైనం
12:48 PM, April 1st 2024
హిందూపురం బరిలో పరిపూర్ణానంద స్వామి.. ట్విస్ట్
- హిందూపురం నుంచి పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద స్వామి
- హిందూపురం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నా: పరిపూర్ణానంద
- స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా: పరిపూర్ణానంద
- బీజేపీ అంటే గౌరవం ఉంది: పరిపూర్ణానంద
- సీటు విషయంలో బీజేపీ అధిష్టానం పునరాలోచన చేస్తోంది.. నాకే దక్కుతుందనే నమ్మకం ఉంది: పరిపూర్ణానంద
- మోదీ మరోసారి ప్రధాని కావాలన్నదే నా అభిమతం: పరిపూర్ణానంద
- హిందూపురాన్ని అభివృద్ది చేయాల్సిన బాధ్యత నాపై ఉంది: పరిపూర్ణానంద
- ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు హిందూపురం అభివృద్ధిపై లిఖితపూర్వకంగా హామీ ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా : పరిపూర్ణానంద
12:21 PM, April 1st 2024
పెన్షన్ల పంపిణీకి చంద్రబాబు, పురందేశ్వరి, పవన్ శిఖండిలా మారారు: వెల్లంపల్లి శ్రీనివాస్
- వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి ఎన్నికల ప్రచారం
- సంక్షేమ పథకాలు ఆపాలని నీచ రాజకీయాలు చేస్తున్నారు
- వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఎలా ఇస్తారు ?
- చంద్రబాబుకు పెన్షన్ దారులు బుద్ది చెప్తారు
- ఏపీలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది
12:09 PM, April 1st 2024
బజారున పడ్డ తెలుగుదేశం నేతలు
- రోడ్డెక్కిన చంద్రబాబు వెన్నుపోటు బాధితులు
- ఆస్తులు అమ్ముకున్నాం, గౌరవాలు కోల్పోయామని ఆవేదన
- టీడీపీని విమర్శిస్తూ ఉయ్యురు మాజీ జడ్పీటీసీ పూర్ణిమ ఓ పత్రికలో అడ్వర్టైజ్‌మెంట్
12:06 PM, April 1st 2024
జగన్ అంటే నిజం... నిజాన్ని జనం నమ్ముతారు: మంత్రి వేణు
- తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ రాయుడుపాకల గ్రామంలో విఘ్నేశ్వరుని ఆలయంలో పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారంభించిన వైఎస్సార్‌సీపీ రూరల్ అసెంబ్లీ అభ్యర్థి వేణుగోపాలకృష్ణ
- దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనని సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ చేశారు
- ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు శ్రీరామరక్ష
- ఆయన గెలుపును కోరుతూ ప్రజల్లోకి వెళుతున్నాం
- ప్రతి అభ్యర్థిలోనూ ప్రజలు జగన్నే చూస్తారు
- పవన్ కల్యాణ్‌కు సహనం తక్కువ
- ప్రచారం ప్రారంభించిన రెండో రోజే వెళ్లిపోయాడు
- పవన్ కల్యాణ్ పిఠాపురం పరిమితం చేయటం ద్వారా చంద్రబాబు రాజకీయ ప్రదర్శించాడు
- చంద్రబాబును నమ్ముకుని బాగుపడిన వారు చరిత్రలో లేరు
11:42 AM, April 1st 2024
పవన్, చంద్రబాబు ఆ సీటును అమ్మేశారు: కేశినేని
- సుజనా చౌదరిపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఫైర్
- సుజనా చౌదరికి ప్రజలే బుద్ధి చెప్తారు
- విమానాల్లో తిరిగే సుజనా చౌదరి.. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఏం చేస్తారు?
- అసలు వెస్ట్ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు ఉన్నాయో కూడా సుజనాకు తెలియదు
- పవన్, చంద్రబాబు ఆ సీటును అమ్మేశారు
- పోతిన మహేష్‌ను వాడుకుని వదిలేసిన వ్యక్తి పవన్ కల్యాణ్
11:26 AM, April 1st 2024
సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి టీడీపీ కీలక నేతలు
- మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్ సమక్షంలో టీడీపీ నుంచి వైస్సార్ కాంగ్రెసు పార్టీలోకి చేరిన కీలక నేతలు
- సంజీవపురం స్టే పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీలో చేరిన పుట్టపర్తి నియోజకవర్గ అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ(మాజీ ఎంపీపీ), పొట్ట పురుషోత్తం రెడ్డి, పొట్ట మల్లిఖార్జున రెడ్డి
- వైఎస్సార్‌సీపీలోకి హిందూపురం టీడీపీ నేతలు
- సంజీవపురం స్టే పాయింట్ వద్ద సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మాజీ ఎంపీపీ వి హనోక్, టీడీపీ నేత, చంద్ర దండు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ అన్షార్ అహ్మద్
- కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
11:01 AM, April 1st 2024
రాజంపేట టీడీపీలో టికెట్ వార్
- రాజంపేట టీడీపీ ఇన్‌ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ
- టీడీపీ రాజంపేట అభ్యర్థిగా రాయచోటికి చెందిన సుగువాసి సుబ్రహ్మణ్యంను ఖరారు చేయడంతో బత్యాల చెంగల్ రాయుడు నిరసన
- సుగవాసి వద్దు బత్యాల ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు
- రాజంపేట టీడీపీ అభ్యర్థిగా బత్యాల చంగల్ రాయుడిని ప్రకటించాలని డిమాండ్
- రాజంపేట పాత బస్టాండ్ నుంచి మన్నూరు యల్లమ్మ దేవస్థానం వరకు భారీ నిరసన ర్యాలీ
- పెద్ద ఎత్తున పాల్గొన్న బత్యాల వర్గం
10:43 AM, April 1st 2024
జమ్మలమడుగులో మారుతున్న రాజకీయ సమీకరణాలు
- జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి
- బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమన్న భూపేష్‌రెడ్డి
- బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరు పరిశీలన
- బీజేపీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు
- జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి పెరగనున్న మరో సీటు
10:20 AM, April 1st 2024
తెలంగాణ పోలీసు నుంచి పరారైన టీడీపీ నేత శివానందరెడ్డి
- నంద్యాల నందికొట్కూరు (మ) అల్లూరు గ్రామంలో టీడీపీ నేత, మాజీ ఐపీఎస్ మాండ్ర శివానంద రెడ్డి ఇంట్లో తెలంగాణ పోలీసులు సోదాలు
- భూవివాదం కేసులో విషయంలో శివానంద రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన తెలంగాణ సీసీఎస్ పోలీసులు
- తెలంగాణ పోలీసులతో వాగ్వాదానికి దిగిన శివానందరెడ్డి
- పెద్ద ఎత్తున శివానందరెడ్డి ఇంటికి చేరుకున్న టీడీపీ శ్రేణులు
- పోలీసుల విధుల్ని అడ్డగించేందుకు టీడీపీ నేతల యత్నం
- దొరక్కుండా ఇంట్లో నుంచే కారులో పరారైనా టీడీపీ నేత శివానందరెడ్డి
9:55 AM, April 1st 2024
‘లంచాల కోసం ఆఫీసులు పెట్టిన చరిత్ర కిరణ్‌కుమార్‌రెడ్డిది’
- సీఎం జగన్ బస్ యాత్ర కి అనూహ్యమైన స్పందన వస్తోంది
- నా రాజకీయ చరిత్రలో ఎన్నడూ చూడని జనం బస్సు యాత్రలో కనిపిస్తున్నారు
- 175 సీట్లు గెలుస్తామన్న నమ్మకం బస్ యాత్ర తో కలిగింది
- చంద్రబాబు కి రాయలసీమలో ఓటు అడిగే హక్కు లేదు
- రాయలసీమ లో ఒక్క ప్రాజెక్టు అయిన చంద్రబాబు కట్టాడా?
- సీఎం జగన్ రాయలసీమ లో ప్రాజెక్టు లు పూర్తి చేస్తున్నారు
- చంద్రబాబుని కుప్పంలో కూడా ఒడిస్తాం
- కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చింది సీఎం జగన్
- సొంత జిల్లాకి కూడా మేలు చేయని వ్యక్తి చంద్రబాబు
- అమిత్ షా కాళ్ళు పట్టుకుని బీజేపీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు
- రోజుల తరబడి ఢిల్లీలో పడిగాపులు కాసి పొత్తు పెట్టుకున్నాడు
- ఇప్పుడు బీజేపీ నే పొత్తు ఆడిగిందని అబద్దాలు చెప్తున్నాడు
- కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం) కి నా కోసం మాట్లాడే అర్హత లేదు
- ఆఫీస్ పెట్టి లంచాలు వసూలు చేసిన చరిత్ర కిరణ్ కుమార్ రెడ్డి ది
- ఎన్నికలు అవ్వగానే కిరణ్ కుమార్ రెడ్డి సూట్ కేస్ సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాడు
- సీఎం పదవి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిన ద్రోహి కిరణ్ కుమార్ రెడ్డి
- సీఎం జగన్ ని అనగదొక్కడానికి సోనియాగాంధీ తో కుమ్మక్కయ్యాడు
- ఇప్పుడు మేము ఓడించి బుద్ధి చెప్తాము
అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు
9:25 AM, April 1st 2024
హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోనున్న పవన్
- ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్ నుంచి పిఠాపురం చేరుకోనున్న పవన్
- మధ్యాహ్నం 12 గంటల నుంచి నియోజకవర్గ కార్యకర్తలతో పవన్ అంతర్గత సమీక్ష
- నేడు అంతర్గత పార్టీ సమీక్షలకు పరిమితం కానున్న పవన్
- నిన్న పిఠాపురంలో అర్ధాంతరంగా ముగిసిన పవన్ పర్యటన
- ఆకస్మికంగా హైదరాబాద్‌కు పయనం
9:10 AM, April 1st 2024
అవనిగడ్డ రాజకీయాల్లో కీలక పరిణామాలు
- నేడు జనసేన లో చేరనున్న మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
- ఇప్పటికే పవన్ తో చర్చలు పూర్తయినట్లు సమాచారం
- కూటమి తరపున జనసేన అభ్యర్థిగా బుద్ధప్రసాద్ పోటీ చేస్తారని ప్రచారం
- అవనిగడ్డ టికెట్ పెండింగ్‌లో పెట్టిన జనసేన
- జనసేనలో బుద్ధప్రసాద్ చేరాక రేపు లేదా ఎల్లుండి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం
9:07 AM, April 1st 2024
బాపట్లలో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ
- బాపట్ల లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు భేటీ
- ఎన్నికలలో వ్యూహ, ప్రతివ్యూహాలపై నేతలతో చంద్రబాబు చర్చ
- ఉదయం 10 గంటలకు హెలికాఫ్టర్ లో హైదరాబాద్ వెళ్లనున్న చంద్రబాబు
9:05 AM, April 1st 2024
విజయనగరం జిల్లా:
చంద్రబాబు తీరుపై సీనియర్ నేత అశోక్ గజపతి రాజు అసహనం
- చంద్రబాబు నిర్ణయాలు వలన పార్టీ నాశనం అయింది
- ఇక రాజకీయాలకు దూరంగా ఉంటాను
- ఎవరైనా అడిగితే ఉచిత సలహాలు ఇస్తుంటాను
- ఆఫ్ ది రికార్డు అంటూ మీడియా ప్రతినిధులతో అశోక్ గజపతి రాజు చిట్ చాట్
8:25 AM, April 1st 2024
ప్రజాగళానికి చంద్రబాబు బ్రేక్
- టీడీపీ ఎన్నికల ప్రచార ప్రజాగళం సభలకు రెండ్రోజుల విరామం
- బాపట్ల ప్రచారం నుంచి నేరుగా హైదరాబాద్‌కు చేరిన చంద్రబాబు
- హైదరాబాద్‌లోనే రెండ్రోజులు ఉండనున్న ప్రతిపక్ష నేత
- ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితిపై సమీక్ష
8:12 AM, April 1st 2024
చంద్రబాబు అండ్ కో కుట్ర.. వృద్దులు, వికలాంగులపై పెన్షన్ల పంపిణీ ఎఫెక్ట్
- చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో పెన్షన్‌దారులకు అవస్థలు
