sri ganesh
-
కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలుపు
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ విజయం సాధించారు. సమీప ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెల 13న జరిగిన ఉపఎన్నికలో 1,30,929 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ 53,651 ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్ 40,445 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి జి. నివేదిత కేవలం 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. లాస్య నందిత స్థానంలో ఆమె అక్క నివేదితకు బీఆర్ఎస్కు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్, కాంగ్రెస్‌లో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు. 3.. 2.. 1 : తొలినాళ్లలో కాంగ్రెస్ యువనేతగా రాజకీయాల్లోకి వచి్చన నారాయణన్ శ్రీగణేశ్, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం శ్రీగణేశ్ ఫౌండేషన్ స్థాపించి కంటోన్మెంట్లో తన సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలో మరోసారి కాంగ్రెస్ టికెట్ కోసం యతి్నంచినా, దక్కలేదు. ఆఖరి నిమిషంలో బీజేపీ టికెట్ కేటాయించడంతో పోటీ చేసి 15వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. అనంతరం బీఆర్ఎస్లో చేరారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరఫున పోటీ చేసి 41,888 ఓట్లతో రెండోస్థానం దక్కించుకున్నారు. ఉపఎన్నిక రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శ్రీగణేశ్ సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఎట్టలకేలకు విజయం అందుకున్నారు. దీంతో శ్రీగణేశ్‌ను 3.. 2.. 1గా ఆయన అభిమానులు అభివర్ణిస్తూ ఉండటం గమనార్హం. రేవంత్‌ను కలిసిన శ్రీగణేశ్: ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీగణేశ్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనను అభినందించారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌కు పెరిగిన బలం సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ బలం పెరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. అదే సమయంలో బీఆర్ఎస్ బలం మరింత తగ్గినట్లయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసిన శ్రీగణేశ్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్‌పై 13 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నందిత సోదరి నివేదిత మూడోస్థానానికి పరిమితమయ్యారు. కాగా, కంటోన్మెంట్లో విజయంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరగ్గా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ఆ సంఖ్య 68కి చేరింది. మిత్రపక్షం సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం. కంటోన్మెంట్లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపుతో అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 39 నుంచి 35కి తగ్గింది. -
బాషా వర్సెస్ తిలక్
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపిక బీజేపీకి తలనొప్పిగా మారింది. గత రెండు పర్యాయాలు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేశ్ అకస్మాత్తుగా కాంగ్రెస్‌లో చేరి, ఆ పార్టీ అభ్యర్థిగా మారడంతో బీజేపీ అగ్ర నేతలు షాక్‌కు గురయ్యారు. ఈసారి అభ్యర్థి ఎంపికలో గతంలో మాదిరిగా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. పాతిక మందికిపైగా ఆశావహులు పోటీ పడుతుండటంతో, వారిలో బలమైనవారిని అభ్యర్థిగా ఎంపిక చేసేందుకు ఆపసోపాలు పడుతున్నారు. ముఖ్యంగా స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా ఏకాభిప్రాయం కుదురడం లేదని తెలుస్తోంది. పార్టీ పట్ల విధేయత, వర్గపోరు, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని వడపోత పోసి ముగ్గురు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. మాజీమంత్రి సదాలక్ష్మి కుమారుడు డాక్టర్ టీఎన్ వంశీతిలక్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కొప్పు బాషా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు కేంద్ర మాజీమంత్రి సర్వే సత్యనారాయణ, మాజీమంత్రి శంకర్రావు కుమార్తె సుష్మిత, వర్రి తులసీ విజయ్‌కుమార్, జైనపల్లి శ్రీకాంత్ పేర్లను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇద్దరూ ఇద్దరే... డాక్టర్ వంశీతిలక్ తల్లిదండ్రులు సదాలక్షి్మ, టీవీ నారాయణ కంటోన్మెంట్ నియోజకవర్గం బొల్లారం ప్రాంతానికి చెందినవారు. సదాలక్ష్మి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. తొలి దళిత దేవాదాయ శాఖ మంత్రిగా ఆమె తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలతో సంచలనంగా నిలిచారు. ఆమె భర్త టీవీ నారాయణకు 2016లో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. వీరి వారసుడిగా డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్న వంశీతిలక్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ మేరకు అధిష్టానం పెద్దల ఆశీస్సులతో తనకు టికెట్ దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొప్పు భాషా పాతికేళ్ల క్రితమే ఏబీవీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. ‘నా రక్తం నా తెలంగాణ’పేరిట తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం ఉప సర్పంచ్‌గా, ఎంపీటీసీ, ఎంపీపీగా పనిచేశారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా పారీ్టలో కీలక వ్యక్తిగా ఎదిగారు. నగరంలోని ఏకైక ఎస్సీ రిజర్వ్డ్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాల్సిందిగా పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. ఈయన పేరును సైతం బీజేపీ అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లో చేర్చినట్లు తెలుస్తోంది. -
కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే..
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం గణేష్ పేరును ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం శ్రీగణేష్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, శ్రీగణేష్ ఇటీవలే బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇక, బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి లాస్య నందిత విజయం సాధించారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మృతిచెందడంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరుగనుంది. ఇక, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగనుంది. పేరు కంటోన్మెంట్ జిల్లా హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య 250,733 పురుషులు 124,245 మహిళలు 122,315 నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Cantonment: బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
హైదరాబాద్: ఎన్నికల వేళ కంటోన్మెంట్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన ఎన్.శ్రీగణేశ్ కాంగ్రెస్‌లో చేరారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు మహేశ్ గౌడ్ సమక్షంలో మంగళవారం ఆయన కాంగ్రెస్ పారీ్టలో చేరారు. కాగా శ్రీగణేశ్ మంగళవారం ఉదయం బీజేపీ లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌తో కలిసి మారేడుపల్లి నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మారి్నంగ్ వాకర్స్తోనూ ముచ్చటించారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి బీజేపీ తరఫున శ్రీగణేశ్ బరిలో ఉంటారని వక్తలు పేర్కొన్నారు. అటు నుంచి శ్రీగణేశ్ నేరుగా పికెట్‌లోని తన కార్యాలయానికి వెళ్లారు. మధ్యాహ్నం మైనంపల్లి హన్మంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలు శ్రీగణేశ్‌ను కలిశారు. కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా మైనంపల్లి హన్మంతరావు రెండు రోజులుగా ఆయనతో సంప్రదింపులు జరిపారు. ఇక మంగళవారం నేరుగా కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడించి, కాంగ్రెస్‌లో చేర్పించారు. ఉదయం 11.00 గంటల వరకు బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేశ్ మధ్యాహ్నం 2.00 గంటలకు కాంగ్రెస్‌లో చేరిపోవడం గమనార్హం. -
ఇదో హెచ్చరిక!
న్యూఢిల్లీ: భారీ విపత్తుల్లో ఎలా వ్యవహరించాలనే దానికి నేపాల్‌లో సంభవించిన భూకంపం ప్రభుత్వానికి ఒక మేలుకొలుపు లాంటిదని భూకంపాలను అధ్యయనం చేసే నిపుణులు పేర్కొన్నారు. భవన నిర్మాణాలలో అత్యున్నత సాంకేతక పరిజ్ఞానం వినియోగించడం అత్యంత ఆవశ్యకమని వారు చెప్పారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో వచ్చిన భూకంపాల్లో ఇదే పెద్దదని జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ ముఖ్య శాస్త్రవేత్త శ్రీనగేశ్ పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. ఈ విపత్తును ఒక పాఠంగా భారత ప్రభుత్వం తీసుకోవాలని, భవనాల నిర్మాణాల్లో అత్యాధునిక పద్ధతులు అవలంభిస్తే నష్టాలను తగ్గించవచ్చన్నారు. 1934 నేపాల్, బిహార్, 2001 భుజ్ భూకంపాలు మనకు ఎన్నో అనుభవాలను మిగిల్చాయన్న ఆయన.. ఇలాంటి ప్రమాదాల సమయంలో ఎలా వ్యవహరించాలనే దానిపై ప్రజలకు అవగాహన అవసరం అన్నారు. భూకంపాలకు అవకాశం ఉన్న రాష్ట్రాల్లో తాము ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు మర్చిపోకుండా ఉండటానికి తరచుగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. అయితే ముందస్తుగా భూకంపాలను గుర్తించడం అసంభవమని ఆయన స్పష్టం చేశారు. -
చాంప్ లయోలా అకాడమీ
ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి కార్ఫ్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను లయోలా అకాడమీ జట్టు కైవసం చేసుకుంది. ఎ.వి.కాలేజి జట్టుకు రెండో స్థానం లభించింది. అవంతి కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. ఓయూ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన ఫైనల్లో లయోలా అకాడమీ జట్టు 19-6 స్కోరుతో ఎ.వి.కాలేజి జట్టుపై విజయం సాధించింది. లయోలా అకాడమీ జట్టులో శ్రీగణేష్ 12 పాయింట్లు చేయగా, పాషా 10 పాయింట్లను నమోదు చేశారు. ఎ.వి.కాలేజి జట్టులో సుధీర్ 4 పాయింట్లు చేశాడు. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు.