Apr 8th: ఏపీ ఎన్నికల సమాచారం | AP Elections Today Political News Updates And Headlines On April 8th In Telugu - Sakshi
Sakshi News home page

April 8th AP Election News Updates: ఏపీ ఎన్నికల సమాచారం.. ఎప్పటికప్పుడు

Published Mon, Apr 8 2024 7:03 AM | Last Updated on Mon, Apr 8 2024 9:08 PM

AP Elections 2024: Political News In Telugu On April 8th Updates - Sakshi

April 8th AP Elections 2024 News Political Updates

9:07 PM, April 08 2024

విజయవాడ: 

బోండా ఉమా పోటీ చేయడానికి  అనర్హుడు
టీడీపీ పార్టీ కార్యాలయంలో ఉన్న బోండా ఉమా ఓట్లను రద్దు చేయాలి  

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే మల్లాది విష్ణు

  • అజిత్ సింగ్ నగర్ లోని కమర్షియల్ బిల్డింగ్ అయిన టీడీపీ సెంట్రల్ నియోజకవర్గ కార్యాలయంలో బోండా ,బోండా కుటుంబానికి ఓట్లు 
  • కమర్షియల్ బిల్డింగ్‌లో ఓట్లు ఉన్నందున వాటిని తొలగించాలని కోరిన మల్లాది విష్ణు
  • ఆధారాలను ప్రధాన ఎన్నికల అధికారికి సమర్పించిన మల్లాది విష్ణు, వైఎస్సార్‌సీపీ నేతలు

8:15 PM, April 08 2024

విజయవాడ: 

ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనకు వరుస ఎదురుదెబ్బలు 

  • విజయవాడ వెస్ట్‌లో జనసేనకు గుడ్ బై చెప్పిన పోతిన మహేష్ 
  • పోతిన మహేష్ బాటలోనే కైకలూరు జనసేన నేత బి.వి.రావు
  • జనసేన క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేసిన బి.వి.రావు
  • కైకలూరు టిక్కెట్ ఆశించి భంగపడ్డ బి.వి.రావు 
  • గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీచేసి ఓడిపోయిన బి.వి.రావు
  • ఐదేళ్లుగా కైకలూరులో పార్టీ కోసం కష్టపడిన బి.వి.రావు
  • కైకలూరు స్థానాన్ని బీజేపీకి వదిలేసిన పవన్ 
  • బీజేపీ తరపున కామినేని శ్రీనివాసరావుకు కైకలూరు టిక్కెట్ కేటాయింపు
  • జనసేనను నమ్ముకున్న మరో బిసి నేతకు అన్యాయం 

బీసీ వ్యక్తినైన నాకు తీవ్ర అన్యాయం జరిగింది:  బీవీ రావు

  • పార్టీ జెండా మోసిన వారిని మోసం చేశారు 
  • బీసీలమైన మాకు ఆత్మాభిమానం ఉంది
  • ఎవరి కాళ్ల దగ్గర చాకిరీ చేయడానికి మేం సిద్ధంగా లేం
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేనలో పనిచేసిన ఒక్కరికి కూడా టిక్కెట్ ఇవ్వలేదు 
  • 16 నియోజకవర్గాల్లో జెండా మోసిన జనసేన కార్యకర్తలకు న్యాయం చేయలేదు 
  • టిక్కెట్ ఎందుకు ఇవ్వలేకపోయాడో..పవన్ పిలిచి మాకు చెప్పలేదు 
  • కామినేనికి సీటు ఇస్తున్నట్లు కూడా పవన్ మాతో చెప్పలేదు 
  • కామినేని శ్రీనివాసరావు ఒంటెద్దు పోకడతో మేం మనస్తాపం 
  • ఆత్మాభిమానం చంపుకుని మేం పనిచేయలేం 
  • జనసేనలో పదవులకు , క్రియాశీలక సభ్యత్వానికి రాజీనామా చేశా 
     

6:52 PM, April 08 2024

వైఎస్అర్ జిల్లా: 

మైదుకూరు నియోజకవర్గం దువ్వూరులొ పీసీసీ అద్యక్షురాలు షర్మిలకు షాక్ 

  • దువ్వూరులో షర్మిల మాట్లాడుతుండగా జై జగన్ అంటూ నినాదాలు
  • మాట్లాడేందుకు ఒకరు వేదికపైకి రావాలంటూ ఆహ్వానించిన షర్మిల 
  • షర్మిల అహ్వనం మేరకు వేదికపైకి వెళ్లిన మైదుకూరు జేసీఎస్‌ కన్వీనర్ యేమిరెడ్డి చంద్ర ఓబుల్‌రెడ్డి
  • జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ షర్మిల సవాల్ 
  • షర్మిల ఎదుట సీఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించిన చంద్ర ఓబుల్‌రెడ్డి
  • జగనన్న మా సమస్యలు విన్నాడు... నేను ఉన్నానన్నాడు
  • ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించాడు
  • మీరు కుటుంబ సమస్య చెబుతున్నారు కాదనను
  • అది మీరు ఇంట్లో తేల్చుకొవాలన్న చంద్ర ఓబుల్‌రెడ్డి
  • మేము జగన్‌కు అండగా నిలుస్తామన్న చంద్ర ఓబుల్‌రెడ్డి

5:40 PM, April 08 2024

బాపట్ల జిల్లా: 

మార్టూరులో టీడీపీ, జనసేన పార్టీలకు భారీ షాక్‌

  • నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు, మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన 40 కాపు సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు

5:29 PM, April 08 2024

కృష్ణాజిల్లా: 

ఎన్నికల ప్రచారంలో మనీ పాలిటిక్స్ చేస్తున్న టీడీపీ నేతలు 

  • టీడీపీ నేతల ఎన్నికల ప్రచారంలో వెయ్యి పలుకుతున్న హారతి పళ్లెం 
  • హారతి పట్టిన మహిళలకు వెయ్యి రూపాయలిస్తున్న టీడీపీ నేతలు
  • గన్నవరం ఎన్నికల ప్రచారంలో డబ్బులు పంచిన టీడీపీ అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావ్

3:40 PM, April 08 2024

చిత్తూరు

వెదురుకుప్పం మండలంలో టీడీపీకి భారీ షాక్

  • డిప్యూటీ సీఎం నారాయణస్వామి సమక్షంలో టీడీపీ నుంచి 100 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • టీడీపీకి చెందిన చిరంజీవి రెడ్డి, భాస్కర్ రెడ్డి, మోహన్ రెడ్డి, రమేష్ రెడ్డిలతో సహా వంద కుటుంబాలు చేరిక

3:30 PM, April 08 2024

కుప్పం(చిత్తూరు జిల్లా)

కుప్పం నియోజకవర్గంలోమూకుమ్మడిగా వాలంటీర్ల రాజీనామా

  • గుడిపల్లి మండలంలో 208 మంది, రామకుప్పం మండలంలో 260 మంది, శాంతిపురం మండలంలో 250 మంది వాలంటీర్లు రాజీనామా
  • రాజీనామా పత్రాలను ఎంపిడిఓ కు అందజేసిన వాలంటీర్లు
  • కుప్పం మండలంలో ఇదివరకే 384 మంది వాలంటీర్లు రాజీనామా
  • కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్‌ను, సీఎంగా జగన్‌ను గెలిపిచుకునేందుకు రాజీనామా చేసినట్లు స్పష్టం చేసిన వాలంటీర్లు

3:00 PM, April 08 2024

భీమవరం(పశ్చిమగోదావరి జిల్లా): 

  • భీమవరం మండలం చినగరువు, తుందుర్రు, జొన్నలగరువు  గ్రామాలలో నాయకులు , కార్యకర్తలతో వైఎస్సార్‌సీపీ ఆత్మీయ సమావేశం
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న భీమవరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గ్రంధి శ్రీనివాస్ 
  • మూడు గ్రామాల నుంచి 150 మంది జనసేన,టీడీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరిక
  • పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్

2:00 PM, April 08 2024
నటించేవాడు నాయకుడు కాలేడు: పోతిన మహేష్‌

  • జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను
  • నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు
  • భవిష్యత్తు ఇచ్చేవాడే నాయకుడు.. 
  • నటించేవారు నాయకుడు కాలేదు
  • రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేరు.
  • పవన్ కళ్యాణ్ ను నమ్మి అడుగులు వేసాను
  • కొత్తతరం న్యాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేసాం
  • పవన్ కళ్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం
  • 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం
  • జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది
  • కానీ పవన్ కళ్యాణ్ లో స్పందన లేదు
  • రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు, నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి
  • పవన్ కళ్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి
  • పవన్ కళ్యాణ్ మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి
  • స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్లు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది
  • పార్టీ నిర్మాణం, కేడర్‌పై పవన్ దృష్టి సారించలేదు
  • అన్నీ తాత్కాలికం.. అంతా నటన..
  • నమ్మి నట్టేట మునిగిపోయాం..
  • ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు
  • పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం
  • ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు
  • 25కేజీల బియ్యం కాదు.. 25ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25సీట్లలో పోటీ చేయలేకపోయారు
  • 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా
  • 21సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేన పార్టీకి ఏం భవిషత్తు ఇవ్వగలరు
  • పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి
  • పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం 
  • కానీ అన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయి
  • పవన్ కళ్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి
  • సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు
  • గెలిచిన నలుగురు ఎమ్మేల్యేలు మీకోసం నిలబడతారా?
  • జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు
  • అసలు జనసేన ఎవరికోసం పెట్టారు
  • పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది

1:15 PM, April 08 2024
జగన్‌ మళ్లీ సీఎం కావాలన్నదే ప్రజల కోరిక: వంగా గీత

  • వైఎస్సార్‌సీపీపై వ్యతిరేకత ఉందని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
  • ప్రజల్లో సీఎం జగన్‌కు, వైఎస్సార్‌సీపీకి చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది.
  • ఫ్యాన్ గాలి జోరుగా, హుషారుగా ఉంది.
  • ముఖ్యమంత్రి జగన్‌పై ప్రజల్లో ధీమా ఉంది. 
  • ఆయన రుణం తీర్చుకుంటామని ఓటర్లు చెబుతున్నారు.
  • ఇంటికి పెన్షన్ పంపి మా పేదరికాన్ని గౌరవించారని వృద్దులు చెబుతున్నారు.
  • మళ్ళీ జగన్ రావాలి అని ప్రజల కోరిక
  • ప్రజలు మా మీద నమ్మకాన్ని చూపిస్తున్నప్పుడు ఎండలు మాకు ఒక లెక్కకాదు.

12:35 PM, April 08 2024
ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత పిటిషన్

  • పార్టీ ఫిరాయించిన జంగాపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసిన విప్ అప్పిరెడ్డి
  • ఇటీవలే ఫిరాయింపుల చట్టం ఉల్లంఘించి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి
  • జంగాపై అనర్హత వేటు వేయాలని వైఎస్సార్‌సీపీ శాసనమండలి చైర్మన్‌కి ఫిర్యాదు

12:30 PM, April 08 2024
ఉండిలో రసవత్తరంగా రాజీకీయం

  • జోరుగా ప్రచారం చేస్తున్న టీడీపీ రెబల్ శివరామరాజు
  • చంద్రబాబును కలవాలని నన్నుపిలిచారు 
  • కానీ ప్రజాక్షేత్రంలో నేను ఉండాలని వెళ్లలేదు 
  • ఉండి ప్రజలు నన్ను ఆదరిస్తారు 
  • ఎమ్మెల్యే రామరాజును ప్రత్యర్ధిగా నేను చూడడంలేదు 
  • ఎంపీగా ఉన్న రఘురామ కృష్ణంరాజు ఎమ్మెల్యే టికెట్‌ కోసం ఎందుకు రావాలి? 

12:20 PM, April 08 2024
చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్‌

  • ఎన్నడూ లేని విధంగా కోట్ల రూపాయల లబ్ధి ప్రతీ గ్రామానికి జరిగింది
  • సీఎం జగన్ సుపరిపాలనలోనే ఇది సాధ్యమైంది. 
  • ఎన్నికల ముందు చెప్పిన అన్ని హామీలు ముఖ్యమంత్రి జగన్ అమలు చేశారు
  • అన్ని అమలు చేశాకే మళ్ళీ ఓటు అడుగుతున్న నేత సీఎం జగన్ 
  • సీఎం జగన్‌కు, చంద్రబాబుకు మధ్య ఉన్న తేడా అందరూ గమనించాలి
  • 600 హామీలు ఇచ్చి మోసం చేసిన ఘనత చంద్రబాబుది
  • ముఖ్యమైన హామీలు అని చెప్పి పాంప్లెట్లు పంచి, ఒక్క పని కూడా చేయలేదు
  • మళ్ళీ ఎన్నికల సమయం ఆసన్నమైంది.
  • చంద్రబాబు ఈసారి సూపర్ సిక్స్ అంటూ నెరవేర్చలేని హామీలు ఇస్తున్నారు
  • 14వేల కోట్ల రూపాయలు ఉన్న మహిళా సంఘం రుణాలు కూడా మాఫీ చేయలేదు
  • రైతు రుణమాఫీ, ఇంటింటికీ ఉద్యోగం అని చెప్పి అందరినీ మోసం చేసిన ఘనుడు చంద్రబాబు
  • 2019 ముందు తర్వాత మహిళల బ్యాంక్ ఖాతాలు చూస్తే ఎంత మేలు జరిగిందో అర్థమౌతుంది
  • ప్రజలే మరోసారి సీఎంగా జగన్‌ను చూడాలనుకుంటున్నారు
  • చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు సాధ్యం కాదని లెక్కలతో సహా సీఎం జగన్ నిరూపించారు. 
  •  సూపర్ సిక్స్ అమలుకు 2.5 లక్షల కోట్లు అవసరం 
  • మన పథకాల అమలు వల్ల రాష్ట్రం శ్రీలంక అవుతుందని విమర్శించిన చంద్రబాబు సూపర్ సిక్స్ అమలు చేస్తారు? 
  • కులం, మతం, పార్టీ చూడకుండా సీఎం జగన్ పేదరికాన్ని కొలమానంగా తీసుకుని పథకాలు అమలు చేశారు
  • టీడీపీ హయాంలో కేవలం జన్మభూమి కమిటీలు చెప్పిన వారికి మాత్రమే పథకాలు
  • ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది
  • సీఎం జగన్‌ను ప్రజలు కచ్చితంగా ఆశీర్వదిస్తారు
  • మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను శాసనసభకు, మిథున్ రెడ్డిని పార్లమెంట్‌కు పంపించాలని కోరుతున్నా
  • మూడున్నర ఏళ్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి కిరణ్ కుమార్ రెడ్డి నేడు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు
  • అభివృద్ధిని పక్క నియోజకవర్గానికి కూడా పరిచయం చేయలేని ఘనత కిరణ్ కుమార్ రెడ్డిది
     

12:00 PM, April 08 2024
నియోజకవర్గాల్లో కూటమి నేతల మధ్య పొసగని సఖ్యత

  • చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం చేయాలని నిర్ణయం
  • పవన్‌ రోజూ అనారోగ్యం అంటున్నాడని టీడీపీ నేతల ఆరోపణ
  • కనీసం నాలుగు సభల్లో పాల్గొంటేనే ఓట్లపై నమ్మకం పెట్టుకోవచ్చన్న ఆలోచన
  • ప్రజాగళం మూడోవిడత సభల్లో పవన్‌తో కలిసి ప్రచారం చేయాలని చంద్రబాబు ప్రణాళిక
  • ఈనెల 10, 11 తేదీల్లో చంద్రబాబు, పవన్ ఉమ్మడి ప్రచారం లేదా సభ
  • ఈనెల 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ప్రజాగళం బహిరంగ సభలు
  • చివరి క్షణంలో పవన్‌ రాకపోతే ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోన్న టీడీపీ నేతలు
  • పవన్‌ నాన్‌-సీరియస్‌ పాలిటిక్స్‌తో అసలుకే మోసం వస్తుందని ఆందోళన

11:45 AM, April 08 2024
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సీట్ల పంచాయతీ

  • ఏలూరు ఎంపీ సీటు టీడీపీకి కేటాయించడంపై బీజేపీ నేతల ఆగ్రహం 
  • బీజేపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్న గారపాటి చౌదరి 
  • పోలవరం అసెంబ్లీ సీటుపై కూడా కొనసాగుతున్న రగడ 
  • పోలవరం బీజేపీకి కేటాయించడంపై టీడీపీ నేతల అసంతృప్తి 
  • అభ్యర్థిని మార్చాలంటూ పట్టుబడుతున్న టీడీపీ నేతలు 
  • నరసాపురం పార్లమెంట్ పరిధిలో మార్పులు లేనట్టే 
  • నరసాపురం ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున శ్రీనివాస వర్మ 
  • ఉండి అసెంబ్లీ కూటమి అభ్యర్థిగా రామరాజు కొనసాగింపు 
  • మార్పులు, చేర్పులకు ఇష్టపడని టీడీపీ, బీజేపీ

11:30 AM, April 08 2024
జనసేనకు పోతిన మహేష్‌ రాజీనామా

  • బెజవాడలో టీడీపీ, బీజేపీలకు షాక్ 
  • పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జ్‌ పోతిన మహేష్ రాజీనామా
  • జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన వెంకట మహేష్.
  • పశ్చిమ సీటు తనకు కేటాయించకపోవడంతో రాజీనామా
  • పోతిన మహేష్‌ని మోసం చేసిన పవన్ కళ్యాణ్
  • వేల కోట్లున్న సుజనా చౌదరి కోసం బీసీ నాయకుడు పోతిన మహేష్‌ను దగా చేసిన పవన్
  • విజయవాడ పశ్చిమ సీటు నీదేనని పోతిన మహేష్‌కి గతంలో చెప్పిన పవన్
  • పవన్ హామీతో అభ్యర్థిగా ప్రచారం చేసుకున్న పవన్
  • అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత మహేష్‌కి హ్యాండ్ ఇచ్చిన పవన్
  • పవన్ అవమానించడంతో జనసేనకి పోతిన మహేష్ రాజీనామా
     

11:45 AM, April 08 2024
రాజోలు జనసేన సీటుపై చర్చ

  • వరప్రసాద్ రాజోలు టికెట్ కేటాయించిన జనసేన 
  • అసంతృప్తిగా ఉన్న బొంతు రాజేశ్వరరావు వర్గం 
  • వరప్రసాద్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు 
  • వరప్రసాద్‌కు వ్యతిరేకంగా రోడ్లపై కరపత్రాలు

11:00 AM, April 08 2024
ప్రజలకు అందుబాటులో ఉన్న వారినే గెలిపించండి: ఎంపీ విజయసాయి

  • టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్ది మాట్లాడిన ఫోన్ కాల్‌లో ఎన్నో సంచలన విషయాలు బయటపడ్డాయ్.
  • ఓడిపోతే ప్రజలను పట్టించుకోకుండా.. వ్యాపారాలు చేసుకుంటామని ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్‌లో చెప్పింది.
  • వ్యాపారవేత్తలను కాకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యే ప్రసన్నను మరోసారి గెలిపించండి.
  • నెల్లూరు ప్రజలకు సేవ చెయ్యాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నా.

10:30 AM, April 08 2024
టీడీపీ సభ అట్టర్‌ప్లాప్‌: నంబూరు శంకరరావు

  • పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో చంద్రబాబు నిర్వహించిన సభ అట్టర్ ప్లాప్ అయింది. 
  • సభ అట్టర్ ప్లాప్ కావడంతో సానుభూతి కోసం టీడీపీ ఎన్నికల కార్యాలయాన్ని తెలుగుదేశం నాయకులే తగలబెట్టుకున్నారు
  • ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో గొడవలు సృష్టించడానికి తెలుగుదేశం అభ్యర్థి భాష్యం ప్రవీణ్ కుట్ర పన్నుతున్నాడు
  • భాష్యం ప్రవీణ్ నియోజకవర్గంలో అడుగుపెట్టగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు
  • ఇప్పుడు వాళ్లకు వాళ్లే తెలుగుదేశం కార్యాలయాన్ని తగలబెట్టుకొని మాపైన బురద చల్లుతున్నారు
  • రౌడీయిజం చేసి భయపెట్టాలనుకుంటే బెదిరిపోయే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరు. 
  • టీడీపీ ఆఫీసు తగలబెట్టడంపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి వెంటనే నిందితులను అరెస్ట్ చేయాలి

9:45 AM, April 08 2024
జనసేన తీరుపై బీజేపీ, టీడీపీ నేతలు ఫైర్‌

  • జనసేన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న బీజేపీ, టీడీపీ నేతలు సీరియస్‌
  • జనసేన ఫేస్ బుక్ ఫొటోల్లో కనిపించని టీడీపీ, బీజేపీ నేతల ఫొటోలు.
  • అనకాపల్లి వారాహి సభ నేపథ్యంలో పవన్, కొణతాల ఫొటోలకే పరిమితం.
  • మోదీ, చంద్రబాబు ఫొటో లేకపోవడంపై కూటమి నేతలు అసంతృప్తి.
  • ఇదే నా కూటమి ధర్మం అంటూ పవన్ తీరుపై ఆగ్రహం.
     

9:10 AM, April 08 2024
చంద్రబాబుపై మంత్రి అంబటి సెటైర్లు..

  • అవసరానికి కలిసి పనిచేసే పొలిటికల్‌ డాన్సర్లు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌. 
  • ఎన్నికల తర్వాత బాబు జైలుకైనా వెళ్తారు. 
  • లేదంటే టీడీపీని బీజేపీలో అయినా విలీనం చేస్తారు.

8:30 AM, April 08 2024
హామీలను గాలికొదిలిన వ్యక్తి చంద్రబాబు: ఎంపీ పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

  • ఇచ్చిన ప్రతీ వాగ్దానం నిలబెట్టుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ మాత్రమే. 
  • చంద్రబాబు 600 హామీలను గాలికి వదిలేశాడు.  
  • ఈ వ్యత్యాసాన్ని ప్రజలు  గమనించాలి. 
  • వెనకబడిన తరగతుల వారు న్యాయమూర్తులుగా పనికిరారని సుప్రీంకోర్టు న్యాయమూర్తికి చంద్రబాబు లెటర్ రాశాడు.
  • బీసీలపై చంద్రబాబుకు ఎందుకంత దురభిప్రాయమో చెప్పాలి. 
  • సీఎం జగన్ కులం చూడలేదు, మతం చూడలేదు ప్రజల వెనకాల ఉన్న పేదరికమే  చూశారు
  • మీరు కూడా సీఎం జగన్‌ హృదయాన్ని మాత్రమే చూడండి...
  • మండపేట నియోజకవర్గంలో ఒక్కసారి మార్పు తీసుకురండి.
  • వైఎస్సార్‌సీపీని గెలిపించండి. మంచి ఫలితాలు వస్తాయి
     

7:45 AM, April 08 2024
టీడీపీకి షాక్‌

  • పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్.
  • పోరంకి చెందిన 150 కుటుంబాలు వైఎస్సార్‌సీపీలో చేరిక.
  • మంత్రి జోగి రమేష్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న టీడీపీ నాయకులు.
  • పార్టీ కండువా కప్పి వైఎస్సార్‌సీపీలోకి సాదరంగా ఆహ్వానించిన జోగి రమేష్

7:15 AM, April 08 2024
నేడు మేమంతా సిద్ధం యాత్ర షెడ్యూల్‌ ఇలా..

  • సీఎం జగన్‌ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి  రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు
  • ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు
  • అనంతరం బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా  వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు
  • అనంతరం చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు
  • తరువాత కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం  రాత్రి బసకు చేరుకుంటారు

6:50 AM, April 08 2024
చంద్రబాబు, టీడీపీ నేతలపై ఈసీకి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు

  • కోడ్‌ ఉల్లంఘనపై నవరత్నాల వైస్ చైర్మన్ నారాయణ మూర్తి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు 
  • సీఎస్‌, డీజీపీపై టీడీపీ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం: నారాయణమూర్తి
  • అయ్యన్నపాత్రుడు దిగజారి మాట్లాడుతున్నారు
  • ప్రజాస్వామ్యం బద్దంగా ఉన్న వ్యక్తులపై ఈ తరహా వ్యాఖ్యలు సరికాదు
  • టీడీపీ నేతలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి మాట్లాడుతున్నారు:ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • 175 నియోజకవర్గాల్లో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై ఎప్పటికప్పుడు ఈసీకి ఫిర్యాదు చేస్తున్నాం
  • సుజనా చౌదరి, కేశినేని చిన్ని ఎన్నికల ప్రచారంలో డబ్బులు యథేచ్ఛగా పంచుతున్నారు.
  • ఓటర్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా ప్రజాసేవ చేయకుండా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.
  • టీడీపీ, బీజేపీ ప్రజల కోసం పాటుపడిన దాఖలాలు లేవు.
  • ప్రత్యేక హోదాను ప్యాకేజ్‌గా మార్చిన వ్యక్తులు టీడీపీ, బీజేపీ నాయకులే
  • అయ్యన్నపాత్రుడు భాష, వ్యవహార శైలి దారుణం
  • చీరలు పంచితే తప్పేంటి అనడం ఎంతవరకు కరెక్ట్‌.
  • డీజీపీని దుర్భాషలాడిన ఘటనపై ఈసీకి ఫిర్యాదు చేశాం
  • పెన్షన్ ఇవ్వకపోతే చస్తారా అంటూ టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారు.
  • టీడీపీ అధికారం కోసం చేసే ప్రయత్నాలను ప్రజలు గమనించాలి
  • చంద్రబాబు రాహుల్‌ని కలిసి, కాంగ్రెస్ తో తిరిగి ఇప్పుడు మమ్మల్ని పిల్ల కాంగ్రెస్ అని విమర్శిస్తున్నారు
  • ఐదేళ్లు అమరావతి జపం చేసిన మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఒడించారో ఆలోచించుకోవాలి.
  • మైనార్టీల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదు
  • వైఎస్సార్ మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చినపుడు కోర్టుకు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వ్యక్తి చంద్రబాబు
  • మతతత్వ శక్తులతో కలిసి పనిచేసే నువ్వు కూడా మైనార్టీల గురించి మాట్లాడతావా?
  • రైతులకు ఎవరి హయాంలో ఎంత మంచి జరిగిందో చర్చకు సిద్ధమా?
  • రుణమాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబుకు రైతుల గురించి మాట్లాడే హక్కు లేదు
  • టీడీపీ, జనసేనకు చెందిన నాయకులంతా జగన్ వెంట నడుస్తున్నారు
  • కూటమి కచ్చితంగా ఓటమి పాలు అవుతుంది


6:40 AM, April 08 2024
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు! 

  • పొత్తులో కమలానికి కేటాయించిన అనపర్తి సీటు విషయంలో చంద్రబాబు డ్రామా 
  • అక్కడ మొదట టీడీపీ అభ్యర్థిని ప్రకటించి ఆ తర్వాత బీజేపీకి కేటాయింపు 
  • అయినా.. బీజేపీ అభ్యర్థితో పోటాపోటీగా టీడీపీ అభ్యర్థి నల్లమిల్లి ప్రచారం 
  • రాజమండ్రి టీడీపీ పార్లమెంట్‌ సమావేశానికి సైతం ఆయనకు బాబు ఆహా్వనం 
  • ఆయనే అక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీచేస్తారంటూ టీడీపీ దొంగాట 
  • ఈ పరిణామాలను ఏమాత్రం పట్టించుకోని బీజేపీ రాష్ట్ర అధినేత్రి పురందేశ్వరి 
  • అక్కడ టీడీపీ అభ్యర్థి పోటీలో ఉంటేనే తనకు ప్రయోజనమనే ఆమె మౌనం? 
  • మొదట నుంచి పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతున్నా 
  • ఆమె పట్టించుకోకపోవడంపై శ్రేణుల్లో ఆగ్రహం  

6:35 AM, April 08 2024
ఊసరవెల్లి చంద్రబాబు.. కొత్త జిత్తులు..

  • వైఎస్‌ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోలేక కూటమిపేరుతో చంద్రబాబు ఎత్తుగడ 
  • షర్మిలను సీఎం జగన్‌పై ప్రయోగించిన కుటిలనేత 
  • దానివల్ల ఆశించిన ఫలితం లేక ఇప్పుడు సరికొత్త ప్రచారం 
  • వైఎస్సార్‌సీపీ వ్యతిరేక ఓట్లు చీల్చడానికే షర్మిల నాటకాలుఆడుతున్నట్టు ఆరోపణ 

6:30 AM, April 08 2024
కూటమిలో కత్తులు..

  • బాబు డీఎన్‌ఏ వెన్నుపోటును వంటబట్టించుకున్న నేతలు  
  • పోటీలో ఉన్న మిత్రపార్టీలకు వెనుక దెబ్బ  
  • సామాజిక న్యాయానికి పాతరేసిన పార్టీలు 
  • ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఆరు నియోజకవర్గాలు ఓసీలకే కేటాయింపు  
  • పోలవరంలో జనసేన అభ్యర్థికి చుక్కలు చూపిస్తున్న టీడీపీ శ్రేణులు  
  • ఉమ్మడి అనంతపురంలో సీనియర్లకు రాజకీయ సన్యాసం! 
  • తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థిని మార్చాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌ వర్గీయుల అల్టిమేటం   
  • పాలకొల్లు బాబు సభలో బన్నీవాసుకు అవమానం.. జనసైనికుల మండిపాటు  
  • గిద్దలూరులో రెబల్‌గా ఆమంచి స్వాములు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement