Secunderabad Cantonment
-
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం
updates... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్బీజేపీ 22887 ఓట్లుబీఆర్ఎస్-21489 ఓట్లు కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..కాంగ్రెస్- శ్రీగణేష్ -18140బీఆర్ఎస్-నివేదిత- 11739బీజేపీ-వంశీ తిలక్-9160కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలుమొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140 బిజెపి అభ్యర్థి తిలక్ 2666 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నికకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్ఎస్కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్‌కి గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
ఆ రెండూ ప్రతిష్టాత్మకమే
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఉపఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికలతోపాటే సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి, ఆ తర్వాత ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల స్థానానికి కూడా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండూ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కావడంతో వాటిని తిరిగి గెలుచుకోవడంపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత మరణంతో కంటోన్మెంట్‌కు ఉపఎన్నిక రాగా, ఈ నెల 13న జరిగే లోక్‌సభ పోలింగ్తోపాటు ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా పోలింగ్ జరగనుంది. మరోవైపు ‘వరంగల్– ఖమ్మం– నల్లగొండ’ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా ఉన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో పల్లా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీగా పల్లా పదవీకాలం 2027 ఏప్రిల్‌లో ముగియనుంది. తాజాగా ఎన్నికల కమిషన్ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణ, ఈ నెల 27న పోలింగ్ జరుగుతుంది.లాస్య నందిత సోదరి కోసం.. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్లో తమ అభ్యర్థి నివేదిత గెలుపు కోసం బీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డికి ప్రచార సమన్వయ బాధ్యతలు అప్పగించగా, పార్టీ నేత రావుల శ్రీధర్‌రెడ్డి నియోజకవర్గ ప్రచార ఇన్చార్జ్గా పనిచేస్తున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు మల్కాజిగిరి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఎనిమిది వార్డులు, జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక డివిజన్ వారీగా ప్రచార బాధ్యతలు పంచుకొని పనిచేస్తున్నారు.అయితే ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ ఆశించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర ఆశావహులు గజ్జెల నాగేశ్ కేసీఆర్ బస్సు యాత్రలో ఉండగా, ఎర్రోⶠ్ల శ్రీనివాస్ సంగారెడ్డి ప్రచార సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. నివేదిత తరపున సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులు ప్రచారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే కొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రచారంపై ఆ ప్రభావం పడకుండా చూడాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలతో రెండు రోజుల క్రితం ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. మరోవైపు ఇప్పటికే నియోజకవర్గంలో రోడ్‌షోల్లో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచార సరళిని పర్యవేక్షిస్తున్నారు.నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్శాసనమండలి ఆరంభం నుంచి బీ ఆర్ఎస్ అభ్యర్థులే ‘వరంగల్– ఖమ్మం–నల్లగొండ’ పట్టభద్రుల స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఈ నేప థ్యంలో ప్రస్తుతం ఈ స్థానానికి జరుగు తున్న ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్‌రెడ్డి పేరును అధినేత కేసీఆర్ రెండు రోజుల క్రితం ఖరారు చేశారు. రాకేశ్ రెడ్డి మంగళ వారం నల్ల గొండ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేస్తారు. బీఆర్ ఎస్ టికెట్ పార్టీ నేతలు ఓ.నర్సింహారెడ్డి, డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, సుందర్ రాజు తదితరులు ఆశించారు. అయినా అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన రాకేశ్ రెడ్డికి టికెట్ దక్కింది. ఇక్కడ గెలుపును బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని సమ న్వయంతో పనిచేయడం ద్వారా ప్రచారంలో పైచేయి సాధించాలని భావి స్తోంది. దీంతో ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న పార్టీ అధి నేత కేసీఆర్ ఈ నెల 12న లేదా 14న మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇన్‌చార్జ్‌లు, ఇతర ముఖ్యనేతలతో తెలంగాణభవన్‌లో భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
రయ్ రయ్‌మనేలా
కంటోన్మెంట్: ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాజధాని నగరం హైదరాబాద్ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది. కారిడార్ నిర్మాణం ఇలా రాజీవ్ రహదారిపై నిర్మించనున్న కారిడార్ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్ సమీపంలోని ప్యా ట్నీ సెంటర్ నుంచి మొదలై కార్ఖానా, తిరు మలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్ సమీపంలోని ఓఆర్ ఆర్ జంక్షన్ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్ కారిడార్ 11.12 కిలోమీటర్లు ఉంటుంది. అండర్ గ్రౌండ్ టన్నెల్ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్ వద్ద), అల్వాల్ వద్ద (0.310 కిలోమీటర్ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో.. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్ కార్ యూనిట్ పర్ డే –పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్ఆర్ జంక్షన్ సమీపంలో 35,825గా ఉంది. ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మా ర్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలి పోతున్నారు. సమయం హరించుకుపోవడంతో పా టు ఇంధన వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో సమయం కలి సిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ బాధలు తొలగిపోతాయి. ముఖ్యాంశాలు... ♦ మొత్తం కారిడార్ పొడవు: 18.10 కి.మీ. ♦ ఎలివేటెడ్ కారిడార్ పొడవు: 11.12 కి.మీ. ♦ అండర్‌గ్రౌండ్ టన్నెల్: 0.3 కి.మీ. ♦ పియర్స్: 287 ♦ అవసరమైన భూమి: 197.20 ఎకరాలు ♦ రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు ♦ ప్రైవేట్ ల్యాండ్: 83.72 ఎకరాలు ♦ ప్రాజెక్టు వ్యయం: రూ.2,232 కోట్లు ఇవీ ప్రయోజనాలు ♦ రాజీవ్ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్ వైపు జిల్లాల ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు చెల్లు ♦ కరీంనగర్ వైపు మెరుగైన ప్రయాణం ♦ ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గనున్న వ్యయం ♦ సికింద్రాబాద్ నుంచి ట్రాఫిక్ ఆటంకాలు లేకుండా ఓఆర్ఆర్ వరకు చేరుకునే అవకాశం ♦ మేడ్చల్–మల్కాజిగిరి–సిద్దిపేట–కరీంనగర్–పెద్దపల్లి–మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలు లబ్ధిపొందనున్నారు. -
కంటోన్మెంట్ల విలీనంపై ముందుకే..
హైదరాబాద్: కంటోన్మెంట్లను సమీప మున్సిపాలిటీల్లో విలీనం దిశగా మంగళవారం కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీ విలీనం చేసేందుకు ఉద్దేశించి కమిటీ ఏర్పాటు చేయగా, తాజాగా దేశ వ్యాప్తంగా పలు కంటోన్మెంట్ల విలీనం కోసం కేంద్రం వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేసింది. దీంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతం జీహెచ్ఎంసీలో విలీనంపై సందిగ్ధతకు తెరపడింది. కేంద్రం వీలైనంత త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, డేహూ రోడ్, దేవ్లాలీ, ఉత్తరప్రదేశ్‌లోని బబినీ, ఫతేఘర్, మధుర, షాజహాన్‌పూర్, రాజస్థాన్ అజ్మీర్, నసీరాబాద్, మధ్యప్రదేశ్‌లోని మోరార్, ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, డెహ్రాడూన్, క్లెమెంట్ టౌన్, రూర్కీ కంటోన్మెంట్లను సమీప మున్సిపాలటీల్లో విలీనం చేసేందుకు కమిటీలు ఏర్పాటు చేస్తూ రక్షణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంబంధిత కమిటీలు రెండు నెలల్లో నివేదిక సమర్పించాలని సూచించారు. సికింద్రాబాద్‌కు సంబంధించి ఏర్పాటైన కమిటీ ఫిబ్రవరిలోనే కేంద్రానికి నివేదిక సమర్పించింది. తదనంతరం దేశ వ్యాప్తంగా 56 కంటోన్మెంట్లలో ఎన్నికల కోసం నోటిఫికేషన్ జారీ చేసినప్పటికీ, కేంద్రం అర్ధంతరంగా ఉత్తర్వులను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. నాటి నుంచి కంటోన్మెంట్ల భవితవ్యంపై పలు ఊహాగానాలు వెలువడగా, తాజా ఉత్తర్వులతో విలీనం దిశగానే కేంద్రం ముందుకెళ్తోందని తెలుస్తోంది. -
ఎమ్మెల్యే సాయన్న భౌతికకాయాన్ని చూసి బోరుమన్న కుటుంబ సభ్యులు (ఫొటోలు)
-
కంటోన్మెంట్ విలీనంపై కమిటీ
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతిపాదన దశలోనే ఉన్న ప్రతిపాదన విధి, విధానాల రూపకల్పనకు ఎనిమిది మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. నెల రోజుల్లోగా ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విలీన ప్రక్రియ కొనసాగనుంది. రక్షణ శాఖ జాయింట్ సెక్రెటరీ, అడిషనల్ పైనాన్షియల్ అడ్వైజర్ చైర్మన్‌గా ఏర్పాటైన ఈ కమిటీకి సభ్య కార్యదర్శిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ వ్యవహరించనున్నారు. వీరిద్దరితో పాటు కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ సోమశంకర్, రక్షణ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ సెక్రెటరీ, డిఫెన్స్ ఎస్టేట్స్ అడిషనల్ డీజీ, ఆర్మీ హెడ్ క్వార్టర్స్ అడిషనల్ డీజీ, డిఫెన్స్ ఎస్టేట్స్ సదరన్ కమాండ్ డైరెక్టర్లు సభ్యులుగా ఉంటారు. ఫిబ్రవరి 4వ తేదీలోపు ఈ కమిటీ తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఎంఓడీ ప్రతిపాదనకు అనుగుణంగా.. కంటోన్మెంట్ పరిధిలోని సివిల్ ఏరియాలను ఆర్మీ నుంచి విడదీసి సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేసుకోవాల్సిందిగా కోరుతూ గతేడాది మే 23న రక్షణ మంత్రిత్వ శాఖకు ఆర్మీ ప్రతిపాదన పంపింది. తదనుగుణంగా రక్షణ శాఖ తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరగా, సివిల్ ఏరియాలను తమ పరిధిలోనికి తీసుకునేందుకు తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ తన అంగీకారం తెలుపుతూ గత నెల 14న లేఖ రాసింది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. 9న తొలి సమావేశం విలీనంపై ఏర్పాటైన కమిటీ తొలి సమావేశం ఈ నెల9న వీడియో కాన్ఫరెన్స్ పద్ధతిలో జరగనుంది. కంటోన్మెంట్ పరిధిలోని భూములు, స్థిర, చరాస్థులు, ఉద్యోగులు, పెన్షనర్లు, కంటోన్మెంట్ నిధులు, పౌర సేవలు, రోడ్లు, ట్రాఫిక్, రికార్డులు, స్టోర్ తదితర అన్ని రకాల బదలాయింపుపై రోడ్‌మ్యాప్ రూపొందించనుంది. కమిటీ తొలి భేటీకి ముందే రక్షణ మంత్రిత్వ శాఖ ఓ కీలక ఆదేశాన్ని కమిటీ ముందు ఉంచనున్నట్లు తెలిసింది. ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు? మిలటరీ శిక్షణ కేంద్రాలు, కార్యాలయాలు, స్థలాలకు 500 మీటర్ల పరిధిలో నిర్మాణాలకు సంబంధించి ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి జీహెచ్ఎంసీ పరిధిలోని నిర్మాణాల విషయంలో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు. కంటోన్మెంట్లో మాత్రం మినహాయింపు ఉంది. తాజాగా కంటోన్మెంట్‌లోని సివిలియన్ ప్రాంతాలను జీహెచ్ఎంసీలో కలపనుండటంతో 500 మీటర్ల నిబంధనను ఇక్కడ కూడా అమలు చేస్తామంటూ ఆర్మీ ముందస్తుగానే ప్రకటించింది. దీనికి తోడు ఆర్మీ స్థావరాలకు 100 మీటర్ల పరిధిలో ఎలాంటి నిర్మాణాలను అనుమతించబోమని కూడా ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాల్లో ఇప్పటికంటే కూడా కఠినమైన నిబంధనలు అమలయ్యే అవకాశముంది. వికాస్ మంచ్ హర్షం.. బాణసంచా కాల్చి సంబురాలు కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రక్రియలో భాగంగా కేంద్ర రక్షణ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం పట్ల కంటోన్మెంట్ వికాస్ మంచ్ (సీవీఎం) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు సీవీఎం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గడ్డం ఏబెల్, సంకి రవీందర్ ఆధ్వర్యంలో పికెట్ చౌరస్తాలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సీవీఎం సభ్యులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
కంటోన్మెంట్ విలీనంపై.. తేలేదెప్పుడు?
సాక్షి, హైదరాబాద్: ఆర్మీ నియంత్రణలో ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని జనావాసాల ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే అంశం ముందుకు కదలడం లేదు. ఏళ్లుగా ఈ డిమాండ్‌ను తిరస్కరిస్తూ వచ్చిన కేంద్ర రక్షణ శాఖ.. ఇటీవల దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా అడుగు ముందు కుపడట్లేదు. కంటోన్మెంట్ వల్ల ఎన్నో ఇబ్బందు లు వస్తున్నాయని, ఆ ప్రాంతాలను విలీనం చే యాలని చాలాసార్లు కోరిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఇప్పుడు దీనిపై స్పందించడం లేదన్న వి మర్శలున్నాయి. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే తమ సమస్యలు తప్పుతాయని కంటోన్మెంట్ ప్రాంత ప్రజలు పేర్కొంటున్నారు. చాలా ఏళ్లుగా డిమాండ్ నిజాం పాలన సమయంలో బ్రిటిష్ సైనిక స్థావ రంగా ఉన్న కంటోన్మెంట్ ప్రాంతం.. ఆ తర్వా త కూడా రాష్ట్రంలో పూర్తి అంతర్భాగంగా మారలేదు. పాక్షికంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అజ మాయిషీలో ఉంటూ.. స్వయం ప్రతిపత్తి హోదాలో డీమ్డ్ మున్సిపాలిటీగా కొనసాగుతోంది. కంటోన్మెంట్ పరిధిలో ఉంటున్న ప్రజ లు పలు అంశాల్లో ఇబ్బందిపడాల్సి వచ్చింది. ఈ క్రమంలో కంటోన్మెంట్‌లోని పౌరుల నివాస ప్రాంతాలను హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కలపాలనే ప్రతిపాదన 1999లోనే తెరపైకి వచ్చింది. దీనిపై అప్పటి సర్కారు కేంద్రానికి లేఖ రాసింది. దానిపై స్పందించిన కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ బోర్డును సంప్రదించి తీర్మానించడం ద్వారా విలీన ప్రక్రియ చేపట్టవచ్చని సూచించింది. నాడు కంటోన్మెంట్ బోర్డు సభ్యులు తిరస్కరించడంతో విలీన ప్రతిపాదనకు చుక్కెదురైంది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత కంటోన్మెంట్‌లోని జనావాస ప్రాంతాలను తమ పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభు త్వం మళ్లీ ఒత్తిడి తెచ్చింది. రహదారులు, వంతెనల నిర్మాణం, విస్తరణకు కంటోన్మెంట్ బో ర్డు అడ్డుపడుతోందని, అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని మంత్రి కేటీఆర్ కూడా పలు సందర్భాల్లో విమర్శించారు. మరోవైపు కంటోన్మెంట్లపై కేంద్రం ఏర్పాటు చేసిన సుమిత్ బోస్ కమిటీ.. పరిపాలనా సంస్కరణ ల కోసం పౌర నివాస ప్రాంతాలను కంటోన్మెంట్ల నుంచి వేరు చేయాలని సూచించింది. దాన్ని పరిగణనలోకి తీసుకున్న రక్షణశాఖ.. దేశవ్యాప్తంగా ఉన్న 62 కంటోన్మెంట్లలోని జనావాసాలను సమీప స్థానిక సంస్థల్లో విలీనం చేసేందుకు సిద్ధమైంది. గత మేలో రాష్ట్రాలకు లేఖలు పంపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పందించలేదు.రాష్ట్రప్రభుత్వం స్పందిస్తే బోర్డు రద్ద యి పౌర నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీలో విలీనమవుతాయని అధికారులు అంటున్నారు. దేశంలోనే అతి పెద్దదిగా.. 1798లో నిజాం నవాబు, ఈస్టిండియా కంపెనీ మధ్య జరిగిన ఒప్పందం మేరకు.. హుస్సేన్ సాగర్‌కు తూర్పున ఉన్న 13 గ్రామాలను బ్రిటిషర్లకు అప్పగించారు. అందులో ఈస్టిండియా కంపెనీ సైన్యాలతో కంటోన్మెంట్ ఏర్పాటు చేసుకుంది. 1806లో ఆ ప్రాంతానికి సికింద్రాబాద్‌గా పేరు పెట్టారు. 1945లో కంటోన్మెంట్‌లోని పలు ప్రాంతాలను వేరుచేసి సికింద్రాబాద్ మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. 1995లో అది హైదరాబాద్ మున్సిపాలిటీలో విలీనమైంది. కంటోన్మెంట్ మాత్రం య«థాతథంగా కొనసాగుతోంది. దేశంలో ఉన్న 62 కంటోన్మెంట్లలో 2.18 లక్షల జనాభాతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ దేశంలోనే అతిపెద్దది కావడం గమనార్హం. దీని పరిధిలో 400కుపైగా కాలనీలు, బస్తీలు ఉన్నాయి. డీమ్డ్ మున్సిపాలిటీగా ఉన్న కంటోన్మెంట్లో నిధులు సరిగా లేక అభివృద్ధి పనులు సరిగా జరగలేదని స్థానికులు పేర్కొంటున్నారు. ఆర్మీ ఆంక్షల కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. విలీనమైతే సమస్యలు తీరుతాయి కంటోన్మెంట్లో ఇప్పటికీ బ్రిటిష్‌కాలం నాటి చట్టాల ఆధారంగానే పాలన జరుగుతోంది. జనాభా అవసరాలకు అనుగుణంగా మార్పులు, అభివృద్ధి జరగడం లేదు. అడుగడుగునా మిలటరీ ఆంక్షలతో సామాన్యులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. అందుకే జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న డిమాండ్‌తో కంటోన్మెంట్ వికాస్ మంచ్ (సీవీఎం) ఏర్పాటు చేసి పోరాడుతున్నాం. కేంద్రం సానుకూలంగా స్పందించడం సంతోషం. ప్రజల సమస్యలు తీరనున్నాయి. – సంకి రవీందర్, సీవీఎం ప్రధాన కార్యదర్శి -
రోడ్లు మూసేస్తే ధర్నా
సబ్ ఏరియా జీఓసీకి తేల్చి చెప్పాను నసీరుద్దీన్ షా ఉర్సుకు ‘దారి’క్లియర్ ఎంపీ మల్లారెడ్డి వెల్లడి కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రతిపాదిత రోడ్లను మూసేస్తే తాను ధర్నాకు సైతం వెనుకాడేది లేదని ఎంపీ మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం తెలంగాణ-ఆంధ్రా సబ్‌ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ (జీఓసీ)- ఇన్- చీఫ్ మేజర్ జనరల్ పచోరీని కలిశారు. ఈ భేటీలో కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు బ్రిగేడియర్ అజయ్ సింగ్ నేగీ, కల్నల్ క్యూ అజయ్ కటోచీ తదితరులున్నారు. బోయిన్‌పల్లిలోని ప్రముఖ దర్గా నసీరుద్దీన్ షా బాబా దర్గాలో ఉర్సు నిర్వహించనున్న నేపథ్యంలో ఆర్మీ స్థావరాల నుంచి వెళ్లేందుకు తాత్కాలికంగా రోడ్డు తెరిపించాల్సిందిగా మల్లారెడ్డి జీఓసీని కోరారు. ఇందుకు సమ్మతించి ఈ నెల 7 నుంచి 9 వతేదీ వరకు దర్గా వెళ్లేందుకు అనువుగా రోడ్డు మార్గాన్ని తెరిచేలా సంబంధిత కమాండర్‌కు జీఓసీ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఏఓసీ రోడ్ల మూసివేతపై ఆసక్తి కరమైన చర్చ జరిగినట్లు ఎంపీ మల్లారెడ్డి తెలిపారు. ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ గుండా వెళ్లే రోడ్ల మూసివేతపై ఆర్మీ అధికారుల నిర్ణయం ఏంటని జీఓసీని అడగ్గా... ఈ మార్గంలో సాధారణ పౌరుల రాకపోకలపై నిషేధం విధించేందుకు తమకు కోర్టు అనుమతిచ్చినట్లు తెలిపారన్నారు. ఈ మేరకు డిసెంబర్ 1 నుంచి గాఫ్ రోడ్డు మూసేస్తున్నట్లు స్పష్టం చేశారని మల్లారెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనను మానుకోవాలని సూచించగా ఉన్నతాధికారులు, లేదా మంత్రిత్వ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వస్తేనే రోడ్ల మూసివేత నిర్ణయంలో మార్పు ఉంటుందని పచోరీ పేర్కొన్నట్లు ఎంపీ వెల్లడించారు. తాను శుక్రవారం ఢిల్లీకి వెళ్లి నేరుగా కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి రోడ్ల మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు లిఖిత పూర్వక ఆదేశాలు ఇవ్వాలని కోరతానన్నారు.