updates...
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం
- 13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.
- బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.
- బీఆర్‌ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.
- బీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
- కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యం
- కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్
- బీజేపీ 22887 ఓట్లు
- బీఆర్‌ఎస్-21489 ఓట్లు
కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..
- కాంగ్రెస్- శ్రీగణేష్ -18140
- బీఆర్‌ఎస్-నివేదిత- 11739
- బీజేపీ-వంశీ తిలక్-9160
కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు.
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలు
- మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీ
- కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995
- టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140
- బిజెపి అభ్యర్థి తిలక్ 2666
- సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నిక
కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్‌ఎస్
కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్‌కి గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Comments
Please login to add a commentAdd a comment