
జగ్గారెడ్డిపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు
కంటోన్మెంట్‌లోని గన్‌రాక్ గార్డెన్‌లో శనివారం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను పంచి
హైదరాబాద్: కంటోన్మెంట్‌లోని గన్‌రాక్ గార్డెన్‌లో శనివారం ఓటర్లను ప్రలోభ పెట్టడానికి సెల్‌ఫోన్లు, ఇతర వస్తువులను పంచిన మెదక్ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు, మరో ముగ్గురిపై కార్ఖానా పోలీసులు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని సీఐ నాగేశ్వరరావు తెలిపారు. జగ్గారెడ్డిపై ఐపీసీ సెక్షన్ 171ఈ, 177బీ, 188 కింద కేసు నమోదు చేశామన్నారు. అదుపులో ఉన్న వ్యక్తుల నుంచి సమాచారం రాబడుతున్నట్టు సీఐ తెలిపారు.