కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆయనే.. | Sri Ganesh As Congress Cantonment By Election Candidate, Details Inside - Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆయనే..

Published Sat, Apr 6 2024 12:51 PM | Last Updated on Sat, Apr 6 2024 2:40 PM

Sri Ganesh As Congress Cantonment By Election Candidate - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలకు కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్‌ అభ్యర్థిగా శ్రీగణేష్‌ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం గణేష్‌ పేరును ప్రకటించారు కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌.

కాగా, కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కోసం శ్రీగణేష్‌ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, శ్రీగణేష్‌ ఇటీవలే బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్‌ రెండో స్థానంలో నిలిచారు. ఇక, బీఆర్‌ఎస్‌ తరుఫున పోటీ చేసి లాస్య నందిత విజయం సాధించారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మృతిచెందడంతో కంటోన్మెంట్‌లో ఉప ఎన్నిక జరుగనుంది. ఇక, తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగనుంది. 

పేరు కంటోన్మెంట్‌
జిల్లా హైదరాబాద్
రాష్ట్రం తెలంగాణ
మొత్తం ఓటర్ల సంఖ్య 250,733
పురుషులు 124,245
మహిళలు 122,315

నవంబర్‌ 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేష్‌ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు.

కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌ అభ్యర్థి కోసం ఇక్కడ క్లిక్ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement