AP Political News And Election News March 31th Telugu Updates
9:20 PM, March 31th 2024
ఎన్టీఆర్ జిల్లా:
నందిగామ టీడీపీ అభ్యర్ధి తంగిరాల సౌమ్యకు షాక్
- వీరులపాడు మండలం పెద్దాపురం గ్రామంలో దళిత మేలుకో కార్యక్రమం లో పాల్గొన్న తంగిరాల సౌమ్య
- సౌమ్యను అడ్డుకున్న దళితులు
- తమకు తెలియకుండా ఎలా కార్యక్రమం నిర్వహిస్తారంటూ సౌమ్య కారుని అడ్డుకున్న దళితులు
- సౌమ్యను అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగిన టీడీపీ శ్రేణులు
- ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం
- రంగంలోకి దిగిన పోలీసులు
8:50 PM, March 31th 2024
బాపట్ల జిల్లా:
టీడీపీ, బీజేపీ ,జనసేన పార్టీలకు వాలంటీర్లు అంటే భయం అనుకున్నాం: ఎంపీ నందిగామ సురేష్
- కానీ వాలంటీర్లు అంటే సింహం స్వప్నాలని ఇప్పుడు తెలిసింది
- కోర్టుకు వెళ్లి పెన్షన్ దారులను ఇబ్బంది పెట్టడం లో చంద్రబాబు, పవన్ హస్తం ఉంది
- పేద ప్రజలు టీడీపీకి ఓటు వేయలేదని చంద్రబాబు కక్ష పెట్టుకుని ఇలాంటి చర్యలకు పాల్పడ్డాడు
- రాష్ట్రంలో 30 లక్షల మంది డ్రైవర్లు టీడీపీకి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి
7:00 PM, March 31th 2024
కృష్ణాజిల్లా:
కూటమి ఎంపీ అభ్యర్ధి బాలశౌరిపై అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ఫైర్
- ప్రజలకు మంచి జరిగేలా వాలంటీర్‌లు పని చేస్తున్నారు
- జగన్ ప్రభుత్వంలో జరిగే మంచి పనిని సహించలేని మనస్తత్వం చంద్రబాబుది
- పీజీ చదివిన వ్యక్తికి టీడీపీ హయాంలో ఉద్యోగం రాకపొతే ట్రక్ డ్రైవర్‌గా చేరాడు
- ట్రక్ డ్రైవర్‌ని లోకువ చేసి చంద్రబాబు మాట్లాడుతున్నాడు
- ఎంతమందిని కలుపుకున్నా చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదు
- చంద్రబాబుకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు
- కుడితిలో పడ్డ ఎలుకలా బాలశౌరి పరిస్థితి తయారైంది
- బాలశౌరి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నాడు
- ఒకసారి రాజశేఖరరెడ్డి హయాంలో, రెండవసారి జగన్ హయాంలో బాలశౌరి ఎంపీ అయ్యాడు
- ఎక్కడ బాధలు, కష్టం ఉంటే అక్కడ ఉంటానని బాలశౌరి అంటున్నాడు
- కరోనా సమయంలో బాలశౌరికి అవనిగడ్డ, బందరు, పెడన ఎందుకు గుర్తుకురాలేదు..?
- బ్రోకరేజ్ ఎక్కడ ఉంటే అక్కడ బాలశౌరి ఉంటాడు
- బ్రోకర్ కాకాపోతే జగన్‌ని వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం బాలశౌరికి లేదు
- నీతి, నిజాయితీ కలిగిన వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి
- సీఎం జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి
- ఇచ్చిన మాట ప్రకారం బందరు పోర్టు పనులు ప్రారంభించారు
- మచిలీపట్నం పార్లమెంటరీలో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలవబోతోంది
6:45 PM, March 31th 2024
పశ్చిమగోదావరి జిల్లా:
గత టీడీపీ ప్రభుత్వంలో అవ్వ తాతలు పెన్షన్ కోసం ఎదురుచూసి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు ఉండేవి:
వైఎస్సార్‌సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి
- ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించే విధంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చారు
- చంద్రబాబు నాయుడు తన అనుచరుడైన నిమ్మగడ్డ రమేష్‌తో కోర్టులో వాలంటీర్ సేవలు నిలిపి వేశాడు
- గత టీడీపీ పరిస్థితులను తీసుకురావాలని చూస్తున్నాడు
- ఎన్నికల్లో టీడీపీకి చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు
6:30 PM, March 31th 2024
శ్రీ సత్యసాయి జిల్లా:
కదిరిలో టీడీపీకి ఎదురుదెబ్బ
- టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా
- చంద్రబాబు మైనారిటీల ద్రోహి: మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా
4:30 PM, March 31th 2024
సీఎం జగన్ పాలన చూసి మీకు భయం పుడుతోంది: పేర్ని నాని
- సీఎం జగన్ పాలనలో సేవలను అడ్డుకోవాలనేదే చంద్రబాబు లక్ష్యం
- సిటిజన్ ఫర్ డెమొక్రసీ రాజకీయ ప్రేరేపిత సంస్థ
- టీడీపీ నేతల కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు ఉండటం లేదు
- జగన్ ప్రభుత్వం మేలైన సేవలు అందిస్తుందని వీరికి కడుపు మంట
- గత ఆరు నెలలుగా ఎన్నికలే లక్ష్యంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు
- ఈనాడులో జగన్ మీద ఏం వార్తలు రాసినా ఎన్నికల కమిషన్ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు?
- ఎన్నికల సంఘం ఈనాడుకు ఎందుకు లొంగిపోయింది?
- ఈనాడులో వార్త రావటం, ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవటం ఏంటి?
- ఎన్నికల వ్యవస్థను రామోజీరావను నడుపుతున్నాడా?
- వాలంటీర్లను కొనసాగిస్తామంటూ ఒకవైపు చెబుతారు
- మరొకవైపు వాలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్ర
- చంద్రబాబు ఆఫీసు ఎదుట అడ్డగోలుగా ఫ్లెక్సీలు పెట్టినా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
- భువనేశ్వరి మూడు లక్షల చెక్కులు ఇస్తుంటే ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు?
- దానిపై మేము ఫిర్యాదు చేస్తే కనీసం నోటీసులు కూడా ఎందుకు ఇవ్వరు?
- ఎన్నికల సంఘాన్ని ఎవరు ప్రభావితం చేస్తున్నారు?
- ఈ పక్షపాత ధోరణిలో ఎన్నికల సంఘం ఎందుకు వ్యవహరిస్తోంది?
- ఎన్నికల కోడ్ వచ్చేంతవరకు వాలంటీర్లు రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసేవారని విమర్శించారు
- కోడ్ వచ్చాక వారికి యాభై వేల జీతం ఇస్తామని కళ్లబొల్లి మాటలు చెప్తున్నారు
- వాలంటీర్లపై వేటు వేయించటం ద్వారా పేదలందరినీ ఇబ్బందులు పెట్టారు
- మూడు నెలలపాటు 66 లక్షల మంది పేదలు నరకయాతన పడేలా చంద్రబాబు బ్యాచ్ కుట్ర పన్నింది
- వీరి దుర్మార్గపు చర్యలను రాష్ట్ర ప్రజలు తిప్పికొట్టాలి
- వచ్చే ఎన్నికలలో కర్రు కాల్చి వాత పెట్టాలి
- బీజేపీకి ఓటేయొద్దని చంద్రబాబు అంటున్నారు
- తమ పార్టీ అభ్యర్థి పేరు తెలియక నువ్వు ఎవరు అని అడుగుతున్నారు
- చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయింది
4:00 PM, March 31th 2024
శ్రీకాకుళం:
చంద్రబాబు పవన్, పచ్చ మీడియా కలిసి మొత్తం వలంటీర్ల వ్యవస్థనే తుంచేసే కుట్రలు: మంత్రి సీదిరి అప్పలరాజు
- ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల ఇంటిగడప వద్దకే చేరుస్తున్న వలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ మొదటినుంచీ కుట్రలు చేస్తున్నారు
- వలంటీర్లు జీతాలు కోసం కాకుండా సేవా దృక్పథంతో పనిచేస్తున్నారు
- చంద్రబాబు ప్రయోజనాలను కాపాడటం కోసం నిమ్మగడ్డ రమేష్ పనిచేస్తున్నారు
- పేదల కోసం పని చేసే వలంటీర్లపై ఫిర్యాదు చేయటానికి సిగ్గు లేదా చంద్రబాబు?
3:55 PM, March 31th 2024
నెల్లూరు జిల్లా:
ఆత్మకూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 100 మంది టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరిక
- వారికి వైఎస్సార్‌సీపీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే విక్రమ్‌రెడ్డి
- ఆత్మకూరులో టీడీపీ భూస్థాపితం అవ్వడం ఖాయమని ఎమ్మెల్యే వెల్లడి
3:40 PM, March 31th 2024
తాడేపల్లి :
ఎల్లోమీడియాపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
- చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టుగా ఉంటున్నాయి
- అసలు దున్నా లేదు. దూడా లేదు
- నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది
- ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే చేయించినట్టు, వైఎస్సార్‌సీపీ హస్తమున్నట్టు అబద్ధాలను కొత్త ఎత్తులకు తీసుకెళ్తోంది పచ్చమీడియా
- అదృష్టవశాత్తు జనాలకు వీళ్ల కపటత్వం అర్థమైంది కాబట్టి వంకర రాతలను ఎవరూ పట్టించుకోవడం లేదు.
చంద్రబాబు గారి ముఖంలో వెలుగు చూడాలన్న తపనతో ఎల్లో మీడియా రాస్తున్న రాతలు ‘దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్టు’గా ఉంటున్నాయి. అసలు దున్నా లేదు. దూడా లేదు. నిత్యం జగన్ గారి ప్రభుత్వంపై అర్థం పర్థం లేని రాతలతో కుళ్లు వెళ్లబోసుకుంటోంది. ఎక్కడ ఏది జరిగినా అది జగన్ గారే…
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2024
3:30 PM, March 31th 2024
నంద్యాల జిల్లా:
డోన్ టీడీపీలో దుమారం రేపుతున్న బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యలు
- కేఈ సోదరులపై బీసీ జనార్దన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
- డోన్‌లో ఏర్పాటు చేసిన కోట్ల , సుబ్బారెడ్డి వర్గీయుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా హాజరైన బీసీ
- కే ఈ సోదరులను చిల్లరగాళ్ళు, బ్రోకర్లు,నెత్తిమీద పావలా పెడితే చెల్లని వాళ్ళు,కమీషన్లతో నోట్ల కట్టలు వెనక్కి వేసుకున్న హీన చరిత్ర కలిగినోళ్లు నన్ను కోవర్టు అంటారా అంటూ పరోక్షంగా ఘాటు విమర్శలు చేసిన బీసీ
- ఈ సమావేశానికి దూరంగా ఉన్న కేఈ వర్గీయులు
- కేఈ , కోట్ల వర్గీయులు కలిసి ఎన్నికలకు ముందుకు వెళుతున్న ఈ సమయంలో బీసీ జనార్ధన్‌రెడ్డి తమ నియోజివర్గానికి వచ్చి మా మధ్య చిచ్చు పెట్టి వెళ్లాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు
3:10 PM, March 31th 2024
విజయనగరం జిల్లా:
- విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్ధికి షాక్ ఇచ్చిన కూటమి ఎమ్మెల్యే అభ్యర్దులు
- పరిచయ కార్యక్రమానికి డుమ్మాకొట్టిన 5గురు ఎమ్మెల్యే అభ్యర్ధులు
- ఇంటింటికి వెళ్లి పిలిచినా మొహం చాటేసిన అభ్యర్ధులు
- డుమ్మాకొట్టిన వారిలో కళావెంకటరావు, కోండ్రుమురళీ మోహన్, ఎన్.ఈశ్వరరావు, కొండపల్లి శ్రీనివాసరావు, బేబినాయిన
- ఎంపీ అభ్యర్ధి కలిశెట్టి అప్పలనాయుడును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీడీపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్దులు
- కూటమి టికెట్‌ల పై సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు తీవ్ర అసహనం
- చంద్రబాబు నిర్ణయాలు పార్టీని నాశనం చేస్తున్నాయని మీడియా ఆఫ్ ద రికార్డ్ లో వ్యాఖ్య
- ఇక నుండి రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటన
- పార్టీ కోరుకుంటే ఉచిత సలహాలు ఇస్తుంటాను అని వెటకారంగా చెప్పిన అశోక్ గజపతి రాజు
2:50 PM, March 31th 2024
అనంతపురం:
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీకి ఎదురుదెబ్బ
- ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానంటున్న టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
- అనంతపురం టిక్కెట్ దగ్గుపాటి ప్రసాద్ కు కేటాయింపు పై ప్రభాకర్ చౌదరి మనస్తాపం
- అనంతపురం కమ్మ భవన్ లో టీడీపీ కార్యకర్తలతో సమావేశమైన వైకుంఠం ప్రభాకర్ చౌదరి
- కార్యకర్తలు కోరితే అనంతపురం అర్బన్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా
2:30 PM, March 31th 2024
చంద్రబాబుకు ప్రజల ప్రయోజనాలు అవసరం లేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
- వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు
- చంద్రబాబుది మోసపూరిత రాజకీయం
- వాలంటీర్లపై చంద్రబాబు పూటలో మాట మాట్లాడుతున్నారు
- పేదలకు మేలు చేసే వ్యవస్థ అంటే చంద్రబాబుకు గిట్టదు
- నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబు తరపున పని చేస్తున్నారు
- సిటిజన్ ఫర్ డెమొక్రసీలో ఉండేది చంద్రబాబు మనుషులే
- వాలంటీర్ వ్యవస్థను బాబు పెడితే 2.5 లక్షల జలగలు తయారయ్యేవి
- చంద్రబాబుకు ఇంగిత జ్ఞానం కూడా లేదు
- వృద్ధులను, వికలాంగులను ఇబ్బంది పెడితే ఏమొస్తుంది
- ఓ రాజకీయ పార్టీ వ్యవహరించే తీరు ఇదేనా?
- చంద్రబాబు విజ్ఞత కలిగిన రాజకీయ నాయకుడు కాదు
- తానొస్తే ఈ వ్యవస్థలు ఏమీ ఉండవని చంద్రబాబు మెసేజ్ ఇచ్చారు
- వాలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రభుత్వ పథకాలను నేరుగా ఇంటింటికీ అందుతున్నాయి.
- పవన్‌ను చంద్రబాబు మింగేస్తాడని ముందే చెప్పాం.
- పవన్‌కు ఇచ్చిన సీట్లలోనూ చంద్రబాబు మనుషులే ఉన్నారు.
- వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి చంద్రబాబు కక్ష కట్టారు
- వాలంటీర్లంటే చంద్రబాబుకు ఎందుకంత భయం
- బాబు లాంటి వ్యక్తి అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి
- పెన్షన్లు కాదు కదా.. కనీసం దరఖాస్తు చేసుకోవడం కూడా కష్టమే
- చిన్న సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి ఉండేది
- ప్రభుత్వ పథకాలు నేరుగా ప్రజలకు అందించడమే వాలంటీర్ల లక్ష్యం
- బాబు కడుపు మంటతో వృద్ధులు, వికలాంగులకు సేవలను నిలిపివేశారు
- టీడీపీ స్క్రిప్ట్ ప్రకారం నిమ్మగడ్డ రమేష్ పని చేస్తారు
- రాష్ట్ర ప్రజల అవసరాలు చంద్రబాబుకు పట్టవు
- జగన్ బస్సుయాత్రకు జనసునామీ కదిలి వస్తోంది
- పొత్తు పెట్టుకున్న జనసేన, బీజేపీలను చంద్రబాబు మింగేశారు
- పిఠాపురానికి ఎవరో పంపితే పవన్ వెళ్లాల్సి వచ్చింది
- ఇష్టం లేకుండా పవన్ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు
- సీఎం సీఎం అనే పరిస్థితి నుండి చివరికి 21 సీట్లకే పరిమితం అయ్యాడు
- బీజేపీ పరిస్థితి కూడా అలాగే ఉంది
- టీడీపీలో జెండా ఎత్తేసే పరిస్థితి వచ్చిందని చంద్రబాబుకు అర్థం అయింది
- అందుకే చౌకబారు మాటలు, దూషణలతో ప్రచారం చేస్తున్నారు
- ఈ ఎన్నికలు రాష్ట్ర ప్రజలకు అత్యంత కీలకం
- కుట్రలు చేసే వారెవరో, మేలు చేసే వారెవరో ప్రజలకు అర్థం అయింది
- ప్రతి ఇంట్లో ఉన్న లబ్ధిదారులే మాకు స్టార్ క్యాంపెయినర్లు
2:25 PM, March 31th 2024
విజయవాడ
టీడీపీపై కృష్ణాజిల్లా బీజేపీ శ్రేణులు ఆగ్రహం
- కూటమి పొత్తు వల్ల నిజమైన బీజేపీ నేతలు,శ్రేణులు ఇబ్బంది పడుతున్నాం
- పార్టీ కోసం కష్టపడిన వారికి తీవ్ర అన్యాయం జరిగింది
- జీవీఎల్, పీవీఎన్ మాధవ్, సోము వీర్రాజు,పరిపూర్ణానంద స్వామి , విష్ణువర్థన్‌రెడ్డి వంటి వారికి తీరని అన్యాయం జరిగింది
- జీవీఎల్ మూడేళ్లుగా విశాఖలో అనేక కార్యక్రమాలు చేశారు
- సోమువీర్రాజు అధ్యక్షతన పార్టీ ఎంతో బలోపేతం అయ్యింది
- నిజనైన బీజేపీ నేతలకు వెన్నుపోటు పొడిచారు
- టీడీపీ నేతలెవరూ బీజేపీకి సహకరించడం లేదు
- బీజేపీని నమ్ముకున్న వారిని పార్టీకి దూరం చేస్తున్నారు
- అనపర్తిలో బీజేపీ అభ్యర్ధి పై తప్పుడు ప్రచారం చేస్తే ఏ ఒక్కరూ స్పందించలేదు
- బీజేపీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే చూస్తూ ఊరుకోం
- టీడీపీ నేతలకు తగిన గుణపాఠం చెబుతాం
- బీజేపీ నేతలపై టీడీపీ సోషల్ మీడియా తప్పుడు రాతలు రాస్తోంది
- సోషల్ మీడియాలో అసత్య ప్రచారం మానుకోకపోతే టీడీపీ వారి పై సైబర్ కేసులు పెడతాం
- మీ కుటుంబ సభ్యుల కోసం పొత్తు పెట్టుకుని బీజేపీ వారిని తిట్టిస్తారా... ఇదేనా పొత్తు ధర్మం
- అమిత్ షా, మోదీని బూతులు తిట్టిన పార్టీ టీడీపీ
- బీజేపీ నేతలను దుర్భాషలాడుతుంటే చంద్రబాబు నోట్లో లాలీపాప్ పెట్టుకున్నాడా
- చంద్రబాబు మేమేమైనా టిష్యూ పేపర్ అనుకుంటున్నారా
- మా కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం
=కృష్ణాజిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు,కొర్రపోలు శ్రీనివాసరావు
టీడీపీ నేతలు పొత్తు ధర్మం పాటించడం లేదు
- గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు మమ్మల్ని కలుపుకుపోవడం లేదు
- బీజేపీకి కొన్ని సిద్ధాంతాలున్నాయి
- పొత్తు ధర్మాన్ని యార్లగడ్డ విస్మరిస్తున్నారు
-మల్లెపూడి సతీష్ బాబు, కృష్ణాజిల్లా లీగల్ సెల్ కన్వీనర్
2:20 PM, March 31th 2024
వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదు చేయడం రాజకీయ కుట్రే: భూమన
- అవ్వా తాతలు ఇబ్బంది పడకుండా ఇంటి వద్దే పెన్షన్లు ఇస్తున్నారు
- వాలంటీర్లపై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు
- వాలంటీర్ వ్యవస్థపై తప్పుడు సమాచారం ఇవ్వడం బాధాకరం
- బాబు కుటిల రాజకీయాలు నీచస్థాయికి చేరాయి
2:10 PM, March 31th 2024
నిమ్మగడ్డ రమేష్, టీడీపీ కోవర్ట్: కారుమూరి సునీల్
- ప్రజలను ఇబ్బంది పెట్టడంలో టీడీపీకి ముందుంటుంది
- వృద్ధులు ఇబ్బంది పడటం, బాబుకు ఆనందం
- టీడీపీ నేతలు మానవ బాంబుల్లా వ్యవహరిస్తున్నారు
1:20 PM, March 31th 2024
విశాఖ సౌత్ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
- జనసేన విశాఖ సౌత్ అభ్యర్థిగా వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్
- ఈ మేరకు వంశీకృష్ణ పేరును ప్రకటించిన పవన్
12:40 PM, March 31th 2024
కొనసాగుతున్న ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమం
- అనపర్తిలో కొనసాగుతున్న ‘న్యాయం కోసం నల్లమిల్లి’ కార్యక్రమం
- టీడీపీ టికెట్ రాకపోవడంతో ఇంటింటికి వెళ్లిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- కుటుంబ సమేతంగా ప్రజల మద్ధతు కోరుతున్న మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి
12:10 PM, March 31th 2024
చంద్రబాబు, పవన్‌పై ఎంపీ కేశినేని నాని ఫైర్
- ఎన్టీఆర్ పార్టీ పెట్టింది పేదలు.. కార్మిక.. కర్షక వర్గాల కోసం
- చంద్రబాబు ఆ సిద్ధాంతాలను తుంగలో తొక్కేశాడు
- చంద్రబాబుకు పేదలంటే చాలా చులకన
- టిప్పర్ డ్రైవర్‌కు సీటివ్వడాన్ని అవహేళన చేశాడంటే చంద్రబాబు మనస్తత్వం ఎలాంటిదో తెలుస్తుంది
- పేదలు ఎమ్మెల్యేలు, ఎంపీలు అవ్వడం చంద్రబాబుకు నచ్చదు
- ధనికులు మాత్రమే పదవుల్లో ఉండాలని చంద్రబాబు ఆలోచన
- చంద్రబాబుది అంతా క్యాష్ కొట్టు టిక్కెట్ పట్టు స్కీమ్
- చంద్రబాబుకు రవాణా రంగం అంటే మొదటి నుంచి చులకన
- పేద టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదని రాజ్యాంగంలో రాసుందా
- ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రవాణా రంగంలోని డ్రైవర్ల తమ వాహనాలకు టీడీపీ జెండాలు కట్టుకుని తిరిగారు
- ఢిల్లీ వరకూ టీడీపీ పేరు మారుమోగిందంటే డ్రైవర్ల వల్లే..
- ప్రతీ రాష్ట్రానికీ టీడీపీ జెండా వెళ్లిందంటే లారీ డ్రైవర్ల చలవే..
- ధనికులు మాత్రమే బ్రతకాలి.. వారి కోసమే రోడ్లు, హోటల్స్ కడతానని చంద్రబాబు చెబుతాడు
- పేదల పట్ల చిత్తశుద్ధిలేని వ్యక్తి చంద్రబాబు, టీడీపీ
- 2014లో మూడు పార్టీలు కలిసి 600 హామీలిచ్చారు.. ఒక్కటి కూడా నెరవేర్చలేదు
- నాతో చంద్రబాబు పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టించాడు
- ఇప్పుడు ఎందుకు బీజేపీతో కలుస్తున్నాడో చంద్రబాబు సమాధానం చెప్పాలి
- చేసిన తప్పుడు పనుల నుంచి బయటపటడానికి మోదీ కాళ్లు పట్టుకున్నాడు
- చంద్రబాబును ప్రజలు గో బ్యాక్ బాబు అంటున్నారు
- పవన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని
- విజయవాడ వెస్ట్‌లో మాటతప్పింది ఎవరు.. పవన్ సమాధానం చెప్పాలి
- పోతిన మహేష్‌ను నట్టేట ముంచేసి.. ఇప్పుడు పవన్ నీతి కబుర్లు చెబుతున్నాడు
- పోతిన మహేష్‌కు టికెట్ ఇస్తానని మాటిచ్చింది పవనే కదా
- జనసేన కోసం పదేళ్ల నుంచి పోతిన మహేష్ కష్టపడ్డాడు
- పదేళ్లు ఒక బీసీని పవన్ వాడుకున్నారు
- ఇప్పడు ఒక ధనికుడు పార్టీ ఫండ్ ఇస్తే.. ఆ సీటు తీసుకెళ్లి బీజేపీకి ఇచ్చాడు
- పేదవర్గాలుండే వెస్ట్ నియోజకవర్గం సీటును పవన్ మల్టీ మిలియనీర్ సుజనా చౌదరికి అమ్ముకున్నాడు.
11:40 AM, March 31th 2024
పేదవాళ్ల లబ్ధిపై టీడీపీ కుటల రాజకీయం: మంత్రి బొత్స
- పేదవాడికి వచ్చే లబ్దితో కూడా టీడీపీ కుటిల రాజకీయం చేస్తోంది.
- ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసి డీఎస్సీ పరీక్షను కూడా అడ్డుకున్నారు.
- ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే డీఎస్పీని ప్రకటించాం.
- ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలను ఫాలో అవుతాం.
- ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం డీఎస్పీ పరీక్ష నిర్వహిస్తాం.
- ప్రతిపక్షం తీరు ఎలా ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలి.
- ప్రజలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు.
- సామాజిక సాధికారత ప్రారంభించిన నాటి నుంచి రాష్ట్రంలో సోషల్ ఇంజనీరింగ్ మొదలైంది.
- ఉత్తరాంధ్రలో అన్ని ఎంపీ స్థానాల్లో బలహీన వర్గాలకే వైఎస్సార్‌సీపీ అవకాశం కల్పించింది.
- బీసీలు ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా ఓసీలకు టీడీపీ కూటమి టికెట్లు ఇచ్చింది.
- ఒక్క వర్గం కిందనే ప్రజలంతా ఉండాలని చంద్రబాబు కోరుకుంటాడు.
- ఏ వర్గానికి చెందిన మేలు ఆ వర్గం వారే సాధించుకోవాలని సీఎం జగన్ ఆలోచన చేశారు.
- పవన్‌కు ఇచ్చిన రెండు ఎంపీ సీట్లు కూడా బీసీకి కేటాయించలేదు.
- బీజేపీ కూడా అదే పంధాలో వెళ్లింది.
- స్టీల్ ప్లాంట్ అంశం కేంద్ర పరిధిలోనిది.
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్న పార్టీతో ఇప్పుడు ఎవరు కలిశారు.
- నాడు పాచిపాయిన లడ్డులు ఇచ్చారని అన్న పవన్ ఇప్పుడు వారితో కలిశాడు.
- స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పుడు కూటమి ఏం చెప్తుంది.
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని బీజేపీ ప్రకటన చేయాలి.. ఇది మా డిమాండ్.
- స్టీల్ ప్లాంట్‌పై సమాధానం చెప్పకుండా వారు ఇక్కడ ప్రచారం చేయడానికి అర్హత లేదు.
- ప్రజలు తిరస్కరించడంతో ఏం జరుగుతుందోనని భయపడి బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది.
- చంద్రబాబు ఆయన కొడుకు భయపడి జెడ్ కేటగిరి సెక్యూరిటీ తీసుకున్నారు.
- ఆ సెక్యూరిటీ కోసమే బీజేపీతో చేతులు కలిపారు.
- లోకేష్ కంటే నేను ఎక్కువ కాలం మంత్రిగా పని చేశాను.
- నాకెందుకు అంత సెక్యూరిటీ లేదు.
- బీజేపీతో కలిసింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.
- ఆత్మరక్షణ కోసం మాత్రమే పొత్తు పెట్టుకున్నారు.
11:15 AM, March 31th 2024
టీడీపీలో చల్లారని అసంతృప్తి మంటలు..
- ఉమ్మడి అనంతపురం జిల్లాలో రాజుకుంటున్న అసమ్మతి
- రాయబారులను పంపినా వెనక్కి తగ్గని అసమ్మతి నేతలు
- అనంతపురంలోని కమ్మ భవన్‌లో ప్రత్యేక సమావేశం
- భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనున్న ప్రభాకర్ చౌదరి
- అదే బాటలో ధర్మవరం టికెట్ ఆశించి భంగపడ్డ గోనుగుంట్ల
10:50 AM, March 31th 2024
పిఠాపురంలో రెండో రోజు పవన్..
- పిఠాపురంలో నేడు రెండో రోజు పవన్ కల్యాణ్ పర్యటన
- దత్తాత్రేయస్వామిని దర్శించుకోనున్న పవన్
- మధ్యాహ్నం పిఠాపురం పార్టీ కార్యకర్తలు సమావేశంలో పాల్గొననున్న పవన్
- సాయంత్రం పిఠాపురం నుంచి హైదరాబాద్ వెళతారని ప్రచారం
- నాలుగు రోజుల పర్యటనను రెండ్రోజులకు కుదించుకున్న పవన్
- సాయంత్రం హెలికాప్టర్‌లో హైదరాబాద్ పయనం
- రేపు ఉదయం పిఠాపురం రానున్న పవన్
- నేడు జరగాల్సిన జనసేన, టీడీపీ కార్యకర్తల సమావేశం రద్దు
10:35 AM, March 31th 2024
టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి..
- టీడీపీలో కొనసాగుతున్న అసంతృప్తి జ్వాలలు.
- టీడీపీకి వ్యతిరేకంగా గలమెత్తిన మాజీ మంత్రి మణి కుమారి, ఎంవీవీ ప్రసాద్.
- పార్టీని నమ్ముకున్న వాళ్ళని అన్యాయం చేశారు.
- పార్టీ కోసం అప్పుల పాలయ్యాము.
- కష్టపడిన వారిని పక్కన పెట్టారు.
- కొత్తగా వచ్చిన వారికి సీట్లు ఏ విధంగా ఇస్తారు.
- పార్టీ కోసం నక్సల్స్ చేతిలో కుటుంబ సభ్యులను కోల్పోయాము.
- మాకే సీట్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు.
10:15 AM, March 31th 2024
పవన్‌పై వంగా గీత సీరియస్
- పిఠాపురంలో లేనిపోని విషయాలను పవన్ కళ్యాణ్ అంటగడుతున్నాడు.
- పవన్ అబద్దాలు చెప్పడం కరెక్టు కాదు
- ఎక్కడో డబ్బులు దాచారని యువతను రెచ్చ గొడుతున్నాడు
- పిఠాపురం లో ఎక్కడ మత విద్వేషాలు.. ఆలయాలు కూలగొట్టడం జరగలేదు
- రాజకీయ కోసం ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారు.
9:45 AM, March 31th 2024
పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం: జీవీఎల్
- ఈసారి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది
- దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నికల్లో ధన ప్రభావం అధికంగా ఉంది.
- ఇది చింతించాల్సిన విషయం
- స్వయంగా ఆర్థిక మంత్రి పోటీ చేయలేనని చెప్పడాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు
- పేదరికంలో ఉన్న రాష్ట్రాల్లో నిజాయితీగా ఎన్నికలు జరుగుతున్నాయి
- సామాజిక మార్పు రానట్టైతే ఎన్నికలు ప్రమాదకరంగా మారిపోతాయి
- అభివృద్ధి అజెండాగా ఎన్నికలు జరగాలి
- విశాఖ సీటు బీజేపీదే..కూటమి కారణంగా సీటు రాలేదు
- నియోజక వర్గాల వారీగా అభ్యర్థులు తమ అజెండా ప్రకటించాలి
- బీజేపీకి 14 నుంచి 15 శాతం పార్లమెంట్ ఎన్నికల్లో బలం వుంది
- కూటమి తర్వాత సర్వే ఇంకా జరపలేదు
- ఏపీలో సీట్ల కోసమే పొత్తు...
- సామాజికవర్గం కోణంలో నన్ను ప్రజలు చూడలేదు .
- బీజేపీ కార్యకర్తలకు విశాఖ నుంచి బీజేపీ అభ్యర్థి పోటీ చేయాలన్న కోరిక బలంగా ఉంది.
- ఆ విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాం
- పార్టీ చెబితేనే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటాం.
9:10 AM, March 31th 2024
నేడు ఎమ్మిగనూరులో బాబు ప్రచార సభ
- నేడు ఎమ్మిగనూరులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ
- ఎమ్మిగనూరులో కనిపించని పొత్తు ధర్మం
- ప్రజా గళం సభకు తమకు ఆహ్వానం లేదంటున్న జనసేన, బీజేపీ నాయకులు.
- టీడీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు
- జనసేన జెండాలను టీడీపీ కార్యకర్తలతో మోయిస్తున్న చంద్రబాబు.
8:15 AM, March 31th 2024
టీడీపీ కోసం తహసీల్దార్ ఓవరాక్షన్..
- సత్యసాయి జిల్లాలోని చిలమత్తూరు మండల తహసీల్దార్ భాగ్యలత ఓవరాక్షన్
- వాట్సప్ గ్రూపులో తెలుగుదేశం ప్రచారం చేస్తున్న వైనం.
- టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అనంతపురం ఎంపీ అభ్యర్థిగా అంబికా లక్ష్మీనారాయణ ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేస్తూ గ్రూపులకు సమాచారం.
- కొడికొండ చెక్‌పోస్టు నుండి హిందూపురం వరకు జరిగే ర్యాలీకి కార్యకర్తలు రావాలంటూ పిలుపు.
- తహసీల్దార్ భాగ్యాలత ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్న నాయకులు
7:40 AM, March 31th 2024
వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్న చంద్రబాబు..
- అవ్వాతాతాలపై కసి తీర్చుకున్న చంద్రబాబు
- ఒకటో తారీకుఅవ్వాతాతలకు, వాలంటీర్లు పెన్షన్ ఇవ్వనీయకుండా అడ్డుకున్న చంద్రబాబు.
- ఇంటింటికి సేవలు అందిస్తున్న వాలంటీర్లను అడ్డుకోవడం ద్వారా పేదల నోటిదగ్గర కూడు తీసేసే కుట్రకు పాల్పడ్డారు
- నాడు ఇంగ్లీష్ మీడియం విద్యను కూడా ఇలాగే కోర్టులను అడ్డం పెట్టుకుని ఆపారు.
- ఇప్పుడు నిమ్మగడ్డతో కలిసి వాలంటీర్ల సేవలు అడ్డుకున్నారు.
- మొదట్నుంచీ వాలంటీర్ల మీద కక్షగట్టిన చంద్రబాబు తీరును ప్రజలు గమనిస్తున్నారు.
- ఇది మీ గెలుపు కాదు చంద్రబాబు.
- మీ రాజకీయ పతనానికి సిద్ధంగా ఉండండి.
- దీనికి త్వరలోనే మీ తగిన మూల్యం చెల్లించుకుంటుంది.
- మీకు రాజకీయ ఘోరీ కట్టడానికి వాలంటీర్లు, ప్రజలు సిద్ధంగా ఉన్నారు!
7:25 AM, March 31th 2024
పసుపు పార్టీ ఉక్కిరిబిక్కిరి
- టీడీపీ తుది జాబితాపై కార్యకర్తల్లో ఆగ్రహ జ్వాలలు.
- అనంతపురంల పార్టీ కార్యాలయానికి నిప్పు.
- గుంతకల్లు కార్యాలయంలో ఫర్నీచర్ ధ్వంసం
- చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొట్టిన కార్యకర్తలు.
- రాజంపేటలో ఎగిసిపడిన అసంతృప్తి జ్వాలలు.
పొత్తు ముసుగులో డబ్బున్న వారికే @JaiTDP టికెట్లు కేటాయించడంతో టీడీపీ కార్యాలయాలను తగలబెడుతున్న పసుపు జెండా మోసిన కార్యకర్తలు. పలుచోట్ల @ncbn చిత్రపటాలు సైతం కాల్చివేత.#TDPJSPBJPCollapse#MosagaduBabu#EndOfTDP pic.twitter.com/B8hLKBuHC0
— YSR Congress Party (@YSRCParty) March 30, 2024
7:10 AM, March 31th 2024
నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
- నారాయణా! మీకు వేల కోట్ల డబ్బు ఉండొచ్చు
- అంతకు మించిన అహంకారం నిండా ఆవరించి ఉంది.
- మీపై పోటీ చేసే వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ ఎవరో కూడా తెలియదన్నావు చూడు
- అదే మాట మీద ఉండు
- రెండు వారాలైతే రోజుకు వందసార్లు కలవరిస్తావు ఖలీల్ గారి పేరును
- ఎన్నికల కౌంటింగ్ రోజున ఇంత భారీ మెజారిటీతో గెలిచాడా అని నోరెళ్లబెడతావు
- పీడకలలు కంటావు. దళితులు, బిసిలు, మైనారిటీలు, పేదలంటే నీకెంత అసహ్యమో ఖలీల్ ఎవరో తెలియదు అనడాన్ని బట్టి అర్థమవుతోంది. విజ్ఞులైన నెల్లూరు ప్రజలు మీకు గుణపాఠం చెప్పకుండా వదలరు
- ఈ ఎలక్షన్‌తో మీ రాజకీయ చరిత్ర ముగుస్తుంది
7:00 AM, March 31th 2024
వాలంటీర్లు ప్రజలకు గొప్పగా సేవలు అందిస్తున్నారు: కురసాల కన్నబాబు
- ఈ ఐదేళ్ళ కాలంలో వాలంటీర్లు లాంటి వ్యవస్ధను పెట్టడానికి వేరే రాష్ట్రం ధైర్యం చేయలేకపోయింది.
- ప్రజలకు గొప్ప సేవలందించే వాలంటీర్లను నియంత్రించాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడు.
- సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబు,పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై దుర్మర్గమైన కామెంట్లు చేశారు.
- తాజా గా ఎన్నికల కమీషన్ కు నిమ్మగడ్డ ద్వారా వాలంటీర్లపై పిర్యాదు చేశారు.
- దీని వల్ల నష్టం ఎవరికీ?
- రాజకీయంగా వైఎస్ఆర్ సిపిని దీని ద్వారా ఏలా నియంత్రించ గలగుతారు.
- ప్రజలకు అందే సేవలను నియంత్రించారు.
- ఐదేళ్ళుగా పెన్షన్లు డోర్ డెలివరీ జరుగుతుంది.
- మీ తీరు వల్ల పెన్షన్ అందుకునే వృద్దులకు నష్టం జరుగుతుంది.
- ఈ రెండు నెలలు పెన్షన్లు అందకుండా చేశామని చంద్రబాబు పండుగ చేసుకుంటున్నాడు
- వాలంటీర్లను నియంత్రిస్తే వైఎస్ఆర్ సిపిని నియంత్రించాం అనుకోవడం చంద్రబాబు భ్రమ
- ప్రజల గుండెల్లో అభిమానం నింపున్న నాయకుడిగా జగన్ కనిపిస్తున్నారు.
- వాలంటీర్లను నియంత్రిస్తే జగన్ గారు వీక్ అయిపోతారు అనుకుంటే చంద్రబాబు అమాయకత్వం.
- చంద్రబాబు తీరు పూర్వం కత్తి కాంతారావు కత్తి ఫైట్లలా ఉంది
6:50 AM, March 31th 2024
కూటమిలో ప్రకంపనలు
- రాష్ట్ర వ్యాప్తంగా కూటమిలో ప్రకంపనలు
- కార్యకర్తల సమావేశంలో భావోద్వేగానికి గురైన బండారు
- లాబీయింగ్‌కే టికెట్ అంటూ కిమిడి నాగార్జున కంటతడి
- గిరిజనులంటే చంద్రబాబుకు చిన్నచూపన్న గిడ్డి ఈశ్వరి
- అవినీతి గంటాకు భీమిలి టికెట్ ఇచ్చారని కోరాడ ధ్వజం
- కామవరపుకోటలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
- టీడీపీ నమ్మకద్రోహంపై మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆవేదన
6:40 AM, March 31th 2024
మీడియా ముందు కంటతడి పెట్టిన మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి
- తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చంద్రబాబు సమాధానం చెప్పాలి.
- టీడీపీ సభ్యత్వం లేని వ్యక్తికి పాడేరు సీటు ఇచ్చారు.
- రమేష్ నాయుడు డబ్బులు ఇచ్చి సీటు కొనుక్కున్నాడు..
- పాడేరు సీటు విషయమై చంద్రబాబు పునరాలోచన చేయాలి.
- లేదంటే రమేష్ నాయుడుని కంకణం కట్టుకొని ఓడించి తీరుతాం...
- గిరిజనలంటే చంద్రబాబుకు ఎందుకు అంత చులకనా...
- ఏం పాపం చేసాం.. మేం అర్హులం సీటు ఇవ్వడానికి అర్హులం కాదా
6:30 AM, March 31th 2024
ఏప్రిల్ 1న ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన: రఘువీరారెడ్డి
- ఏప్రిల్ 1వ తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన ఉంటుందన్న సీనియర్ నేత రఘువీరారెడ్డి
- 2వ తేదీ నుంచి అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లారు
- దేశంలో, ఏపీలో కూడా కాంగ్రెస్ గ్యారెంటీలు ఉంటాయి
Comments
Please login to add a commentAdd a comment