
సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్ని కల్లో హైదరాబాద్ బీజేపీ అభ్య ర్థిగా పోటీ చేస్తున్న మాధవీల తకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. తాజాగా ఓ టీవీలో నిర్వహించే ఆప్‌కీ అదాలత్ కార్యక్రమంలో మాధవీలత పాల్గొ న్నారు. ఈ కార్యక్రమంలో వ్యాఖ్యాత రజత్‌శర్మ ప్రశ్నలకు మాధవీలత ఇచ్చిన సమాధానాలు అసాధరణమైనవని, చాలా దృఢమైన అంశాలు ప్రస్తావించారని, తర్కంతో మాట్లాడారని ప్రధాని ప్రశంసించారు. ఈ కార్య క్రమాన్ని అందరూ వీక్షించాలంటూ ప్రధాని మోదీ ఆదివారం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కార్యక్రమంలో భాగంగా ఇటీవల మేడ్చల్ జిల్లా చెంగిచర్లలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలు.. ఒకప్పుడు సంతోష్‌నగర్‌లో తన ఇల్లు వర్షపు నీటిలో మునిగిపోయిన ఘటన వరకు పలు అంశాలను మాధవీలత గుర్తుచేసుకున్నారు. తన చిన్నతనంలో హైదరాబా ద్‌లో మత ఘర్షణలు ఎంత భయానక వాతావ రణం సృష్టించేవో తెలిపారు. మత ఘర్షణలకు, రాజకీయ కక్షలకు పెద్దగా తేడాలేదన్నారు. హైదరా బాద్ నగరం లక్షలాది మందికి ఐటీలో ఉపాధి కల్పిస్తున్నప్పటికీ నియోజకవర్గ ప్రజల భాగస్వా మ్యం ఒకశాతం కూడా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.