April 9th: ఏపీ ఎన్నికల సమాచారం | AP Elections 2024: Political News In Telugu On April 9th Updates | Sakshi
Sakshi News home page

April 9th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Tue, Apr 9 2024 6:57 AM | Last Updated on Tue, Apr 9 2024 7:17 PM

AP Elections 2024: Political News In Telugu On April 9th Updates - Sakshi

April 9th AP Elections 2024 News Political Updates

07:10 PM, April 09 2024

దత్తపుత్రడు డబ్బుకు అమ్ముడుపోతాడు కానీ వాలంటీర్లు కాదు: పేర్ని నాని

  • చంద్రబాబు వస్తే వాలంటీర్‌ వ్యవస్థను తొలగిస్తాడు
  • జన్మభూమి కమిటీల పేరు మార్చి..చంద్రబాబు తనవారినే వాలంటీర్లుగా పెట్టుకుంటాడు
  • బాబు మోసాలు, కుట్రలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
  • మళ్లీ రాబోయేది జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వమే
  • సీఎం జగన్‌పై 2లక్షల 50 వేల మంది వాలంటీర్లకు నమ్మకం ఉంది
  • సీఎం జగన్‌ ఎలా చూసుకుంటారో వాలంటీర్లకు తెలుసు

06:40 PM, April 09 2024

వర్మ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం: వంగా గీత

  • ఫేక్‌ వీడియోలు సృష్టించి అసత్య ప్రచారాలు చేస్తున్నారు
  • పార్టీ మెటీరియల్‌తో వెళ్తున్న వాహనాన్ని అధికారులు ఆపితే..అందులో డబ్బుందని తప్పుడు ప్రచారం చేశారు
  • ఎవరు డబ్బు ఖర్చు చేస్తారో పిఠాపురం ప్రజలకు బాగా తెలుసు
  • అసత్య ప్రచారాలతో ఎలాంటి ప్రయోజనం పొందలేరు

06:30 PM, April 09 2024

ఉండి కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే  రామరాజు కంటతడి

  • టికెట్ వేరొకరికి కేటాయించేందుకు సిద్ధమయ్యారు
  • కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని కుటుంబసభ్యులు చెప్పినట్టు చేస్తానని చెప్పా
  • రాజకీయాల నుంచి విరమించుకోవడంపై ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తా

05:18 PM, April 09 2024

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సీటుపై టీడీపీ శ్రేణుల్లో అయోమయం 

  • ఎమ్మెల్యే అభ్యర్థి రామరాజు సీటు మారుస్తారని ప్రచారం 
  • సీటు మార్పు ఉంటుందనే అనుమానంతో రామరాజు వర్గం ఆందోళన
  • రామరాజు సీటు మార్చొద్దంటూ టీడీపీ కార్యకర్తల నిరసన
  • ఆత్మీయ సమావేశంలో కంటతడి పెట్టిన రామరాజు

02:18 PM, April 09 2024

డాక్టర్ భీఆర్‌ అంబేద్కర్ కోనసీమ జిల్లా:

రామచంద్రాపురం మండలం కోట గ్రామంలో  బీభత్సం సృష్టించిన జనసేన కార్యకర్తలు

  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గాలి దుర్గా రావు, గాలి రమేష్, అనిశెట్టి కోటేశ్వర రావులపై దాడికి పాల్పడిన జనసేన కార్యకర్తలు గంగు మళ్ళ వీర బాబు,  ధర్మయ్య, ఆదిలక్ష్మి
  • గాయపడిన వారిని రామచంద్రపురం ఏరియా హాస్పిటల్కి‌ తరలింపు 
  • వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను చంపేస్తామంటూ ఫోన్లో బెదిరిస్తున్న జనసేన కార్యకర్తలు
  • జనసేన కార్యకర్త గంగుమల్ల వీరబాబుపై గతంలోని పలు పోలీస్ కేసులు
  • జరిగిన దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

01:57 PM, April 09 2024
బీసీ నేతలకు పవన్ కల్యాణ్‌ వెన్నుపోటు

  • జనసేనలో బీసీ నేతలకు నో టిక్కెట్
  • అర్థబలం ఉన్న  నేతల కోసం బలహీన వర్గాల నేతలకు పవన్ హ్యాండ్
  • పవన్ మోసం చేయడంతో పార్టీని వీడుతున్న బీసీ నేతలు
  • క్రిష్ణా జిల్లాలో ఒకేరోజు ఇద్దరు బీసీ నేతలు జనసేనకి గుడ్ బాయ్
  • విజయవాడ పశ్చిమ ఇన్ ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
  • కైకలూరు జనసేన ఇన్ ఛార్జ్ బీవీ రావు రాజీనామా
  • నగరాలు, యాదవ సామాజికవర్గాల నేతలు కావడంతో సీటివ్వని పవన్ కళ్యాణ్
  • సుజనా చౌదరి కోసం నగరాల నేత పోతిన మహేష్ కి  హ్యాండ్ ఇచ్చిన పవన్
  • కామినేని శ్రీనివాస్ చౌదరి కోసం యాదవ నేత బీవీరావుకి హ్యాండ్ ఇచ్చిన పవన్
  • మరోవైపు గోదావరి జిల్లాల్లోనూ వరుసగా బీసీ నేతలు రాజీనామా
  • ఇప్పటికే శెట్టిబలిజ నేతలు పితాని బాలక్రిష్ణ, మాజీ మేయర్ సరోజ లు రాజీనామా
  • ఉభయగోదావరి జిల్లాల్లో ఒక్క శెట్టిబలిజ, గౌడ వర్గ నేతలకు సీటివ్వని జనసేన
  • గుంటూరులో నాదెండ్ల మనోహర్ కోసం బీసీ నేతలకు హ్యాండ్ ఇచ్చిన పవన్ 

01:30 PM, April 09 2024
చంద్రబాబు, రఘురామరాజుకి బీజేపీ ఝలక్

  • సీట్ల మార్పునకు అంగీకరించని బిజెపి
  • బీజేపీ ప్రకటించిన జాబితాలో మార్పులకు ససేమిరా
  • నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ కే మద్దతు
  • అధికారికంగా ప్రకటించిన బిజెపి ఏపీ ఇన్ ఛార్జ్ సిద్దార్థనాథ్ సింగ్
  • నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లు మార్చాలని చంద్రబాబు ప్రతిపాదన
  • చంద్రబాబు ప్రతిపాదనకు ససేమిరా అన్న బిజెపి
  • రఘురామకృష్ణం రాజుకి నర్సాపురం సీటుపై ఆశలు గల్లంతు
  • మోదీ నియమించిన శ్రీనివాస వర్మను మార్చేది లేదన్న సిద్ధార్థనాథ్ సింగ్
  • ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా క్లారిటీ ఇవ్వని బిజెపి
  • అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత

01:08 PM, April 09 2024
కామినేనికి ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు సవాల్‌

  • ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు 
  • కామినేని  శ్రీనివాసరావు 40 ఏళ్ల నుంచి కైకలూరు ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు
  • కైకలూరులో 70 శాతం అభివృద్ధి తానే చేశానంటున్నాడు
  • ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజమని చెప్పగల సమర్ధుడు కామినేని
  • వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కైకలూరులో రూ. 746 కోట్ల రూపాయలు సంక్షేమానికి ఖర్చు చేశాం 
  • 760 కోట్లతో రోడ్లు, స్కూళ్లు, సచివాలయాలు కట్టి అభివృద్ధి చేశాం
  • ఎవరి హయాంలో ఎక్కువ అభివృద్ధి జరిగిందో చర్చించేందుకు నేను సిద్ధం
  • కామినేనికి దమ్ముంటే ఒకే వేదిక పైకి వచ్చి నాతో చర్చించాలి

11:40 AM, April 09 2024
కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ మిథున్‌రెడ్డి ఫైర్‌

  • ఆస్తులు కాపాడుకోవడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరాడు
  • సీఎంగా పనిచేసిన కాలంలో ఆయన వేల కోట్లు అక్రమంగా సంపాదించారు
  • అక్రమ సంపాదన పరిరక్షణ కోసమే కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ చెంత చేరాడు
  • సీఎంగా దిగిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు
  • సంత నియోజకవర్గ పీలేరు 10 సంవత్సరాలగా రాలేదు
  • కరోనా సమయంలో సొంత గ్రామం వాసులకు ఒక్క సహాయం కూడా చేయలేదు
  • కేవలం తన స్వార్థం కోసం ఇప్పుడు బీజేపీ నుంచి రాజంపేట ఎంపీ స్థానంకు పోటీ చేస్తున్నారు
  • కిరణ్ కుమార్‌రెడ్డి చిత్తుగా ఓడిపోవడం ఖాయం
  • సొంత గ్రామ వాసులకు న్యాయం చేయని కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ ప్రజలకు ఏ మేలు చేస్తాడు

9:43 AM, April 09 2024
విశాఖ: కూటమిలో ప్లెక్సీ వార్

  • గంటా శ్రీనివాసరావుపై మండిపడ్డ జనసేన, బీజేపీ నేతలు..
  • టీడీపీ ఫ్లెక్సీలో మోదీ, పవన్ కల్యాణ్‌ ఫోటోలు చిన్నగా వేయడంపై ఆగ్రహం
  • కూటమి ధర్మాన్ని గంటా పాటించలేదంటూ ఆగ్రహం
  • మోదీ, పవన్ కల్యాణ్‌ను గంటా అవమానించారంటూ మండిపాటు
  • జనసేన త్యాగం వలనే గంటాకు సీటు వచ్చిందన్న సంగతిని మర్చిపోవద్దని హెచ్చరిక

8:38 AM, April 09 2024
షర్మిలకు ఝలక్‌

  • ఎన్నికల ప్రచారంలో సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన పీసీసీ అధ్యక్షురాలు
  • జై జగన్‌ అంటూ అభిమానుల నినాదాలు
  • అక్కడ నుంచి కాదు.. తన వద్దకు వచ్చి మాట్లాడాలని షర్మిల సవాల్‌
  • దీంతో ఆమె వద్దకు వెళ్లి సీఎం చేసిన మంచి పనులను వివరించిన ఓబుళరెడ్డి
  • మాట రాక నిశ్చేష్టురాలైన షర్మిల 
     

8:24 AM, April 09 2024
బాబూ.. కాపులను మరోసారి మోసం చేయొద్దు

  • చంద్రబాబుకి కాపు ఐక్యవేదిక బహిరంగ లేఖ 
  • ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కాపులను మరోసారి మోసం చేయవద్దు
  • పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు పవన్‌తో కలిసి వస్తున్న చంద్రబాబు కాపు రిజర్వేషన్లపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
  • మూడు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని కాపు రిజర్వేషన్లపై చంద్రబాబు నాన్చుడు ధోరణి
  • 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారు
  • కేంద్రం ఇచ్చిన 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లలో కాపులకు ఐదు శాతం అంటూ ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పారు

8:22 AM, April 09 2024
రాజకీయాల్లోనూ పవన్‌ది నటనే

  • స్వార్ధం కోసమే పవన్‌ జనసేనను స్థాపించారు
  • త్యాగం పేరుతో లోపాయికారి ఒప్పందాలతో నాలాంటి వారిని నట్టేట ముంచారు 
  • భీమవరం నుంచి పిఠాపురం ఎందుకు మారారో పవన్‌ చెప్పాలి
  • అనకాపల్లి సీటునూ ఎందుకు త్యాగం చేశారు?
  • జన సైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా మార్చారు
  • పార్టీని పూర్తిగా నాశనం చేసిన నాదెండ్ల మనోహర్‌
  • జనసేనకు రాజీనామా చేసిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్‌  
     

7:05 AM, April 09 2024
కూటమిని వీడని గందరగోళం

  • అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించినా ఇంకా స్పష్టత కరువు
  • 20కిపైగా ఎమ్మెల్యే, రెండు ఎంపీ స్థానాల్లో అభ్యర్థులను మార్చేందుకు ప్రయత్నాలు 
  • నర్సాపురం ఎంపీ సీటుపై  ఊహాగానాలు
  • ఆ సీటును బీజేపీ నుంచి వెనక్కి తీసుకుంటున్నారని ప్రచారం
  • రఘురామకృష్ణరాజు  టీడీపీలో చేరికతో అయోమయం
  • ఏలూరు ఎంపీ అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రచారం
  • పలు సీట్లకు ప్రకటించిన అభ్యర్థులపైనా చంద్రబాబు పునరాలోచన
  • తలలు పట్టుకుంటున్న తమ్ముళ్లు

6:58 AM, April 09 2024
టీడీపీలో ‘ఆడియో’ దుమారం

  • వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్‌ సంభాషణతో ఆ పార్టీలో కలవరం
  • వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఫోన్‌ సంభాషణతో ఆ పార్టీలో కలవరం.. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఓడిపోతాడు 
  • ఆత్మకూరులో ‘ఆనం’కు పదివేలతో ఓటమి ఖాయం
  • వైఎస్సార్‌సీపీని వీడిపోవడం నాకిష్టం లేదు 
  • ఎన్నికల్లో విజయం సాధించకుంటే క్విట్‌ అవుతాం 
  • కలకలం రేపుతున్న టీడీపీ కోవూరు అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వ్యాఖ్యలు 
  • ఆడియో విడుదల చేసిన ఎమ్మెల్యే ప్రసన్న సోదరుడు  
  • ఎవరూలేక వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీ అభ్యర్థుల్ని దిగుమతి చేసుకుంది : విజయసాయిరెడ్డి 
  • నా సోదరుడికి రూ.3 కోట్లు ఆఫర్‌ ఇచ్చినా తిరస్కరించాం: నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి

6:57 AM, April 09 2024
మీతోనే మా పయనం.. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం

  • మేమంతా సిద్ధం బస్సు యాత్రలో జన నినాదం
  • పదికాలాల పాటు సుపరిపాలన అందించాలని ఆకాంక్ష 
  • ముఖాముఖిలో సీఎం జగన్‌ను ఆశీర్వదించిన అవ్వాతాతలు 
  • సంక్షేమాభివృద్ధికి మరోసారి పట్టాభిషేకం చేస్తామని ప్రతిన
  • మండుటెండను లెక్క చేయక ఊరూరా ఘన స్వాగతం 
  • కురిచేడు, వినుకొండలో జన సంద్రాన్ని తలపించిన రోడ్‌షో 
     

6:35 AM, April 09 2024
మళ్లీ పలికిన బాబు చిలక

  • నాడు లగడపాటిలా నేడు పీకే చిలక జోస్యం 
  • చంద్రబాబు విసిరే ప్యాకేజీ కోసం పచ్చగూటికి చేరిన ప్రశాంత్‌ కిశోర్‌ 
  • అవసరమైనప్పుడల్లా బాబుకు అనుకూల ప్రకటనలు.. మళ్లీ వైఎస్సార్‌సీపీ గెలుస్తుందని డజనుకు పైగా జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడి 
  • ఏ యంత్రాంగం లేని పీకే.. ప్యాకేజీ కోసమే చంద్రబాబు మాటలు 
  • 2019లోనూ లగడపాటి రాజగోపాల్‌తో చిలక జోస్యం చెప్పించిన చంద్రబాబు
  • ఆ జోస్యం వికటించడంతో మాయమైన లగడపాటి.. ఈ ఎన్నికల తర్వాత పీకే కూడా మాయమవడం ఖాయం 
  • రాజకీయంగా కలిసిరాక దిక్కుతోచని స్థితి
  • దాంతో ఇం‘ధనం’ కోసం ఎవరికి నచ్చినట్లుగా వారికి చిలక జోస్యం
  • తెలంగాణ, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో వికటించిన జోస్యం 

6:30 AM, April 09 2024
ఓటమి భయంతో టీడీపీ అడ్డదారులు

  • ప్యాకేజీలతో ఆయారాం గయారాంలకు వల 
  • కోవూరు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సోదరుడికే రూ.3 కోట్ల ఆఫర్‌ 
  • రంగంలోకి దిగిన ‘వేమిరెడ్డి’ టీమ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement