హైదరాబాద్: ఎన్నికల వేళ కంటోన్మెంట్‌లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్.శ్రీగణేశ్ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పారీ్టలో చేరారు. కాగా శ్రీగణేశ్ మంగళవారం ఉదయం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి మారేడుపల్లి నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారి్నంగ్ వాకర్స్‌తోనూ ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని వక్తలు పేర్కొన్నారు.
అటు నుంచి శ్రీగణేశ్ నేరుగా పికెట్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు శ్రీగణేశ్‌ను కలిశారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మైనంపల్లి హన్మంతరావు రెండు రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పించారు. ఉదయం 11.00 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేశ్ మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్‌లో చేరిపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment