AP Elections & Political March 28th Latest News Telugu..
10:02PM, March 28, 2024
కృష్ణాజిల్లా:
మచిలీపట్నంలో కొల్లు రవీంద్రకు షాక్ ఇచ్చిన తెలుగు తమ్ముళ్లు
- మచిలీపట్నం 39వ డివిజన్ గొడుగుపేటలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు
- కొల్లు అనుచరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)
08:40PM, March 28, 2024
తిరుపతి
జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: భూమన కరుణాకర్‌రెడ్డి
- తిరుపతి నగరంలో 36, 37 డివిజన్ పరిధిలో గాలి వీధిలో ఎన్నికల ప్రచారం చేసిన తిరుపతి ఎమ్మేల్యే భూమన కరుణాకర్ రెడ్డి
- తిరుపతి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రతి ఇంటికి ప్రచారం, స్వాగతించిన ప్రజలు
- రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు కూటమిని ప్రజలు తమ ఓటుతో ఊడ్చి పారేయడం ఖాయం
- వైఎస్ జగన్ ప్రభుత్వం పట్ల ప్రజలు చాలా సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారు
- ఎన్నికల ప్రచారంలో ప్రజలు మాకు బ్రహ్మరథం పడుతుండడమే ఇందుకు నిదర్శనం
- ప్రతి ప్రతిపక్షాలు పనిగట్టుకుని జగనన్నపై, మాపై ఎన్ని రకాలుగా వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు
- జగనన్న ప్రభుత్వంలో వారికి జరిగిన మంచి పనులనే వారు గుర్తు పెట్టుకుని ఉన్నారు
07:50PM, March 28, 2024
నెల్లూరు రూరల్ పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటాం: విజయసాయిరెడ్డి
- కొందరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఆక్రమించారు
- ఎంపీగా గెలిచిన వెంటనే ఆ భూములను తిరిగి స్వాధీన పరుచుకుంటాం..
- ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడం ఖాయం
- రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్‌గా ఆదాల ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే రూరల్ నియోజకవర్గం అభివృద్ధి చెందింది
07:00PM, March 28, 2024
నెల్లూరు:
ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్ పేట లో జరిగిన ప్రజాగళం సమావేశానికి స్పందన కరువు
- ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతుండగా సభ నుంచి వెళ్లిపోయిన జనాలు..
- ఖాళీ కుర్చీలు దర్శనం ఇవ్వడంతో స్థానిక నేతలపై అసహనం వ్యక్తం చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం
06:40PM, March 28, 2024
బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?: సీఎం జగన్
- నంద్యాల ఓ జన సముద్రంలా కనిపిస్తోంది
- జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోంది
- నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు కలిశారు
- మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు
- వారిని అడ్డుకేనేందుకు ప్రజలంతా సిద్ధం
- సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి మూడు పార్టీలు ఒక్కటయ్యాయి
- ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు,బిజేపీ
- వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది
- పొత్తు కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉండాలి
- 175 ఎమ్మెల్యే,25 ఎంపీ స్ధానాలు గెలిచి డబుల్ సెంచరీ కొడదాం
- గతంలో చంద్రబాబు అబద్ధాలు చూశాం..మోసాలు చూశాం
- వైఎస్సార్‌సీపీకి ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు.. బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి
- ఇతర పార్టీలకు ఓటేసిన వాళ్లు కూడా ఓసారి ఆలోచించాలి
- వైఎస్సార్‌సీపీ ఐదేళ్లపాలనపై అందిరితో చర్చించండి
- ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయి
- మోసాల చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలి
- గతంలో చంద్రబాబు మోసాలు చూశాం.
- చంద్రబాబు జిత్తులమారి, పొత్తులమారి.
- బాబు మోసాలకు ఓటేస్తే పదేళ్లు వెనక్కిపోతాం.
- బాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమేనా?
06:10PM, March 28, 2024
నల్లమిల్లికి టికెట్ ఇవ్వకపోవడంతో భగ్గుమన్న అనపర్తి
- టికెట్ ఇవ్వాల్సిందేనంటూ బిజేపీ ఆఫీస్ ముందు కూర్చున్న పనతల సురేష్
- సీటు ఇవ్వలేదంటూ అధిష్టానంపై వరదాపురం సూరి అసంతృప్తి
- కూటమిలో ఓవైపు ఆందోళనలు..మరోవైపు సర్దుబాట్లు
06:00PM, March 28, 2024
మారని బాబు, మళ్లీ పాత హామీలే
- ప్రజాగళం రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు, టీడీపీ లీడర్లు.
- మళ్లీ పాత హామీల లిస్టును చదివి వినిపించిన చంద్రబాబు.
- ప్రతీ పొలంలో బిందు సేద్యం పెట్టిస్తాను.
- సీమకు గోదావరి జలాలు తీసుకువస్తా.
- రాయలసీమలో ప్రతి చెరువు నింపుతా.
- యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తాను.
- అందరికీ వర్క్ ఫ్రం హోం జాబ్‌లు ఇప్పిస్తాను.
- ఇంట్లో ఉంటూనే డబ్బులు సంపాదించుకోవచ్చు.
- షర్మిల, సునీతలను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
- అన్ని రాజకీయ పార్టీలను కూడా నేనే మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
05:45PM, March 28, 2024
అనపర్తి తెలుగు తమ్ముళ్లతో చంద్రబాబు చర్చలు
- పరిస్థితి చక్కదిద్ధేందుకు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఫోన్
- నల్లమిల్లిని బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నం.
- చంద్రబాబుతో నిర్మొహమాటంగా నియోజకవర్గ పరిస్థితి, కార్యకర్తల ఆవేదనను వివరించిన నల్లమిల్లి
- పార్టీ కోసం ప్రాణాలొడ్డి పోరాడితే నన్ను బలిచేశారని అధినేతకు స్పష్టం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
- మీకోసం తెగించి పోరాడిన అతికొద్ది మంది నేతలలో నేనూ ఒకడినన్న నల్లమిల్లి.
- నాలుగు దశాబ్దాలపాటు మా కుటుంబం మీ వెంటే ఉందన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- అయినా అన్యాయం చేశారన్న నల్లమిల్లి
5:20 PM, March 28th 2024
నంద్యాల చేరుకున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర
- కాసేపట్లో బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్
- జనసంద్రంగా మారిన నంద్యాల
5:15 PM, March 28th 2024
ఏప్రిల్ 7న పెందుర్తిలో పవన్ కళ్యాణ్ ప్రచారం
- ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా పవన్ ప్రచారం
- పెందుర్తి లేదా వేపగుంటలో పవన్ బహిరంగ సభ
5:10 PM, March 28th 2024
తూర్పు గోదావరి :
అన్ని స్థానాలకు బీజేపీ కి అభ్యర్థులు ఉన్నారు: పురంధేశ్వరి
- పొత్తులో భాగంగా 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు తీసుకున్నాం
- పార్టీతో పాటు కూటమి అభ్యర్థులనూ గెలిపించాలి
- విశాఖ డ్రగ్స్ కేసుతో మా కుటుంబానికి సంబంధం లేదు
5:00 PM, March 28th 2024
రాజమండ్రిలో బీజేపీ ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ సమావేశానికి సోమువీర్రాజు డుమ్మా
- టికెట్ ఇవ్వనందుకు సోమువీర్రాజు అలిగారంటూ ప్రచారం
- ఆరోగ్యం బాగాలేనందుకే రాలేదంటున్న బీజేపీ నేతలు
- రాజమండ్రి రూరల్ లేదా సిటీ టికెట్ ఆశించిన సోమువీర్రాజు
- పొత్తులో భాగంగా జిల్లాలో బీజేపీ కి అనపర్తి సీటు మాత్రమే ఇచ్చిన టీడీపీ
- టికెట్ దక్కకపోవడంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్న సోమువీర్రాజు
4:25 PM, March 28th 2024
మీ దగ్గర పాలేరు గిరీ చేసేందుకు మేం సిద్ధంగా లేము: చలమలశెట్టి రమేష్
- భువనేశ్వరి చంద్రబాబు, లోకేష్ గురించి బాగా చెప్పారు.
- పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమన్నా మాట్లాడకపోవడం బాధాకరం
- భువనేశ్వరి తీరుతో మా మనోభావాలు దెబ్బతిన్నాయి
- మీ అడుగులకు మడుగులు ఎత్తడానికి మేం సిద్ధంగా లేము
- మీ దగ్గర పాలేరు గిరీ చేసేందుకు మేం సిద్ధంగా లేము
- పవన్ కళ్యాణ్ గురించి,జనసేన కార్యకర్తల గురించి మాట్లాడటం ఇష్టం లేనప్పుడు మీ కార్యక్రమాలకు మమ్మల్ని పిలవకండి
- పిలిచి అవమానించకండని హెచ్చరిస్తున్నా
- టీడీపీ వైఖరి మార్చుకోకపోతే గన్నవరంలో సహకరించేదిలేదు
- సోషల్ మీడియా వేదికగా టీడీపీ అధిష్టానాన్ని హెచ్చరించిన గన్నవరం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్
4:20 PM, March 28th 2024
కృష్ణాజిల్లా:
గన్నవరం నియోజకవర్గంలో నారా భువనేశ్వరి పర్యటనలో బయటపడ్డ టీడీపీ-జనసేన మధ్య విభేదాలు
- నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా నిన్న హనుమాన్ జంక్షన్‌లో పర్యటించిన భువనేశ్వరి
- నాలుగు రోడ్ల జంక్షన్‌లో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన భువనేశ్వరి
- జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలని కోరిన జనసేన శ్రేణులు
- పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేందుకు నిరాకరించిన భువనేశ్వరి
- పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడకుండానే అక్కడి నుండి వెళ్లిపోయిన భువనేశ్వరి
- భువనేశ్వరి తీరుతో అసహనం వ్యక్తం చేసిన జనసేన కార్యకర్తలు
3:40 PM, March 28th 2024
బాపట్ల టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసుల సోదాలు
- చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో కొనసాగుతున్న సోదాలు
- రూ. 56 లక్షల నగదు స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు
- టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తింపు
- చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు
3:00 PM, March 28th 2024
కృష్ణాజిల్లా:
టీడీపీ నేత కొల్లు రవీంద్రపై పేర్ని నాని ఫైర్
- కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం
- నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు
- తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం
- ప్రస్తుతం ఎన్నికల కోడ్‌లో ఉన్నాం
- అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు
- కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం
- ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి
- సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది
- అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి
- గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు
- తరకటూరు , పంపుల చెరువు లోతు 12 అడుగులు.... 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు
- నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది
- పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు
- అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు
- ముందు చూపు లేనిది ఎవరికి.. కొల్లు రవీంద్ర ఏమైనా పనొడా
- కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా
- ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ వుంది చూసుకో
- టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు
- 2018 లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారు
- కొల్లు రవీంద్రా...అప్పుడు మేము ధర్నా చేశాం
- అప్పుడు తమరు పచ్చరంగు నీరు సప్లై చేస్తున్నందుకు ధ్వజమెత్తిన పేర్ని అంటూ విలేకరులు మీ సొంత పత్రికలలో రాశారు
- కొల్లు రవీంద్ర ముందు చూపు గురించి మాకు తెలియదా
- పేర్ని నాని వచ్చిన తరవాత ఎవరైనా బోర్లు వేశారా ... నీటి కోసం ఇబ్బంది పడ్డారా
- కొల్లు రవీంద్ర సిగ్గు శంరం లేకుండా అబద్ధాలు చెబుతాడు
2:50 PM, March 28th 2024
గుడివాడ(కృష్ణాజిల్లా):
ఎమ్మెల్యే కొడాలి నాని రెండో రోజు ఎన్నికల ప్రచారం
- అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదని, ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను.
- 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ ది.
- 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి.... పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్
- సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం.
- వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది.... సీఎం జగన్‌ది
- జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డ్... స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది
- కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం
2:47 PM, March 28th 2024
అనంతపురం:
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం
- జనం లేక వెలవెల బోయిన చంద్రబాబు సభ
- సభా ప్రాంగణం ఖాళీగా ఉండటం తో చంద్రబాబు అసహనం
- చంద్రబాబు మాట్లాడుతుండగానే వెళ్లిపోయిన టీడీపీ నేతలు, కార్యకర్తలు
2:00 PM, March 28th 2024
కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధం: బీజేపీ నేతలు ఫైర్
- అరకు పార్లమెంట్ సీటు అసలైన ఎస్టీలకు కేటాయించాలంటూ బీజేపీ నేతల డిమాండ్
- బీజేపీ స్టేట్ కోర్ కమిటీ మెంబర్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజు సీరియస్
- అరకు పార్లమెంట్ బీజేపీ అభ్యర్ధిగా కొత్తపల్లి గీత ఎంపిక రాజ్యాంగ విరుద్ధం
- ఆమె ఎంపికను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం
- కొత్తపల్లి గీత అర్హురాలు కాదు
- కొత్తపల్లి గీతకు టిక్కెట్ ఇవ్వొద్దని పలుమార్లు అధిష్టానానికి చెప్పాం
- తొమ్మిదేళ్లుగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నా
- మాలాంటి వారిని పక్కన పెట్టి ఆమెను తీసుకోవడానికి గల కారణాలేంటో తెలియడం లేదు
- కొత్తపల్లి నకిలీ గిరిజనురాలు.. ఆమె ట్రైబ్ కాదు
- అధిష్టానానికి చెప్పిచెప్పి మేం అలసిపోయాం
- కొత్తపల్లి గీత అభ్యర్ధిత్వాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాం
- పురంధేశ్వరి ఒత్తిడికి తలొగ్గి అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారు
- ఇప్పటికైనా అధిష్టానం స్పందించాలి
- అరకు పార్లమెంట్ నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలి.
- మాకు న్యాయం చేయాలి
1:45 PM, March 28th 2024
ప్రొద్దుటూర్ సభ గ్రాండ్ సక్సెస్: ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి
- ప్రొద్దుటూరులో జరిగిన మేమంత సిద్ధం బహిరంగ సభ గ్రాండ్ సక్సెస్.
- గతంలో జరిగిన అన్ని సభల కంటే ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు.
- మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసులో హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరం.
- తాను నేరుగా నేనే చంపాను అంటున్న అతనికి మద్దతు ఇచ్చి బెయిల్ కూడా ఇప్పించడం ఎంతవరకు సమంజసం.
- దీని వెనుకల ఎవరున్నారు అనేది ప్రజలకు బాగా తెలుసు.
- చంద్రబాబు వీరి వెనుక ఉండి రాజకీయాలు చేయాలని చూస్తున్నాడు.
- జరిగే పరిణామాలు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
- త్వరలో జరగబోయే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారు
1:30 PM, March 28th 2024
చంద్రబాబుపై ఎంపీ భరత్ ఫైర్
- చంద్రబాబు శిఖండి రాజకీయాలు చేస్తున్నాడు
- అనపర్తిలో కూటమి అభ్యర్థిని మార్చడం ద్వారా వైఎస్సార్‌సీపీకి మరింత అధికంగా మెజారిటీ లభిస్తుంది
- చంద్రబాబుకు వ్యక్తిగత లాభమే ముఖ్యం
- రాజమండ్రిలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేశాము
- రాజమండ్రి వాసులు ప్రభుత్వం చేసిన అభివృద్ధిని గమనించారు
- కచ్చితంగా వైఎస్సార్‌సీపీ ఇక్కడ విజయం సాధిస్తుంది.
1:05 PM, March 28th 2024
బీజేపీ ఆఫీసు వద్ద ఉద్రికత్త..
- ఏపీ బీజేపీ కార్యాలయం వద్ద బద్వేల్ బీజేపీ లీడర్ పనతల సురేష్ ఆందోళన
- బద్వేల్ బీజేపీ టికెట్ టీడీపీ నేత రోషన్‌కు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరం
- తనకు న్యాయం చేయాలని డిమాండ్
- పనతల సురేష్ కామెంట్స్..
- బద్వేల్ టిక్కెట్ విషయంలో అధిష్టానం పునరాలోచించుకోవాలి
- పక్క పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టిక్కెట్ ఇవ్వడం బాధాకరం
- కనీసం పార్టీలో చేరకుండానే రోషన్‌కు సీటు కేటాయించడం అనుమానాలకు తావిస్తోంది
- బీజేపీలో ఉన్న దళితులకు సీటివ్వాలని డిమాండ్ చేస్తున్నా
- నేను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను.
- టిక్కెట్ అడగడం నా హక్కు.. నాకు అర్హత ఉంది
- చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నాపై 70కి పైగా కేసులు పెట్టాడు
- అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టాడు
- బీజేపీలో ఉన్న దళితులను తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు
- సీట్ల కోసం వచ్చిన వాళ్లు పార్టీకి ద్రోహం చేస్తారు
12:48 PM, March 28th 2024
వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో మంత్రి కారుమూరి ఆత్మీయ సమ్మేళనం..
- ప్రతీ ఇంటికి వెళ్లి ఓటు అడిగే హక్కు ఒక్క వైఎస్సార్‌సీపీ కార్యకర్తకు ఉంది
- అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి లబ్ది చేకూర్చారు మన నాయకుడు సీఎం జగన్
- గత ప్రభుత్వం 600హామీలు ఇచ్చి తుంగలో తిక్కింది
- మన ప్రభుత్వంలో మన జగనన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు
- నాడు-నేడు ద్వారా విద్యా వ్యవస్థలో పెను మార్పులు తెచ్చి దేశంలో మన రాష్ట్రాన్ని విద్యలో ప్రథమ స్థానంలో నిలిపారు
- రానున్న 45 రోజులు మనం సమిష్టిగా కృషి చేసి జగనన్నను మరోసారి సీఎం చేసుకోవాలి
- ప్రజలెవ్వరూ మూడు కండువాలతో వచ్చే వారి మాటలు విని మోసపోకూడదు
12:32 PM, March 28th 2024
రాప్తాడులో చంద్రబాబు రోడ్ షో
- అనంతపురంలో చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారం
- ప్రజాగళం పేరిట ప్రచారంలో పాల్గొంటున్న ప్రతిపక్ష నేత
- గురువారం ఉదయం రాప్తాడులో రోడ్‌షోలో పాల్గొన్న చంద్రబాబు
- వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం: చంద్రబాబు
- మూడు పార్టీలు కలిసింది రాష్ట్ర ప్రజల కోసం: చంద్రబాబు
12:21 PM, March 28th 2024
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత
- సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చిన మాజీ మంత్రి అఖిలప్రియ
- అడ్డుకున్న భద్రతా సిబ్బంది
- సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చానన్న అఖిలప్రియ
- అఖిలప్రియను అడ్డుకుని.. రైతు ప్రతినిధులను సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లిన పోలీసులు
- సమస్య సర్దుమణగడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన అఖిలప్రియ
12:00 PM, March 28th 2024
కన్నీరుపెట్టుకున్న నల్లమిల్లి..
అనుచరుల సమావేశంలో కన్నీళ్లు పెట్టుకున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.
ప్రజల అభిప్రాయం మేరకు నా భవిష్యత్ కార్యాచరణ.
నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తాను.
అనపర్తి టికెట్ తనకు కాకుండా బీజేపీ కేటాయించడంపై అసంతృప్తి.
రేపటి నుంటి నా కుటుంభ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటిస్తాను.
నాకు టికెట్ రాకుండా బీజేపీతో కలిసి కుట్ర జరిగింది.
11:40 AM, March 28th 2024
ఇవి మన తలరాతని మార్చే ఎన్నికలివి: సీఎం జగన్
- ఆళ్లగడ్డలో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం
- మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా యర్రగుంట్లలో సీఎం జగన్ ముఖాముఖి
- వివిధ పథకాల్లో దాదాపు 93.06 శాతం మంది ప్రజలు లబ్ధి పొందారు: సీఎం జగన్
- యర్రగుంట్ల పరిధిలో 1496 ఇళ్లకు గాను 1391 ఇళ్లకు లబ్ధి జరిగింది: సీఎం జగన్
- ఎక్కడా లంచాలు లేవు. ఎక్కడా వివక్ష లేదు. అర్హత ఉంటే చాలు పథకాలు అందజేస్తున్నాం: సీఎం జగన్
- ఏ పార్టీ అని చూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: సీఎం జగన్
- ఎర్రగుంట్లలో 1,391 ఇళ్లకు రూ. 48.74కోట్లు అందించాం: సీఎం జగన్
- అమ్మ ఒడి కింద 1,043 మంది తల్లులకు లబ్ధి చేకూరింది: సీఎం జగన్
- వైఎస్సార్ ఆసరా ద్వారా మూడు కోట్ల పైగా లబ్ధి చేకూరింది: సీఎం జగన్
- ఆరోగ్యశ్రీ కింద రెండు కోట్లకుపైగా లబ్ధి చేకూరింది: సీఎం జగన్
- చేదోడు కింద రూ. 31,20,000 లక్షలు లబ్ధి జరిగింది: సీఎం జగన్
- వయసులో చిన్నోడినైనా నేను ఎర్రగుంట్లకు చేసిన అభివృద్ధి ఇది: సీఎం జగన్
- 14ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఎందుకు ఇదంతా చేయలేదు?: సీఎం జగన్
- ఎన్నడూ జరగని విధంగా గ్రామాలు బాగుపడ్డాయి: సీఎం జగన్
- మొట్టమొదటి సారిగా స్కూల్స్ బాగుపడ్డాయి: సీఎం జగన్
- ఆరోగ్య సురక్ష ద్వారా ఇంటికి వైద్యం అందిస్తున్నారు: సీఎం జగన్
- మీ బిడ్డ హయాంలోనే రైతన్నకు పెట్టుబడి సాయం అందించే మార్పు జరిగింది: సీఎం జగన్
- మార్పు ఏ స్థాయిలో జరుగుతుందో ఆలోచించండి: సీఎం జగన్
- ఇవి మన భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు.. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి
- చేసిన మంచిని చూసి ఓటేయండి
11:11 AM, March 28th 2024
అనపర్తిలో అలజడి
- చంద్రబాబుపై టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనుచరుల ఆగ్రహం
- తూర్పు గోదావరి జిల్లా అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయింపు
- అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన
- చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు
- సైకిల్‌ను, టీడీపీ జెండాలు.. కరపత్రాలను మంటలో వేసి నిరసనలు
- తన నివాసంలో అనుచరులతో నల్లమిల్లి సమావేశం
- కాసేపట్లో నిర్ణయం ప్రకటించనున్న నల్లమిల్లి
- అనపర్తి నుంచి రెబల్‌గా పోటీ చేసే ఛాన్స్
11:07 AM, March 28th 2024
కామినేని ఓ పొలిటికల్ బ్రోకర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు
- గుడ్ మార్నింగ్ కలిదిండి కార్యక్రమంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు
- కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్ పై ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఫైర్
- ఎల్లో మీడియా పేపర్లో నామీద నా కొడుకుల మీద అసత్య ప్రచారాలు చేస్తున్నాడు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
- కైకలూరు నియోజకవర్గంలో నామీద గెలిసి చూపించాలని సవాల్ చేస్తున్నా: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
- కామినేని ఒక పొలిటికల్ బ్రోకర్ : ఎమ్మెల్యే నాగేశ్వరరావు
- డబ్బు ఉందనే అహంకారంతో ఓటుకి 5 వేలు ఇచ్చి కొంటానంటున్నావు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
- కైకలూరు నియోజకవర్గంలో నీకు అమ్ముడుపోయే ఓటర్ ఎవరూ లేరు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
- ఓడిపోతాననే భయంతోనే అసత్య ఆరోపణలు చేస్తున్నావు: ఎమ్మెల్యే నాగేశ్వరరావు
11:00 AM, March 28th 2024
ఎన్నికల ప్రచారంలో మంత్రి అమర్నాథ్
- గాజువాక నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మంత్రి గుడివాడ అమర్నాథ్
- సత్తెమ్మ గుడిలో అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అమర్నాథ్.
- రానున్న ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన అమర్నాథ్.
- ప్రచార కార్యక్రమంలో తిప్పల దేవన్ రెడ్డి, కేబుల్ మూర్తి, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.
10:55 AM, March 28th 2024
బోండా ఉమకు వెల్లంపల్లి శ్రీనివాస్ కౌంటర్
- ఈ డివిజన్లో ఉన్న దోబీకానాను మోడల్ దోబీకానగా చేస్తాం.
- ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లలా పనిచేస్తున్నాయి.
- కుల, మతాలకు అతీతంగా సీఎం జగన పాలన అందిస్తున్నారు.
- బోండా ఉమ ప్రజల సమస్యలు ఏనాడైనా తెలుసుకున్నాడా?.
- ఉమా లాంటి తాగుబోతుని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.
- ముందు నీ అలవాట్లు మార్చుకొని ప్రజల్లోకి రండి.
- తాగిన మైకంలో బోండా ఉమా భూకబ్జాలు, రౌడీయిజం, బ్లాక్ మెయిలర్ రాజకీయం చేయటం మానుకోండి.
- ఇటువంటి అవ లక్షణాలు ఉన్న వ్యక్తికి ప్రజలు ఎందుకు ఓటు వేస్తారు.
- చంద్రబాబు వస్తే కరువు కాటకాలు.. బోండా ఉమ వస్తే తాగుబోతులు పెరుగుతారు.
10:45 AM, March 28th 2024
అనకాపల్లి జనసేనలో అసంతృప్తి..
- చోడవరం సీటు టీడీపీకి కేటాయించడంపై జనసేనలో అసంతృప్తి.
- జనసేన ముఖ్య నేతలతో రహస్యంగా పీవీఎస్ఎన్ రాజు సమావేశం.
- భవిష్యత్తు కార్యాచరణపై నాయకులతో చర్చ.
- ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని రాజుపై నాయకులు ఒత్తిడి.
- పార్టీ మారాలని మరి కొంతమంది నేతలు ఒత్తిడి.
- కష్టపడిన వారికి జనసేనలో గుర్తింపు లేదని ఆగ్రహం
- త్వరలో ఒక నిర్ణయం తీసుకుందామని నేతలకు చెప్పిన రాజు.
10:35 AM, March 28th 2024
పవన్‌కు పరేషాన్
- పవన్‌కు తలనొప్పిగా తిరుగుబాటు
- విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ రెబల్ పోటీ ప్రకటన
- విజయవాడ వెస్ట్‌తో పాటు తిరుపతి, కాకినాడ రూరల్, విశాఖ సౌత్, చోడవరం, అనకాపల్లిలో జనసేన శ్రేణుల నిరసనలు
- ఆయా స్థానాల్లో సీట్లు రాని జనసేన నేతల ఆందోళనలు
- పవన్ మాటల్ని లెక్క చేయని నేతలు
- పవన్ నిర్ణయమే శిరోధార్యమని నిన్న హెచ్చరికలు జారీ చేసిన జనసేన కార్యదర్శి నాగబాబు
- పొత్తుల పేరుతో జనసైనికులకు పవన్ టోకరా
- ఇప్పుడు బెదిరింపులకు పాల్పడుతున్న వైనం
10:00 AM, March 28th 2024
సీఎం జగన్ సమక్షంలో YSRCPలో చేరిన ఉమ్మడి కర్నూలు టీడీపీ నేతలు
- ఆళ్లగడ్డలో సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన పలువురు టీడీపీ ప్రముఖులు
- మాజీ కార్యదర్శి, అఖిలభారత బ్రాహ్మణ సంఘం మాజీ అధ్యక్షుడు కాశీభట్ల సాయినాథ్ శర్మ.
- టీడీపీ మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఆర్టీసీ మాజీ చైర్మన్ రెడ్డ్యం వెంకటసుబ్బారెడ్డి.
- బనగానపల్లె నియోజకవర్గం కోయిలకుంట్ల మేజర్ పంచాయితీ మాజీ సర్పంచ్ వీ ఎస్ కృష్ణమూర్తి(లాయర్ బాబు).
- చేరికల కార్యక్రమంలో పాల్గొన్న కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
9:45 AM, March 28th 2024
రెండో రోజు సీఎం జగన్ బస్సు యాత్ర ప్రారంభం..
- ఆళ్లగడ్డ నుంచి సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్ర ప్రారంభమైంది.
- ఈరోజు సాయంత్రం నంద్యాలలో సీఎం జగన్ సభ
Memantha Siddham Yatra - Day 2.
— YSR Congress Party (@YSRCParty) March 28, 2024
జగనన్న మేమంతా సిద్ధం యాత్ర ఈరోజు షెడ్యూల్ ఇదే!
ఉదయం ఆళ్లగడ్డలో ప్రజలతో ఇంటరాక్ట్.. సాయంత్రం నంద్యాలలో సభ.#MemanthaSiddham#YSJaganAgain#VoteForFan pic.twitter.com/hdEKiPoKzx
9:20 AM, March 28th 2024
టీడీపీ కార్యకర్తల ఆత్మహత్యాయత్నం..
- కూటమిలో భాగంగా బీజేపీ అనవర్తి అభ్యర్థిగా ములగపాటి శివరామకృష్ణం రాజు ప్రకటన
- అనపర్తిలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు
- నిన్న రాత్రి రామకృష్ణారెడ్డి ఇంటి వద్ద హడావుడి చేసిన పార్టీ కార్యకర్తలు
- ఒంటిపై పెట్రోల్ పోసుకున్న ఇద్దరు కార్యకర్తలు, వారించిన నల్లమిల్లి.
- స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలంటున్న అభిమానులు
- కార్యకర్తలతో కొద్దిసేపటి క్రితం ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణారెడ్డి
- భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం
9:10 AM, March 28th 2024
టీడీపీ నేతల్లో ఆగ్రహ జ్వాలలు..
- అరకు అసెంబ్లీ సీట్లు బీజేపీకి కేటాయించడంతో రగిలిపోతున్న టీడీపీ నాయకులు
- రెండు నెలల క్రితం స్వయంగా అరకులో టీడీపీ అభ్యర్థి దొర పేరు ప్రకటించిన చంద్రబాబు
- పొత్తుల పేరిట బీజేపీకి కేటాయించడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తెలుగు తమ్ముళ్లు
- పార్టీని నమ్ముకున్న వారిని స్వప్రయోజనం కోసం నట్టేట ముంచారని ఆగ్రహం
- చంద్రబాబుని నమ్మి పార్టీ ఫిరాయించి మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కొడుకులకు మొండి చేయి
- టీడీపీ రెబల్‌గా ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్న తెలుగు తమ్ముళ్లు
8:50 AM, March 28th 2024
అనంతలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం..
- నేడు అనంతపురంలో చంద్రబాబు పర్యటన
- రాప్తాడు, బుక్కరాయపట్నంలో ఎన్నికల ప్రచారంలో బాబు.
- సాయంత్రం కదిరిలో టీడీపీ బహిరంగ సభ
8:30 AM, March 28th 2024
టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి..
- ధర్మవరం నియోజకవర్గంలోని టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో అసంతృప్తి
- ధర్మవరం టిక్కెట్ బీజేపీ నేత సత్యకుమార్ కు కేటాయింపు
- ధర్మవరం టిక్కెట్‌పై ఇన్నాళ్లూ ఆశలు పెట్టుకున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరీ
- ఇద్దరికీ కాదని సత్యకుమార్‌కు కేటాయింపు
- నాన్ లోకల్ అయిన సత్యకుమార్‌కు టికెట్ కేటాయింపుపై టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో నిరుత్సాహం
- ధర్మవరంలో సత్యకుమార్‌కు పనిచేయలేమంటున్న టీడీపీ, బీజేపీ నేతలు
8:10 AM, March 28th 2024
చంద్రబాబు క్షుద్ర రాజకీయం..
- పదిమందితో అసెంబ్లీ జాబితా విడుదల చేసిన బీజేపీ.
- అసెంబ్లీ జాబితాలో చోటు దక్కని సోము వీర్రాజు, మాధవ్, విష్ణువర్ధన్ రెడ్డి, పరిపూర్ణానంద స్వామి.
- వలస నేతలకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారని సీనియర్లు ఆగ్రహం.
- తనకు నచ్చిన వారికి అనుకూలంగా పురంధేశ్వరి నివేదికలు పంపారని ఆగ్రహం.
- చంద్రబాబు డైరెక్షన్‌లోనే సీట్లు కేటాయింపు జరిగిందని ధ్వజం.
- చంద్రబాబుకు అనుకూలమైన వ్యక్తులతో బీజేపీలో సీట్లు దక్కాయని అసంతృప్తి.
- చంద్రబాబు నమ్మిన బంట్లు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, సత్య కుమార్, ఆదినారాయణ రెడ్డికు సీట్లు.
- పదిమందిలో ఆరుగురు వలస నేతలకే సీట్లు ఇచ్చారంటూ మండిపాటు.
7:45 AM, March 28th 2024
బీసీలకు హ్యాండిచ్చిన బాబు..
- ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు హ్యాండిచ్చిన చంద్రబాబు
- పేరుకే బీసీల పార్టీ అని బిల్డప్
- ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు ఎస్సీలకు కేటాయింపు
- ఐదు సీట్లు ఓసీలకు కేటాయించిన చంద్రబాబు
- మూడు తన సామాజికవర్గానికి చెందిన వారికే కట్టబెట్టిన చంద్రబాబు
- తమకు బాబు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ బీసీ వర్గాలు మండిపాటు
- ఎన్టీఆర్ జిల్లాలో రెండు సీట్లు బీసీ, రెండు ఎస్సీలకు, మూడు ఓసీలకు కేటాయించిన సీఎం జగన్
7:30 AM, March 28th 2024
పురంధేశ్వరిని కలిసిన పరిపూర్ణానంద స్వామి
- హిందూపురం ఎంపీగా లేదా ఎమ్మెల్యేగా టికెట్ ఇవ్వాలని వినతి
- లేనిపక్షంలో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగుతానంటూ కామెంట్స్
- ఉదయం వచ్చి మధ్యాహ్నం అభ్యర్థులైపోతున్నారు
- పొత్తుకు ముందు నుంచే నేను హిందూపురం టికెట్ ఆశించాను.
7:20 AM, March 28th 2024
నమ్మించి మోసం చేసిన వ్యక్తి పవన్: పోతిన మహేష్
- పవన్‌పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు
- వెస్ట్ టిక్కెట్‌పై ఆశపెట్టుకున్న జనసేన
- నమ్మించి మోసం చేసిన పవన్
- పార్టీ కోసం కష్టపడిన వారికి పవన్ న్యాయం చేస్తాడని నమ్మిన పోతిన మహేష్
- వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలంటూ పదిరోజులుగా నిరసనలు చేపట్టిన పోతిన మహేష్ మద్దతుదారులు
- సీటు బీజేపీకి వెళ్లిపోవడంతో పోతిన ఆశలు ఆవిరి
- తనను వాడుకుని వదిలేశారంటున్న పోతిన మహేష్
- ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగనున్న మహేష్
- పవన్ ఫోటోతోనే బరిలోకి దిగేయోచనలో పోతిన
7:00 AM, March 28th 2024
చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్
- 2024 ఎన్నికల సమరానికి సిద్ధంగా ఉన్నాం
- నమ్మించి మోసం చేయడంలో చంద్రబాబు 45 ఏళ్ల అనుభవం
- ఎన్నికలప్పుడు మాత్రమే చంద్రబాబుకు మేనిఫెస్టో గుర్తుకొస్తుంది
- ఎన్నికలయ్యాక బాబు ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేస్తాడు
- వైఎస్ వివేకాను ఎవరు చంపారో అందరికి తెలుసు
- హంతకుడికి నా వాళ్లు మద్దతిస్తున్నారు
- పేదల భవిష్యత్తుకు అడ్డుపడుతున్న దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి
- దుష్టచతుష్టయాన్ని ఓడించేందుకు మీ అర్జునుడు సిద్ధం
- నేను దేవుడు, ప్రజలనే నమ్ముకున్నా
- చంద్రబాబు మేనిఫెస్టోలోని 10 శాతం హామీలను కూడా నెరవేర్చలేదు
- మన మేనిఫెస్టోలోని 99 శాతం హామీలను నెరవేర్చిన ఘనత మనది
- చంద్రబాబు వదిన గారి చుట్టం కంపెనీకి బ్రెజిల్ నుంచి డ్రగ్స్ వచ్చాయి
- తప్పు చేసేది వారు.. నెపం నెట్టేది మనపై
- చంద్రబాబు చేసేది శవ రాజకీయాలు, కుట్రలు: సీఎం జగన్
- ఈనాడు పేపర్‌ను చూస్తే.. ఛీ ఇదీ ఒక పేపరేనా అనిపిస్తోంది
- చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ, నా ఇద్దరు చెల్లెలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 కలిసి ఒకే ఒక్కడిపై యుద్ధం చేస్తున్నారు.
- వీరెవరికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు
- నాకు దేవుడు, ప్రజలు అండగా ఉన్నారు
- అధికారం కోసం చంద్రబాబు అందరికి కాళ్లు పట్టుకుంటున్నారు
- ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రతి గ్రామంలోనూ అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం
- ప్రతి నెలా ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నాం
- రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, దేశంలోనే ఎక్కడా లేదు
- పెన్షన్ కోసం ప్రతి ఏడాది రూ.24 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం
6:50 AM, March 28th 2024
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
- అవనిగడ్డ, పాలకొండ, విశాఖ అసెంబ్లీ స్థానాలు పెండింగ్.
- మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని పెండింగ్ లో ఉంచిన జనసేనాని.
- ఆయా నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పవన్ కల్యాణ్.
- మచిలీపట్నం ఎంపీ బాలశౌరితో భేటీ అయిన పవన్.
- విజయవాడ పశ్చిమ సీటు కోసం పవన్ ను కలిసిన పోతిన మహేష్.
- మరో రెండు రోజుల్లో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు పవన్ కసరత్తు.
- ఈనెల 30 నుంచి పిఠాపురంలో ప్రచారాన్ని ప్రారంభించనున్న పవన్
6:40 AM, March 28th 2024
చంద్రబాబుపై కొడాలి నాని ఘాటు వ్యాఖ్యలు
- అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైనా పట్టుకుంటాడు
- చంద్రబాబు వెనుక ఉన్న తెలుగు తమ్ముళ్లకు.. పదిమంది జనసేనలకు తప్ప ...ఈ విషయం ప్రతీ ఒక్కరికీ తెలుసు
- జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరు రాష్ట్రంలో ఉండరు
- అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబు
- ఒంటరిగా పోటీ చేస్తే గెలవడని తెలిసే ఇంటికి వెళ్లి మరీ పవన్ కాళ్లు పట్టుకున్నాడు
- మతతత్వ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేశానని బాధపడని చంద్రబాబు.. అమిత్ షా డిమాండ్లకు తలొగ్గి తిరిగి పొత్తు పెట్టుకున్నాడు
- వాలంటీర్ల పై చంద్రబాబు యూటర్న్ అంతా దొంగ నాటకం
- వాలంటీర్ల పేరు చెబితే చంద్రబాబు ఉలిక్కి పడుతున్నాడు
- వాలంటీర్ వ్యవస్థ ప్రభుత్వానికి.. ప్రజలకు మధ్య వారధులుగా పనిచేస్తోంది
- వాలంటీర్ వ్యవస్థను ఎన్నికల్లో ఉపయోగించుకోవాల్సిన అవసరం మాకు లేదు
- చదువుకున్న వాలంటీర్లకు ఏది మంచో తెలుసు, అదే వాళ్లు ప్రజలకు చెబుతారు
- ఐదేళ్లుగా ప్రజల ప్రతి అవసరాలు తీరుస్తూ సేవలందిస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ అవమానకరంగా మాట్లాడారు
- ఇప్పుడు చంద్రబాబు యూటర్న్ తీసుకుని వాలంటీర్ల జీతాలు పెంచుతామంటున్నాడు
- చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలే
- ఇప్పుడున్న వాలంటీర్లను ఇంటికి పంపి.. తెలుగుదేశం కార్యకర్తలతో చంద్రబాబు కలెక్షన్లు వసూలు చేస్తాడు
- జన్మభూమి కమిటీలను తిరిగి ఏర్పాటు చేసి.. కార్యకర్తలను పెట్టుకుని వారికి జీతాలిస్తాడు
6:30 AM, March 28th 2024
టీడీపీకి వలస నేతలే దిక్కు..
- అభ్యర్థులు లేక చంద్రబాబు అవస్థలు
- కనీసం పార్టీలో చేరకుండానే తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల ఎంపీ సీటు
- అసెంబ్లీ స్థానాల్లోనూ వలస నేతలే
- అభ్యర్థులే దొరకని దుస్థితి
- బాపట్లకు తెలంగాణ దిగుమతి నేత
Comments
Please login to add a commentAdd a comment