- వాలంటీర్లను పెన్షన్ పంపిణీ బాధ్యత నుండి తప్పించిన కేంద్ర ఎన్నికల సంఘం
- చంద్రబాబు కుట్రలతో మూడు నెలలపాటు పెన్షన్ దారులకు తప్పని ఇబ్బందులు
- గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం చర్యలు
- ఎండ, వడగాడ్పులను తట్టుకుని వెళ్తేనే అందనున్న పెన్షన్
- నడవలేని వృద్దులు, వికలాంగుల పరిస్థితి అగమ్యగోచరం
- వాలంటీర్లు ఉన్నప్పుడు అందరికీ తెల్లవారుజామునే పెన్షన్ల పంపిణీ
- చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ చౌదరి కుట్రలతో తీవ్ర ఇబ్బందులు పడనున్న పెన్షన్ దారులు
7:42 AM, April 1st 2024
నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు
- వచ్చే సార్వత్రిక ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాపై కసరత్తు పూర్తిచేసిన ఏపీ కాంగ్రెస్
- ఏఐసీసీ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం
- స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన తుది జాబితాపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు.
- ఆదివారం రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మధుసూధన్ మిస్త్రీ నేతృత్వంలో జరిగిన సమావేశంలో లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థుల తుది జాబితాపై చర్చ
- ఇందులో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సూరజ్ హెగ్డే, షఫీ పరంబిల్‌లతో పాటు పాల్గొన్న పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్కం ఠాగూర్, రఘువీరారెడ్డి, కొప్పుల రాజు
- దాదాపు అన్ని స్థానాలకు సంబంధించిన తుది జాబితాను ఖరారు
- ఆశావహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మాత్రం రెండు, మూడు పేర్లతో కూడిన జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ ముందు ఉంచనున్నారు
7:18 AM, April 1st 2024
కూటమికి 'గోదారి'లో ఎదురీతే!
- అధికారమే లక్ష్యంగా జత కట్టిన మూడు పార్టీలు
- సీట్ల కేటాయింపులో తప్పటడుగులు.. రెండు ప్రధాన సామాజిక వర్గాలకు మొండిచేయి
- జనసేనలో శెట్టిబలిజలకు ప్రాతినిధ్యం నిల్..
- కాపులను విస్మరించిన కమలనాథులు..
- ఆ రెండు వర్గాలకూ వైఎస్సార్‌సీపీ పెద్దపీట
7:13 AM, April 1st 2024
నేడు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇలా..
- మేమంతా సిద్ధం 5వ రోజు సోమవారం (ఏప్రిల్1) షెడ్యూల్
- యాత్రలో భాగంగా సీఎం జగన్ ‘ శ్రీసత్యసాయి జిల్లాలోని సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి బత్తలపల్లి, రామాపురం, కట్ట కిందపల్లి, రాళ్ళ అనంతపురం, ముదిగుబ్బ, ఎన్‌ఎస్‌పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు.
- పట్నం నడింపల్లి, కాళసముద్రం, ఎర్ర దొడ్డి మీదుగా కుటాగుళ్లకు చేరుకుని మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు
- అనంతరం బయలుదేరి కదిరి చేరుకుంటారు.
- అక్కడ పీవీఆర్ ఫంక్షన్ హాల్ లో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు
- మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్.ములకలపల్లె, మీదుగా చీకటిమనిపల్లెలో రాత్రి బసకు వెళతారు.
7:09 AM, April 1st 2024
పింఛన్లపై బాబు డబుల్ గేమ్
- అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు
- ఇటు పంచాలంటూ లేఖలు
- ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన
- అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం!
- ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి!
- స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు
- పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్న చంద్రబాబు
ఇంటింటికీ పింఛన్ ఇస్తున్న వాలంటీర్ల సేవలను కుట్రతో అడ్డుకున్న @ncbn, ఆయన మద్దతుదారులు
— YSR Congress Party (@YSRCParty) March 31, 2024
అవ్వాతాతల్లారా 2 నెలలు ఓపిక పట్టండి. మళ్లీ వచ్చేది జగనన్న ప్రభుత్వమే.#TDPAgainstVolunteers#TDPAntiPoor#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/Z31qiuWEjw
7:05 AM, April 1st 2024
పేదలపై ఇంత కక్ష ఎందుకు బాబూ?
- జాతిపిత ఆశయాలను సీఎం జగన్ నెరవేరుస్తుంటే ఇన్ని అడ్డంకులా?
- పేదలకు పెన్షన్లు ఇస్తున్న వలంటీర్లపై కత్తికడతారా?
- చంద్రబాబు వైఖరిపై యూకేలో గాంధీ విగ్రహం వద్ద ప్రవాసాంధ్రుల నిరసన
7:04 AM, April 1st 2024
కూటమిలో కుతకుత
- రాష్ట్రంలో ఎక్కడా నేతల మధ్య కనిపించని ఐక్యత
- క్షేత్రస్థాయిలో నాయకుల అసంతృప్తి ప్రకంపనలు
- అభ్యర్థులకు సహకరించేందుకు అసంతృప్తులు ససేమిరా
- జగ్గయ్యపేటలో తాతయ్యకు టికెట్‌పై మండిపడుతున్న కేడర్
- అధిష్టానంపై అసంతృప్తితో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా రాజీనామా
- పాడేరులో అభ్యర్థి ఎంపికపై శ్రేణుల వ్యతిరేకత
- అనంతపురం అర్బన్‌లో టీడీపీ రెబల్‌గా పోటీ చేయనున్నట్టు ప్రభాకర చౌదరి వెల్లడి
- రంపచోడవరంలో మిరియాల శిరీషకు తమ్ముళ్ల నుంచి నిరసన సెగ
- నందిగామ అభ్యర్థి తంగిరాల సౌమ్యను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు
- గుంతకల్లులో గుమ్మనూరుపై దేశం శ్రేణుల గుర్రు
- మార్కాపురంలో టీడీపీ, బీజేపీల మధ్య ఫ్లెక్సీల చిచ్చు
- అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటిపై జనసేన నాయకుల ఆగ్రహం
- అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై స్వపార్టీలోనే నిరసన
6:54 AM, April 1st 2024
వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు: సజ్జల రామకృష్ణారెడ్డి
- చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు:
- చంద్రబాబుది మోసపూరిత రాజకీయం
- వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు
- పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు
- నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు
- సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే
- వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి
- చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు
- వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది
- ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?
- చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు
- తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు
- వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయి.
- పవన్‌ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం.
- పవన్‌కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు.
- వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు కక్ష కట్టారు
- వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం
- బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి
- పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే
- చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది
- ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యం
- బాబు కడుపు మంటతో వృద్ధులు, వికలాంగులకు సేవలను నిలిపివేశారు
- టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పని చేస్తారు
- రాష్ట్ర ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు
- జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది
- పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు
- పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది
- ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు
- సీఎం సీఎం అనే పరిస్థితి నుండి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు
- బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది
- టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది
- అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు
- ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం
- కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయింది
- ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు
పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే @ncbnకి గిట్టదు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే సంస్థలో ఉండేది అంతా @JaiTDP మనుషులే.
— YSR Congress Party (@YSRCParty) March 31, 2024
-వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి#TDPAgainstVolunteers#TDPAntiPoor#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/HoPN0fxznB
Comments
Please login to add a commentAdd a comment