May 17th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | AP Elections 2024: May 17th Politics Latest News Updates In Telugu | Sakshi
Sakshi News home page

May 17th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Fri, May 17 2024 7:05 AM | Last Updated on Fri, May 17 2024 9:27 PM

AP Elections 2024: May 17th Politics Latest News Updates In Telugu

May 17th AP Elections 2024 News Political Updates

09:10 PM, May 17th, 2024
విజయవాడ:

ఎన్నికల  హింసపై సిట్ ఏర్పాటు

  • వినీత్ బ్రిజ్ లాల్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు
  • సిట్ బృందంలో 13 మంది అధికారులు
  • ఏసీబీ ఎస్పీ రమాదేవి, అడిషనల్ ఎస్పీ సౌమ్యలత నియామకం
  • ఏసీబీ డిఎస్పీ రమణమూర్తి, సిఐడి డిఎస్పీ శ్రీనివాసులు,  ఏసీబీ డిఎస్పీలు వి శ్రీనివాసరావు,  రవి మనోహర చారి నియామకం
  • ఇన్‌స్పెక్టర్లుభూషణం, వెంకటరావు, రామకృష్ణ, జి ఐ శ్రీనివాస్, మోయిన్‌, ఎన్ ప్రభాకర్, శివ ప్రసాద్‌లు సిట్ సభ్యులుగా నియామకం
  • పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో హింస పై దర్యాప్తు చేయనున్న సిట్
  • ఎన్నికల అనంతర హింస లో పోలీస్ అధికారులు పాత్ర పైన దర్యాప్తు చేయనున్న సిట్
  • రెండు రోజుల్లో సిట్ నివేదిక ఇవ్వాలని ఆదేశం
     

06:41 PM, May 17th, 2024

కృష్ణాజిల్లా

టీడీపీ నేత బోడే ప్రసాద్ పై కమ్మ కార్పొరేషన్ చైర్మన్ దేవభక్తుని చక్రవర్తి ఫైర్

  • కుల అహంకారంతో పోరంకిలో బోడె ప్రసాద్ దాడులకు తెగబడ్డాడు
  • టెన్త్ క్లాసులో వేరే వాళ్ళతో పరీక్షలు రాయించుకున్నాడు
  • కులాన్ని అడ్డుపెట్టుకుని చందాలు పోగు చేసుకున్న వ్యక్తి బోడె
  • పోలింగ్ రోజు గోడ దూకి దౌర్జన్యంగా పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించాడు
  • టీడీపీ రౌడీలు, గూండాలు దాడులకు పాల్పడుతున్నారు
  • వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులకు పాల్పడ్డాడు
  • కానూరులో నిరాశ్రయులైన వారికి సెంటు భూమి ఇవ్వలేకపోయావ్
  • గతంలో ఎన్టీఆర్ పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు
  • జగనన్న 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చరిత్ర సృష్టించారు
     

04:16 PM, May 17th, 2024

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే: : బొత్స

  • టార్గెట్‌ 175 దగ్గరకు వస్తాం
  • ఉత్తరాంధ్రలో 34కి 34 సీట్లు వైఎస్సార్‌సీపీ గెలుస్తుంది
  • తొందరపాటు నియమాకాల వల్లే హింసాత్మక ఘటనలు
  • ఎక్కడ అధికారులను మార్చారో అక్కడే హింసాత్మక ఘటనలు
  • హింసా ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం
  • రాజకీయ లబ్ధి కోసం హింసను ప్రేరేపించవద్దని అన్ని పార్టీలను కోరుతున్నాను
  • అధికారులను నియమించేటప్పుడు వాళ్ల పూర్వాపరాలు తెలుసుకోవాలి
  • రాజకీయ కక్షతో హింసను ప్రేరేపిస్తున్నారు
  • మాపై నిందలు వేయడం సరికాదు
  • హింసాకాండకు వైఎస్సార్‌సీపీ పూర్తి వ్యతిరేకం
  • ప్రతిపక్ష పార్టీలు కక్షపూరిత చర్యలకు పాల్పడితే చర్యలు తప్పవు
     

04:13 PM, May 17th, 2024

జనసేన డీలా.. నేతల్లో కనిపించని ఉత్సాహం

  • పోలింగ్ తర్వాత నేతలలో నిరుత్సాహం
  • పిఠాపురంలోనూ పవన్ గెలుపుపై అనుమానాలే....
  • జనసేనకి దెబ్బకొట్టిన క్రాస్ ఓటింగ్
  • ఎన్నికల తర్వాత పవన్ గప్ చుప్
  • పోలింగ్ తర్వాత ప్యాకప్ చెప్పేసిన పవన్
  • ఆదినుంచి పవన్ వైఖరే పార్టీకి కొంపముంచిందంటున్న నేతలు
  • టీడీపీ కోసం సీట్లు వదులుకోవడమే పార్టీకి చేటుచేసిందనే వ్యాఖ్యలు
  • కాపులు మినహా మిగిలిన సామాజిక వర్గాల ఓట్లని ఆకర్షించలేకపోయామని విశ్లేషణ
  • గోదావరి జిల్లాలలోనూ ఆశించిన ఫలితాలు కష్టమేనంటున్న నేతలు
  • కూటమి నుంచి అందని సహకారం
  • టీడీపీ ఓటు పూర్తిగా బదిలీ కాలేదనే అనుమానాలు

 

03:30 PM, May 17th, 2024

విజయవాడ

ఎన్నికల సమయంలో టీడీపీ అల్లర్లపై సిట్ ఏర్పాటుపై సీఎస్‌ కసరత్తు

  • ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను పరిశీలిస్తున్న ప్రభుత్వం
  • రవి ప్రకాష్, వినీత్ బ్రిజ్ లాల్, పిహెచ్‌డీ రామకృష్ణలలో ఒకరి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసే అవకాశం.
  • రెండు రోజుల్లోగా పల్నాడు, అనంతపురం, తిరుపతి అల్లర్ల పై నివేదిక ఇవ్వనున్న సిట్.
  • ఎన్నికల అనంతరం హింసలో భాగస్వామ్యం అయిన పోలీస్ అధికారులు, పోలీసుపైన నివేదిక ఇవ్వనున్న సిట్.

03:00 PM, May 17th, 2024

తాడేపల్లి :

కుట్ర ప్రకారమే అల్లర్లు జరిగాయి: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి  లేళ్ల అప్పిరెడ్డి

  • ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలలో పాల్గొనటం చంద్రబాబుకు ఇష్టం లేదు.
  • రౌడీయిజం చేసి, రిగ్గింగులు చేసి గెలుపొందాలనుకోవటం దారుణం.
  • అరాచకాలకు వత్తాసు పలికిన ఇద్దరు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు పడింది.
  • చంద్రబాబు ట్రాప్ లో పడి పోలీసు అధికారులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు.
  • తాడిపత్రిలో పెద్దారెడ్డి ఇంట్లో సీసీకెమెరాలను పోలీసులే పగలకొట్టటం దేనికి సంకేతం?
  • ఆధారాలు లేకుండా చేసే కుట్ర ఎవరు చేశారో తేలాలి.
  • నరసరావుపేటలో ఎమ్మెల్యే శ్రీనివాస రెడ్డి ఇంటిపై పట్టపగలే దాడి చేశారు.
  • అక్కడి పోలీసు అధికారుల ప్రోద్బలంతోనే ఈ దాడులు జరిగాయి.
  • టీడీపీకి మద్దతు ఇచ్చిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.
  • జూన్‌ 4న వైఎస్‌ జగన్ సునామీ వస్తుంది.
  • చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడటం లేదు?
  • వ్యవస్థలను మేనేజ్ చేసే కట్రలతో చంద్రబాబు బిజీగా ఉన్నారు.
  • పురంధేశ్వరి ఇచ్చిన లిస్టు ప్రకారం పోలీసు అధికారులను మార్చారు.
  • ఆ మార్చిన చోటే హింస చెలరేగిందంటే అర్థం ఏంటి?
  • ఒక కుట్ర ప్రకారమే ఈ అల్లర్లు జరిగాయి.

02:40 PM, May 17th, 2024

విజయవాడ:

విజయవాడ పోలీస్ కమిషనర్‌ను కలిసిన వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌

  • వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, జరుగుతున్న దాడులపై సీపీ రామకృష్ణకు వినతిపత్రం అందజేత
  • వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించిన సీపీ

    సీపీని కలిసిన అనంతరం  వైఎస్సార్‌సీపీ లీగ్‌ సెల్‌ నాయకులు మాట్లాడుతూ..
  • ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు పెరిగాయి
  • వైఎస్సార్‌సీపీ నేతల గొంతు నొక్కాలని చూస్తున్నారు
  • కొంత మంది అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు
  • కావాలనే బైండోవర్‌లు పెట్టి వేధిస్తున్నారు
  • నిన్న సీఎం విజయవాడ పర్యటన సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులను స్టేషన్‌కు పిలిపించి నిర్భదించారు
  • వైఎస్సార్‌సీపీ నాయకులను అకారణంగా నిర్భందించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలి
     


02:09 PM, May 17th, 2024
విశాఖ జిల్లా: ఎన్నికల ఫలితాలకు ముందే చేతులెత్తేసిన టీడీపీ

  • విశాఖ జిల్లాలో ఎన్నికల ఫలితాలపై గండి బాబ్జి జోస్యం

  • గండి బాబ్జి జోస్యంతో కంగుతిన్న టీడీపీ శ్రేణులు

  • విశాఖ జిల్లాలో పార్టీ ఓడిపోతుంది

  • బీజేపీ పోటీ చేసిన విశాఖ నార్త్ నియోజక వర్గ ఫలితంపై నాకు డౌట్ ఉంది

  • గెలుపుపై అనుమానం వ్యక్తం చేసిన గండి బాబ్జి

  • జిల్లా పార్టీ అధ్యక్షుడే పార్టీ ఓడిపోతుందని మాట్లాడటంపై టీడీపీ శ్రేణుల్లో ఆందోళన

01:53 PM, May 17th, 2024
మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం: సజ్జల రామకృష్ణారెడ్డి

  • సాంప్రదాయ ఓటు బ్యాంక్ మావైపు ఉంది
  • మాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఓవర్ కాన్ఫిడెన్స్ లేదు
  • ప్రజలు ఓటింగ్ లో పాల్గొన్న  తీరు చూస్తుంటే  మళ్ళీ విజయం సాధిస్తాం
  • పొలింగ్ పర్సంటేజ్ పెరిగితే మేము ఓడిపోతామన్న భ్రమలో టీడీపీ ఉంది
  • మాపై వ్యతిరేకత ఉన్న వర్గాలు ఎక్కడా లేవు
  • ప్రజలు నమ్మటం లేదని చంద్రబాబు సుపర్ సిక్స్ గురించి ప్రచారం చేసుకోలేదు
  • వివేకా హత్య, ల్యాండ్ టైట్లింగ్ గురించి తప్ప తాను చేసే మంచి గురించి ఎక్కడైనా చెప్పాడా?
  • సీఎం జగన్‌ చేసిన అభివృద్ది సంక్షేమం అభివృద్ధి చూసి ఓటు వేయాలని అడిగారు  
  • నన్ను చూసి నేను చేసిన మంచి చూసే ఓటు వేయాలని జగన్ అడిగారు
  • టీడీపీ గెలవడానికి ఉన్న ఒక్క కారణమైనా చెప్పగలరా?
  • చంద్రబాబు కూడా ఎన్నికల్లో విజయం సాధిస్తామని చెప్పలేక పోతున్నారు
  • టీడీపీ కూటమి వలనే పోలింగ్ లో హింస జరిగింది
  • వారు చెప్పిన అధికారులే హింసకు  కారణమయ్యారు
  • ఇప్పుడు వాళ్ళనే  ఈసీ తొలగించి చర్యలు తీసుకుంది
  • ఇంకా తొలగించాల్సిన వాళ్ళు కొందు ఉన్నారు
  • పోలింగ్‌కు ముందు అడ్డగోలుగా అధికారుల బదిలీ చేశారు
  • అల్లర్లు జరిగాయి అంటే ఈసీ విఫలం అయ్యినట్లేవీటి వెనుక చంద్రబాబు పాత్ర ఉన్నట్లే
  • ఈ-ఆఫీసు అప్ గ్రేడ్ చేస్తుంటే గవర్నర్ కు లేఖలు రాస్తున్నారు
  • రికార్డులు మాయం అవుతున్నాయని పిచ్చి పిచ్చి లేఖలు రాస్తున్నారు
  • తాడిపత్రిలో పెద్ధారెడ్డి ఇంట్లో పోలీసులే సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు
  • ల్యాండ్ టైట్లింగ్ గురించి ఎన్నికల తరువాత టీడీపీ ఎందుకు మాట్లాడటం మానేసింది?
  • ల్యాండ్ టైటలింగ్ అమలు చేయాలని నీతి అయోగ్ చెప్పింది
  • కౌంటింగ్ ప్రక్రియ  సజావుగా సాగాలంటే పోలీసు అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి
  • టీడీపీ కొంతమంది పోలీసులను తమ ఏజెంట్లుగా మార్చుకుంది
  • ప్రశాంతంగా కౌంటింగ్ జరగాలని కోరుకుంటున్నాం
  • ఎన్నికల కమిషన్ బాధ్యతాయుతంగా ఉంటే ఇంత విద్వంసం అల్లర్లు జరిగేవి కావు
  • ఒక వర్గానికి కొమ్ము కాస్తున్న వారిని పక్కన పెట్టాలని ఎన్నికల కమిషన్ ను కోరుతున్నాం
  • కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు అన్ని ప్రాంతాల్లోనూ గెలుస్తాం
  • జగన్ పాలనలో లబ్ధి పొందని వర్గాలు, న్యాయం జరగని కుటుంబం అంటూ ఏమీ లేవు
  • అందరికీ మేలు చేసినందునే భారీ సీట్లతో గెలవబోతున్నాం

11:25 AM, May 17th, 2024
విజయనగరం పోస్టల్‌ బ్యాలెట్‌ స్ట్రాంగ్‌ రూమ్‌ వద్ద హైడ్రామా

  • ఆందోళనకు దిగిన టీడీపీ, ఇండిపెండింట్‌ అభ్యర్థులు
  • జాయింట్‌ కలెక్టర్‌ కార్తీక్‌పై ఈసీకి టీడీపీ కార్యకర్తల ఫిర్యాదు
  • అభ్యర్థుల ఏజెంట్‌లు లేకుండా తెరిచారని టీడీపీ అభియోగం
  • అభ్యర్థులకు ఫోన్‌లో సమాచారం  ఇచ్చామన్న జేసీ
  • వీడియోగ్రఫీ, సీసీ కెమెరాలు పోలీసుల సమక్షంలో తీశాం

11:14 AM, May 17th, 2024
తాడిపత్రిలో టీడీపీ దాడులను ఖండించిన వైఎస్సార్‌సీపీ నేతలు

  • తాడిపత్రిలో అల్లర్లను నియంత్రించడంలో పోలీసులు విఫలం
  • జేసీ అనుచరులు దాడులు చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు
  • వైఎస్సార్‌సీ శ్రేణులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు
  • వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు.
  • ఎన్నికల కమిషన్‌ ఎన్డీఏ కమిషన్‌గా మారిపోయింది.
  • ఎస్పీ అమిత్‌, ఏఎస్పీ రామకృష్ణ ఏకపక్షంగా వ్యవహరించారు
  • పోలీసుల సహకారంతోనే వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులు
  • రౌడీషీటర్లను టీడీపీ పోలింగ్‌ ఏజెంట్లుగా పెట్టారు
  • ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు దౌర్జన్యం చేయడం దారుణం
  • తాడిపత్రిలో ఘటనలకు పోలీసులే బాధ్యత వహించాలి
  • ఏఎస్పీ రామకృష్ణను కూడా సస్పెండ్‌ చేయాలి
     

10: 37 AM, May 17th, 2024
చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు

  • ఏలూరు జిల్లా
  • దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై కేసు నమోదు
  • హత్యాయత్నం కేసులో ముద్దాయిని పెదవేగి పోలీస్ స్టేషన్ నుండి దౌర్జన్యంగా తీసుకువెళ్లిన చింతమనేని
  • అధికారుల విధులకు ఆటంకం కలిగించడం, స్టేషన్‌లో దౌర్జన్యం చేయడంపై 224, 225, 353,143 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు

8: 04 AM, May 17th, 2024
సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలతో వైసీపిలో ఫుల్ జోష్

  • 150 కిపైగా సీట్లలో గెలుపు ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన జగన్
  • మరోసారి చరిత్ర సృష్టించబోతున్నామన్న జగన్
  • దేశమంతా మనవైపే చూస్తుందని వ్యాఖ్యలు
  • గత 59 నెలలుగా చేసిన సుపరిపాలనతో జనం  జగన్ కే అండగా నిలిచారంటున్న విశ్లేషకులు
  • చంద్రబాబు కూటమి కుట్రలకు ప్రజలు ఛీకొట్టారన్న చర్చ
  • ఈసారి మరింత మేలు చేసేలా పాలన సాగించే దిశగా సీఎం అడుగులు

8: 01 AM, May 17th, 2024
వెల్లివిరిసిన మహిళా చైతన్యం

  • ఏపీలో పురుషులకంటే ఓట్లు వేసిన మహిళల సంఖ్య 4.78 లక్షలు అధికం
  • పోస్టల్‌ బ్యాలెట్‌తో కలిపి మొత్తం పోలింగ్‌ శాతం 81.86 శాతం
  • అసెంబ్లీకి అత్యధికంగా దర్శిలో 90.91 శాతం.. అత్యల్పంగా తిరుపతిలో 63.62 శాతం
  • లోక్‌సభకు అత్యధికంగా ఒంగోలులో 87.06 శాతం.. విశాఖలో 71.11 శాతం ఓట్లు
  • దేశంలో ఇప్పటివరకు జరిగిన 4 దశల ఎన్నికల్లో అత్యధిక పోలింగ్‌ రాష్ట్రంలోనే
  • ఎన్నికల్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని త్వరలోనే అరెస్ట్‌ చేస్తాం
  • 33 చోట్ల 350 స్ట్రాంగ్‌ రూముల్లో మూడంచెల భధ్రత నడుమ ఈవీఎంలు
  • హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రెండు రోజుల్లో అరెస్ట్‌ చేస్తాం
  • ఎన్నికల తర్వాత జరిగిన హింస అదుపులోకి వచ్చింది
  • హింసాత్మక ఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు
  • 715 పోలీస్‌ పికెట్స్‌తో గొడవలను అదుపులోకి తెచ్చాం
  • రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా

7: 07 AM, May 17th, 2024
టీడీపీ చెప్పినట్లు ఆడినందుకే

  • ప్రజాస్వామ్య ప్రక్రియకు పాతరేసిన ఫలితం..
  • విధి నిర్వహణలో అలసత్వమే ఈసీ వేటుకు కారణం
  • రాజకీయ ఒత్తిళ్లతో పోలీస్‌ అధికారుల బదిలీ.. పురందేశ్వరి జాబితా ప్రకారం నియామకాలు
  • ఆ ప్రాంతాల్లోనే హింసాత్మక ఘటనలు 

7: 03 AM, May 17th, 2024
నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!

  • నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హత్యకు వ్యూహం
  • టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబు ఇల్లు కేంద్రంగా కుట్ర
  • గోపిరెడ్డి దొరక్కపోవడంతో ఆయన మామపై హత్యాయత్నం
  • అనంతరం అరవింద్‌బాబు హౌస్‌ అరెస్ట్‌
  • పోలీసుల తనిఖీలో మారణాయుధాలు, పెట్రోల్‌ బాంబులు లభ్యం.. పోలింగ్‌కు ముందే పథకం ప్రకారం సమకూర్చుకున్న వైనం
  • మారణాయుధాలకు సంబంధించి కేసు నమోదు చేయని పోలీసులు.. పల్నాడులో హత్యా రాజకీయాలనే నమ్ముకున్న టీడీపీ

7: 02 AM, May 17th, 2024
పాలన బాగుంటే పోలింగ్‌ పెరుగుతుంది

  • ఇది రాజకీయ విశ్లేషకుల మాట.. మాట నెరవేర్చిన ప్రభుత్వాలను మళ్లీ ఎన్నుకుంటారు..
  • పోలింగ్‌ శాతం పెరగడం ప్రభుత్వంపై వ్యతిరేకతకు నిదర్శనమనే ప్రచారం అవాస్తవం
  • 2004లో 69.8 శాతం పోలింగ్‌తో వైఎస్సార్‌కు అధికార పగ్గాలు.. 2009లో 72.7% పోలింగ్‌తో మళ్లీ సీఎంగా వైఎస్సార్‌
  • తెలంగాణలో 2014లో 69.5 శాతం పోలింగ్‌తో అధికారంలోకి టీఆర్‌ఎస్‌
  • 2018లో 73.2 శాతం పోలింగ్‌తో మరోసారి సీఎంగా కేసీఆర్‌
  • ఇప్పుడు ఏపీలోనూ అదే ట్రెండ్‌.. మరిన్ని సీట్లతో సీఎంగా మళ్లీ వైఎస్‌ జగన్‌

6: 50 AM, May 17th, 2024
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం

  • పోలింగ్‌ సరళిపై తొలిసారిగా స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌
  • 2019కి మించి 2024లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం
  • జూన్‌ 4న ఘన విజయంతో దేశం మొత్తం మన వైపే చూస్తుంది
  • 59 నెలలుగా ప్రజలకు మంచి చేశాం.. వచ్చే ఐదేళ్లు మరింత మేలు చేద్దాం
  • విజయవాడలో ఐ–ప్యాక్‌ ప్రతినిధులతో సమావేశం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement