Secunderabad Cantonment Assembly Constituency
-
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం
updates... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్బీజేపీ 22887 ఓట్లుబీఆర్ఎస్-21489 ఓట్లు కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..కాంగ్రెస్- శ్రీగణేష్ -18140బీఆర్ఎస్-నివేదిత- 11739బీజేపీ-వంశీ తిలక్-9160కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలుమొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140 బిజెపి అభ్యర్థి తిలక్ 2666 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్‌సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నికకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్ఎస్కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్‌తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్‌కి గ్రేటర్ హైదరాబాద్‌లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
బాషా వర్సెస్ తిలక్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. గత రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేశ్ అకస్మాత్తుగా కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా మారడంతో బీజేపీ అగ్ర నేతలు షాక్‌కు గురయ్యారు. ఈసారి అభ్యర్థి ఎంపికలో గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. పాతిక మందికిపైగా ఆశావహులు పోటీ పడుతుండటంతో, వారిలో బలమైనవారిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఏకాభిప్రాయం కుదురడం లేదని తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, వర్గపోరు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వడపోత పోసి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాజీమంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ టీఎన్ వంశీతిలక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత, వర్రి తులసీ విజయ్‌కుమార్, జైనపల్లి శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇద్దరూ ఇద్దరే... డాక్టర్ వంశీతిలక్ తల్లిదండ్రులు సదాలక్షి్మ, టీవీ నారాయణ కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారం ప్రాంతానికి చెందినవారు. సదాలక్ష్మి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో సంచలనంగా నిలిచారు. ఆమె భర్త టీవీ నారాయణకు 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరి వారసుడిగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న వంశీతిలక్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం పెద్దల ఆశీస్సులతో తనకు టికెట్ దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొప్పు భాషా పాతికేళ్ల క్రితమే ఏబీవీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ‘నా రక్తం నా తెలంగాణ’పేరిట తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎంపీపీగా పనిచేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పారీ్టలో కీలక వ్యక్తిగా ఎదిగారు. నగరంలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈయన పేరును సైతం బీజేపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. -
అయ్యో లాస్య..!
కంటోన్మెంట్/రసూల్‌పురా: 30 ఏళ్లుగా కంటోన్మెంట్‌తో విడదీయలేని బంధం ఏర్పరుచుకున్న దివంగత ఎమ్మెల్యే సాయన్న వారసురాలిగా లాస్య నందిత అనతికాలంలోనే రాజకీయాల్లో ప్రత్యేకత చాటుకున్నారు. 2016లో కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె ఐదేళ్ల పాటు సేవలందించారు. నాటి నుంచి కంటోన్మెంట్ రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేస్తూ తండ్రికి చేదోడు వాదోడుగా కొనసాగుతూ వచ్చారు. సోదరి నివేదితతో కలిసి తండ్రికి అండగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలోనే సాయన్న తన తర్వాత లాస్యను ఎమ్మెల్యే చేయాలని తపించేవారు. అయితే, దురదృష్టవశాత్తూ గతేడాది సాయన్న తన పదవీకాలం ముగియక ముందే మరణించారు. సాధారణ ఎన్నికలు ఏడాదిలోపే గడువు ఉండటంతో ఉప ఎన్నికలు జరగలేదు. అయినప్పటికీ సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ లాస్యకు టికెట్ ఇవ్వడడంతో పోటీ చేసి గెలిచారు. సాయన్న టీమ్‌తో కలసిమెలసి.. దివంగత ఎమ్మెల్యే సాయన్న నియోజకవర్గ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. లాస్య ఆయా వర్గాలను కలుస్తూ వారి మద్దతును కూడదీస్తూ గత ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించారు. ప్రజాసంఘాలు, కాలనీలు, బస్తీ సంక్షేమ సంఘాలతో ప్రత్యక్ష సంబంధాలు నెరుపుతూ వచ్చారు. ఆయా ప్రాంతాల్లోని సమస్యలపై దృష్టి సారిస్తూ దశల వారీగా పరిష్కారానికి చర్యలు చేపడుతూ వచ్చారు. ముఖ్యంగా తాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించారు. రెండునెలల్లోనే ప్రజాక్షేత్రంలోకి చొచ్చుకుపోతుండటంతో సాయన్న వర్గీయులు ఆనందం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఇంతలోనే లాస్య నందిత మృత్యువాత పడటంతో కార్యకర్తలను కలిచి వేసింది. లాస్య మృతి వార్త వెలువడగానే నియోజకవర్గ వ్యాప్తంగా సాయన్న, లాస్య అభిమానులు కార్ఖానాకు పోటెత్తారు. ఒకే ఒక్క బోర్డు సమావేశానికి హాజరు కంటోన్మెంట్ బోర్డులో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటారు. లాస్య ఎమ్మెల్యేగా గెలిచిన రెండున్నర నెలల్లో రెండు బోర్డు సమావేశాలు జరిగాయి. గత నెలలో జరిగిన సమావేశానికి మాత్రమే ఆమె హాజరయ్యారు. అమ్ముగూడ రోడ్డుకు తన నియోజకవవర్గ అభివృద్ధి నిధుల్లో రూ.1 కోటి కేటాయిస్థానని హామీ ఇచ్చారు. గత బుధవారం బోర్డు కార్యాలయానికి వచి్చన ఆమె, బోర్‌వెల్స్ మీటర్లు పెట్టాలన్న బోర్డు ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంతలోనే లాస్య మృతి చెందడంపై స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. 2015లో రాజకీయ అరంగేట్రం.. దివంగత ఎమ్మెల్యే సాయన్న 1994 నుంచి వరుసగా మూడుసార్లు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి.. 2009లో తొలిసారి ఓటమిపాలయ్యారు. తిరిగి 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 2015 జనవరిలో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు నుంచి లాస్య నందితను రాజకీయ ఆరంగేట్రం చేయించారు. అయితే, ఈ ఎన్నికల్లో నళిని కిరణ్ చేతిలో లాస్య ఓటమి పాలయ్యారు. మరుసటి ఏడాది సాయన్న టీఆర్ఎస్లో చేరగా 2016లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇప్పించుకున్నారు. కాగా, 1986లో సాయన్న తొలిసారిగా కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమిపాలైన అదే ప్రాంతం(కవాడిగూడ) నుంచి 2015లో లాస్య గెలుపొందడం విశేషం. అయితే, 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మరోసారి కవాడిగూడ నుంచి పోటీ చేసి లాస్య ఓటమి పాలయ్యారు. తాజాగా 2023 నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. అభివృద్ధి పనులపై దృష్టి.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాయన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే వేసవిలో నీటి ఎద్దడి ఏర్పడకుండా అన్ని వార్డుల్లో పవర్ బోర్‌వెల్స్ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఆయన మరణంతో ఆయా పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈక్రమంలో ఇటీవల ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య.. రసూల్‌పురా, ఇందిరమ్మనగర్, గన్ బజార్, మడ్ ఫోర్ట్, శ్రీరాంనగర్ డబుల్ బెడ్రూం గృహ సముదాయం, బోయిన్పల్లి తదితర ప్రాంతాల్లో పవర్‌బోర్లు వేయించారు. అదేవిధంగా బొల్లారంలో శిథిలావస్థలో ఉన్న జూనియర్ కళశాల భవనం స్థానంలో నూతన నిర్మాణానికి ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. మరోవైపు పయనీర్ బజార్, ఆదర్శనగర్ బస్తీల్లో రోడ్లు, డ్రైనేజీ, పవర్ బోర్‌వెల్స్ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అదే విధంగా మడ్‌ఫోర్ట్ అంబేడ్కర్ హట్స్‌లో తాగునీటి పైపులైను పనులు పూర్తిలా చర్యలు తీసుకున్నారు. మడ్‌ఫోర్ట్ ప్రభుత్వ పాఠశాల్లో మన ఊరు మన బడి నిధులతో అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నారు. నారాయణ జోపిడి సంఘం డబుల్‌బెడ్ రూం ఇళ్లు త్వరగా పూర్తి అయ్యేలా రెవెన్యూ, గృహనిర్మాణ అధికారులను ఆదేశించారు. మార్చురీ వద్ద విషాదఛాయలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతదేహానికి గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మార్చురీ వద్దకు చేరుకుని మృతురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే లాస్య నందిత.. ఆమె తండ్రి, దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తమకున్న అనుబంధాలను గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఎమ్మెల్యే ఒంటిపై 12 తాయిత్తులు.. రెండుసార్లు ప్రాణాలతో బయటపడిన ఎమ్మెల్యే లాస్య నందితను మృత్యువు మూడోసారి రోడ్డు ప్రమాద రూపంలో బలి తీసుకుంది. కంటోన్మెంట్లో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవ సందర్భంగా లిఫ్ట్‌లో ఇరుక్కోవడం, ఇటీవల నల్లగొండ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు కిందపడి ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లాస్య పలు ఆలయాలు, బాబాల వద్ద ప్రత్యేక పూజలు చేయించుకొని తాయిత్తులు కట్టించుకున్నట్టు తెలుస్తోంది. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిస్తున్న సమయంలో మృతదేహంపై సుమారు 12 తాయిత్తులు ఉన్నట్టు వైద్యులు గుర్తించి పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. తలకు గాయం కావడంతో.. ప్రమాదంలో తలకు తీవ్రగాయం కావడంతోనే ఎమ్మెల్యే లాస్య నందిత మృతి చెందినట్టు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో తెలిసింది. ప్రమాదంలో ఎడమకాలు విరిగిపోవడంతో పాటు దంతాలు ఊడిపోయాయి. గాంధీ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడీ కృపాల్‌సింగ్, ప్రొఫె సర్ లావణ్య కౌషిల్ నేతృత్వంలో ఆరుగురు వైద్యబృందం పోస్టుమార్టం నిర్వహించారు. ఎమ్మెల్యేల నివాళి గాంధీ మార్చురీలో ఉన్న ఎమ్మెల్యే లాస్య మృతదేహానికి పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు.గాంధీ ఆస్పత్రికి చేరుకున్న వారిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాసయాదవ్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారి లక్ష్మారెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, వాకాటి శ్రీపతి, కోవా లక్ష్మీ, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్.. లింగోజిగూడ కార్పొరేటర్ దరిపల్లి రాజశేఖర్‌రెడ్డి తదితరులున్నారు. లాస్య అకాల మృతిపై సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావు గౌడ్ సంతాపం వ్యక్తం చేశారు. మంచి భవిష్యత్తు ఉన్న నాయకురాలు: మంత్రి కోమటిరెడ్డి బంగారు భవిష్యత్తు ఉన్న ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తాను దిగ్భ్రాంతికి గురయ్యానని, ఇది అత్యంత బాధకరమైన విషయమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గాంధీ మార్చురీ వద్ద లాస్య నందిత మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గ ప్రజలకు ఆమె ఇచి్చన హామీలను తమ ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్నతో తనకు 15 ఏళ్ల అనుబంధం ఉందని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. -
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత(33) రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం వేకువ ఝామున పటాన్చెరు ఓఆర్ఆర్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో లాస్య నందిత అక్కడికక్కడే మృతి చెందారు. కారు నడిపిన ఆమె పీఏ, స్నేహితుడు ఆకాష్‌కు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైన కారు నిద్రమత్తులోనే? సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ వద్ద ఈ తెల్లవారు ఝామున దుర్ఘటన చోటు చేసుకుంది. మొక్కులు తీర్చుకునే క్రమంలో లాస్య తప్ప ఆమె కుటుంబ సభ్యులంతా గురువారం రాత్రి సదాశివపేట (మం) కొనాపూర్‌లోని మిస్కిన్ బాబా దర్గాకి వెళ్లారు. కాసేపటికే ఆకాష్‌తో పాటు లాస్య కూడా దర్గాకి వచ్చారు. లాస్య కుటుంబం అంతా రాత్రి 12.30 గంటలకు దర్గాలో పూజలు చేశారని అక్కడి నిర్వాహకులు చెబుతున్నారు. తిరిగి.. అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో హైదరాబాద్‌కు లాస్య కుటుంబం పయనం అయ్యింది. మొక్కులు తీర్చుకున్న తర్వాత.. 3 నుంచి 4 గంటల మధ్య లాస్య కారు బయల్దేరిందని చెప్తున్నారు. అయితే.. పటాన్ చెరు వైపు ఎందుకు ఆమె వాహనం వెళ్లింది అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి నిద్రమత్తు, వాహన అతివేగం ప్రమాదానికి కారణాలైన ఉంటాయని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ముందు వెళ్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో సడన్ బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి.. రెయిలింగ్‌ను బలంగా ఢీ కొట్టడంతోనే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ఆ సమయంలో లాస్య సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల అక్కడికక్కడే మృతి చెందారు. సుల్తాన్పూర్ వద్ద ఓఆర్ఆర్పై ప్రమాదానికి గురైన కారు తల్లడిల్లిన తల్లి గుండె ఈ ప్రమాదంలో కారు ముందు భాగం బాగా దెబ్బతింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న లాస్య నందిత స్పాట్లోనే మృతి చెందారు. తీవ్రగాయాలైన ఆకాశ్‌ను మియాపూర్ మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. లాస్య నందిత మృతదేహాన్ని పటాన్చెరు అమెథా ఆస్పత్రికి తరలించారు. కూతురి మరణవార్త విని తల్లి స్పృహ తప్పి పడిపోయారు. మృతదేహాన్ని చూసి గుండెలు పగిలేలా రోదించారు. సోదరి నివేదితా రోదన పలువురిని కంటతడి పెట్టించింది. బీఆర్ఎస్ సీనియర్ హరీష్‌రావు ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. గాంధీ ఆస్పత్రిలో లాస్య మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అందజేస్తారు. ఇక.. యువ ఎమ్మెల్యే మృతి పట్ల బీఆర్ఎస్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. లాస్య కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన హరీష్‌రావు సీఎం రేవంత్ దిగ్భ్రాంతి.. లాస్య నందిత అకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నందిత తండ్రి సాయన్నతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని అధికారుల్ని సీఎం రేవంత్ ఆదేశించారు. ఇక పలువురు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సైతం లాస్య మృతిపై సంతాపం ప్రకటించారు. మంత్రి కోమటిరెడ్డి గాంధీ ఆస్పత్రికి వెళ్లి లాస్య కుటుంబాన్ని పరామర్శించారు. లాస్య మృతి బాధాకరమని.. ఎమ్మెల్యేగా ఆమె ప్రజలకు ఇచ్చిన హామీల్ని తమ ప్రభుత్వం నెరవేరుస్తుందని మంత్రి కోమటిరెడ్డి చెప్పారు. లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అతి పిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందారని.. రోడ్డు ప్రమాదంలో అకాల మరణం ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ఆమె కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారాయన. బీఆర్ఎస్ నేతలు తలసాని, హరీష్‌రావు, కేటీఆర్, మల్లారెడ్డి.. తదితరులు లాస్య మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత లాస్య ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. లాస్య అంత్యక్రియలు అయ్యేదాకా ఆమె కుటుంబ సభ్యులతోనే ఉండాలని బీఆర్ఎస్ అధిష్టానం కవితకు సూచించినట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసుల దర్యాప్తు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతిపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామునే ప్రమాదం జరగ్గా.. ప్రాథమికంగా వచ్చిన అంచనాతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలోప్రమాద తీరును పోలీసు బృందాలు పరిశీలించాయి. త్వరలో కుటుంబ సభ్యులనూ పోలీసులు విచారించే అవకాశం ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యే.. లాస్య నందిత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న కుమార్తె. గతేడాది ఫిబ్రవరిలో సాయన్న గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఆ స్థానంలో లాస్య నందితకు బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది. నవంబర్ చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17,169 ఓట్ల మెజారిటీతో ఆమె విజయం సాధించారు. రాజకీయంగా ఎంతో భవిష్యత్తు ఉందని భావిస్తున్న తరుణంలో.. అదీ చిన్న వయసులో లాస్య ఇలా దుర్మరణం చెందడం పట్ల పలువురు నేతలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. @KTRBRS @TelanganaCMO @BRSparty pic.twitter.com/r3ZBt5SiAz — G Lasya Nanditha (@glasyananditha) December 9, 2023 10 రోజుల కిందటే ప్రమాదం.. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక లాస్య నందిత వరుసగా ప్రమాదాలకు గురయ్యారు. ఫిబ్రవరి 13వ తేదీన నల్లగొండలో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ జరిగింది. ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ఈ సభకు వెళ్లారు. ఆ సమయంలో ఆమె ప్రయాణిస్తున్న కారును నార్కట్‌పల్లి వద్ద ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఆమె వెళ్తున్న కారు ముందు టైర్ ఊడిపోయింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య తలకు స్వల్ప గాయమైంది కూడా. అయితే ఆ సమయంలోనూ ఆకాషే(25) కారు నడిపినట్లు తెలుస్తోంది. అంతకు ముందు.. కిందటి ఏడాది డిసెంబర్లో ఓ కార్యక్రమానికి వెళ్లిన ఆమె మూడు గంటలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. సిబ్బంది అతికష్టం మీద లిఫ్ట్‌ను బద్ధలు కొట్టి ఆమెను, ఆమెతో పాటు ఉన్నవాళ్లను బయటకు తీశారు. తండ్రి సాయన్న చనిపోయిన ఏడాదికే.. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మృతి చెందడం గమనార్హం. నార్కట్‌పల్లి వద్ద లాస్య కారుకు ప్రమాదం కుటుంబ నేపథ్యం.. సాయన్న, గీతలకు లాస్య నందిత జన్మించారు. ఆమెకు ఇద్దరు సోదరీమణులు.. నమ్రతా, నివేదితా. లాస్య కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. లాస్య నందిత గతంలో కవాడిగూడ కార్పొరేటర్‌గానూ పని చేశారు. తండ్రి మరణంతో ఆమెకు బీఆర్ఎస్ సీటు ఇవ్వగా.. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎన్ గణేష్‌పై 17 వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో లాస్య గెలుపొందారు. ఏడాదికే.. ప్రజాప్రతినిధుల హోదాలోనే ఈ తండ్రీకూతుళ్లిద్దరూ మృతి చెందడంతో పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తండ్రి సాయన్నతో లాస్య నందిత