రయ్‌ రయ్‌మనేలా | CM Revanth Reddy laid the foundation stone for the elevated corridor | Sakshi
Sakshi News home page

రయ్‌ రయ్‌మనేలా

Published Fri, Mar 8 2024 3:40 AM | Last Updated on Fri, Mar 8 2024 3:41 PM

CM Revanth Reddy laid the foundation stone for the elevated corridor  - Sakshi

దశాబ్దాల వెతలు తీర్చనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌ 

కరీంనగర్, మంచిర్యాల సహా ఆరు జిల్లాలకు ప్రయోజనం

ప్యాట్నీ నుంచి ఓఆర్‌ఆర్‌ వరకు మొత్తం 18.10 కిలోమీటర్ల కారిడార్‌

రూ.2,232 కోట్ల వ్యయంతో నిర్మాణం

0.3 కి.మీ. అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌

11.12 కి.మీ. ఎలివేటెడ్‌ కారిడార్‌

కంటోన్మెంట్‌: ఉత్తర తెలంగాణలో ఆరు జిల్లాల ప్రజల దశాబ్దాల కల త్వరలోనే సాకారం కానుంది. రాజధాని నగరం  హైదరాబాద్‌ నుంచి ఆయా జిల్లాలకు రాకపోకలు సాగించేందుకు ఇన్నాళ్లుగా పడిన కష్టాలు తీరిపోనున్నాయి. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఏరియాలో ఇరుకైన రహదారిలో వాహనదారులు పడుతున్న ఇబ్బందులు తీర్చేందుకు రూ.2,232 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే ఆరు జిల్లాల ప్రజలకు ప్రయాణ సమయం తగ్గిపోవడంతో ఇంధన రూపంలో వ్యయం తగ్గిపోనుంది.

కారిడార్‌ నిర్మాణం ఇలా
రాజీవ్‌ రహదారిపై నిర్మించనున్న కారిడార్‌ సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌ సమీపంలోని ప్యా ట్నీ సెంటర్‌ నుంచి మొదలై  కార్ఖానా, తిరు మలగిరి, బొల్లారం, అల్వాల్, హకీంపేట్, తూంకుంట మీదుగా శామీర్‌పేట్‌ సమీపంలోని ఓఆర్‌ ఆర్‌ జంక్షన్‌ వద్ద ముగుస్తుంది. ఈ మొత్తం కారిడార్‌ పొడవు 18.10 కిలోమీటర్లు. ఇందులో ఎలివేటెడ్‌ కారిడార్‌ 11.12 కిలోమీటర్లు ఉంటుంది.

అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ 0.3 కి.మీ ఉంటుంది. మొత్తం 287 పియర్స్‌ (స్తంభాలు) ఉంటాయి. మొత్తం ఆరు వరుసల్లో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తారు. ఎలివేటెడ్‌ కారిడార్‌పైకి రాకపోకలు సాగించేందుకు వీలుగా తిరుమలగిరి జంక్షన్‌ సమీపంలో (0.295 కి.మీ. వద్ద), (0.605 కిలోమీటర్‌ వద్ద), అల్వాల్‌ వద్ద (0.310 కిలోమీటర్‌ వద్ద) మొత్తంగా మూడు చోట్ల ఇరువైపులా ర్యాంపులు నిర్మిస్తారు.

ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో.. 
ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మిస్తున్న ప్రాంతంలో రోజుకు సగటున 58,468 వాహనాలు (ప్యాసింజర్‌ కార్‌ యూనిట్‌ పర్‌ డే –పీసీయూ) పయనిస్తున్నాయి. ఇందులో కార్ఖానా సమీపంలో పీసీయూ 81,110 వద్ద ఉండగా, ఓఆర్‌ఆర్‌ జంక్షన్‌ సమీపంలో 35,825గా ఉంది.

ఇరుకైన రహదారి కావడం, ఇంత పెద్ద మొత్తంలో వాహన రాకపోకలతో ఈ మా ర్గంలో ప్రయాణం అంటేనే వాహనదారులు హడలి పోతున్నారు. సమయం హరించుకుపోవడంతో పా టు ఇంధన వ్యయం పెరుగుతోంది. ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంతో సమయం కలి సిరావడంతో పాటు ఇంధనంపై అయ్యే వ్యయం తగ్గిపోతుంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ బాధలు తొలగిపోతాయి. 

ముఖ్యాంశాలు...
మొత్తం కారిడార్‌ పొడవు: 18.10 కి.మీ.
ఎలివేటెడ్‌ కారిడార్‌ పొడవు: 11.12 కి.మీ.
అండర్‌గ్రౌండ్‌ టన్నెల్‌: 0.3 కి.మీ.
పియర్స్‌: 287
అవసరమైన భూమి: 197.20 ఎకరాలు
రక్షణ శాఖ భూమి: 113.48 ఎకరాలు
ప్రైవేట్‌ ల్యాండ్‌: 83.72 ఎకరాలు
ప్రాజెక్టు వ్యయం:  రూ.2,232 కోట్లు

ఇవీ ప్రయోజనాలు 
    రాజీవ్‌ రహదారి మార్గంలో సికింద్రాబాద్‌తో పాటు కరీంనగర్‌ వైపు జిల్లాల  ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు చెల్లు
    కరీంనగర్‌ వైపు మెరుగైన ప్రయాణం 
    ఇంధనం మిగులుతో వాహనదారులకు తగ్గనున్న వ్యయం
    సికింద్రాబాద్‌ నుంచి ట్రాఫిక్‌ ఆటంకాలు లేకుండా ఓఆర్‌ఆర్‌ వరకు చేరుకునే అవకాశం
   మేడ్చల్‌–మల్కాజిగిరి–సిద్దిపేట–కరీంనగర్‌–పెద్దపల్లి–మంచిర్యాల, కొమురం భీం జిల్లా ప్రజలు  లబ్ధిపొందనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement