
నచ్చావులే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ మాధవి లత. 2008లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత మాధవి స్నేహితుడా, అరవింద్-2 చిత్రాల్లో నటించింది. అంతే కాకుండా మహేష్ బాబు కథానాయకునిగా విడుదలైన అతిథిలో హీరోయిన్ స్నేహితురాలిగా మొట్టమొదటిసారి కనిపించింది. అయితే తాజాగా ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఒక వ్యక్తితో డేటింగ్‌లో ఉన్నట్లు ఇన్‌స్టాలో ఓ వీడియో షేర్ చేసింది. ఆ వీడియోలో తాను ఓ వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నానని వెల్లడించింది.
మాధవిలత వీడీయోలో మాట్లాడుతూ..' నేను ఒక వ్యక్తిని కలిశా. ముందు అతడిని అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత రెండువైపుల తల్లిదండ్రుల అనుమతి పొందాలి. ఇది అంత త్వరగా జరిగే పని కాదు. మరో ఏడాది సమయం పట్టొచ్చు. అతడిని పెళ్లి చేసుకుంటానో లేదో మీకు తప్పకుండా చెబుతా. అయితే పెళ్లి తేదీ గురించి మాత్రం అడగొద్దు. అయితే అసలు అతడు తెలుగువ్యక్తి అయితే కాదు. నేను నా నమ్మకాలను గౌరవించే వ్యక్తినే పెళ్లి చేసుకుంటా. ఆ విషయంలో మాత్రం తగ్గేదేలే' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. 2018లో రాజకీయాల్లో ప్రవేశించింది. బీజేపీలో చేరిన ఆమె గత ఎన్నికల్లో పోటీ కూడా చేసింది.
Comments
Please login to add a commentAdd a comment