
అభిమానులతో సెల్ఫీ, హీరోయిన్స్ ఎస్తేర్ నూర్హన్, మాధవీలత
(గుంటూరు): నగరంలో సినీ తారలు సందడి చేశారు. సోమవారం స్థానిక లాలాపేట వెంకటేశ్వరస్వామి గుడిరోడ్‌లోని శరణంస్ ఫ్యామిలీ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరోయిన్స్ ఎస్తేర్ నూర్హన్ (జయ జానకి నాయక ఫేమ్ ), మాధవీలత ( నచ్చావులే ఫేమ్) విచ్చేశారు.
రాజకీయ నాయకులతో కలసి జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాల్ నిర్వాహకులు శరణం శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్, మోదుగుల వేణుగోపాలరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలారి రోశయ్య, రాయపాటి రంగారావు, మాల్ నిర్వాహకులు కోలా అశోక్‌కుమార్, చీతిరావు పుల్లారావు, అచ్చుత వేణుబాబు, దామోదర చంద్రశేఖర్, కావేటి శివ పాల్గొన్నారు.