Cantonment elections
-
కంటోన్మెంట్ ఉప ఎన్నిక.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే..
సాక్షి, హైదరాబాద్: కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు కోసం కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించింది. కంటోన్మెంట్ అభ్యర్థిగా శ్రీగణేష్ పేరును ఖరారు చేసింది. ఈ మేరకు శనివారం గణేష్ పేరును ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్. కాగా, కంటోన్మెంట్ ఉప ఎన్నిక కోసం శ్రీగణేష్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే, శ్రీగణేష్ ఇటీవలే బీజేపీని వీడి హస్తం గూటికి చేరారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన శ్రీగణేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇక, బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి లాస్య నందిత విజయం సాధించారు. కాగా, ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య మృతిచెందడంతో కంటోన్మెంట్లో ఉప ఎన్నిక జరుగనుంది. ఇక, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా అదే రోజున జరుగనుంది. పేరు కంటోన్మెంట్ జిల్లా హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ మొత్తం ఓటర్ల సంఖ్య 250,733 పురుషులు 124,245 మహిళలు 122,315 నవంబర్ 2023లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీగణేష్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. కంటోన్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘కంటోన్మెంట్’ ఖరారు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలకు రంగం సిద్ధమైంది. కీలకమైన ఓటరు లిస్టు తుదిజాబితాను గత వారమే విడుదల చేశారు. అక్టోబర్ మొదటి వారంలో వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్ తొలి పక్షంలో నోటిషికేషన్ వెలువడే అవకాశమున్నట్లు స్పష్టమవుతోంది. 2015 జనవరి 11 ఎన్నికలు జరగ్గా, ఫిబ్రవరిలో కొత్త బోర్డు కొలువు తీరింది. ఈ ప్రకారం 2020 ఫిబ్రవరిలోపు బోర్డు ఎన్నికల ప్రక్రియ ముగించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల తీరుపై ప్రత్యేక కథనం.. సాక్షి, కంటోన్మెంట్: ప్రత్యేక ఓటరు జాబితా సాధారణంగా దేశ వ్యాప్తంగా ఏ ఎన్నికలైనా ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటరు లిస్టే ప్రామాణికం. చట్ట సభలైన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల్లోనూ ఇదే లిస్టు ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తారు. అయితే కంటోన్మెంట్లలో మాత్రం ప్రత్యేక ఓటరు లిస్టు ఉంటుంది. పార్లమెంట్ ఆమోదించిన ‘ది కంటోన్మెంట్స్ యాక్ట్–2006’కు లోబడి రూపొందించిన ‘కంటోన్మెంట్ ఎలక్టోరల్ రోల్స్–2007’ ఆధారంగా ఓటరు జాబితాను రూపొందిస్తారు. ఇటీవల జరిగిన పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటేసిన కంటోన్మెంట్ ఓటర్లలో చాలామందికి వివిధ కారణల వల్ల బోర్డు ఎన్నికల జాబితాలో అవకాశం కల్పించలేదు. రిజర్వేషన్లు ఇలా.. కేటగిరి–ఏకు చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులున్నాయి. 2006 వరకు ఏడు వార్డులే ఉండగా, 2006లో కొత్త చట్టం అమల్లోకి రావడంతో తొలిసారిగా మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. ఈ మేరకు మూడు వార్డులు మహిళలకు రిజర్వ్ అయ్యాయి. ఒక వార్డు ఎస్సీ– జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక మిగిలిన నాలుగు జనరల్ వార్డులున్నాయి. అయితే ఎస్సీ రిజర్వ్డ్ వార్డు మినహా మిగిలిన ఏడు వార్డుల్లో మహిళా రిజర్వేషన్లను రోటేషన్ పద్ధతిలో ఎంపిక చేస్తారు. 2008లో 1, 5, 6 వార్డుల నుంచి మహిళలు ప్రాతినిధ్యం వహించారు. 2015లో జరిగిన ఎన్నికల్లో ఈ మూడు వార్డులను జనరల్ కేటగిరీకి మార్చగా, మిగిలిన నాలుగు జనరల్ స్థానాల్లో డ్రా పద్ధతిలో 3, 4, 7 వార్డులు మహిళా రిజర్వ్ అయ్యాయి. 2వ వార్డు గత రెండు పర్యాయాల నుంచి జనరల్ కేటగిరీలో ఉండగా, 8వ వార్డు ఎస్సీ రిజర్వ్డ్గా ఉంది. తాజా పరిస్థితి.. ప్రస్తుత బోర్డులో 3,4, 7 వార్డులు మహిళలకు కేటాయించగా, ఆయా వార్డుల నుంచి అనిత ప్రభాకర్, నళిని కిరణ్, పి. భాగ్యశ్రీ బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఈ స్థానాలు జనరల్ కేటగిరీలోకి మారనున్నాయి. మిగిలిన 1, 2, 5, 6 వార్డుల్లో డ్రా పద్ధతిలో మూడింటిని మహిళలకు కేటాయించనున్నారు. ఆయా వార్డుల నుంచి జక్కుల మహేశ్వర్‌రెడ్డి, సాద కేశవరెడ్డి, రామకృష్ణ, పాండుయాదవ్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవేళ తమ స్థానాలు మహిళలకు కేటాయిస్తే, తమ కుటుంబ సభ్యులను నిలబెట్టేందుకు ఆయా నేతలు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక లోకనాథం ప్రాతినిధ్యం వహిస్తున్న ఎనిమిదో వార్డు మళ్లీ ఎస్సీ–రిజర్వ్డ్గా ఉండనుంది. 2011 జనాభా లెక్కలు ప్రామాణికంగా ఎస్సీ స్థానాన్ని ఎంపిక చేస్తున్నందున ఈ సారి కూడా 8వ వార్డు ఎస్సీ కేటగిరీలోనే ఉండటం ఖాయం. ఇప్పటి దాకా ఏడుగురు ప్రాతినిధ్యం కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమల్లోకి రావడంతో మహిళా బోర్డు సభ్యుల ప్రాతినిథ్యం పెరిగింది. 2008ఎన్నికల్లో ఒకటో వార్డు నుంచి జంపన విద్యావతి, ఐదో వార్డు నుంచి జే. అనూరాధ, ఆరోవార్డు నుంచి భానుక నర్మద బోర్డు సభ్యులుగా ఎన్నికయ్యారు. 2015లో ఆయా స్థానాలు జనరల్‌గా మారగా, వీరు పోటీ నుంచి తప్పుకుని కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అనిత ప్రభాకర్, నళినికిరణ్, పి.భాగ్యశ్రీ బోర్డు సభ్యులు ఎన్నికయ్యారు. అయితే ఎలాంటి మహిళా రిజర్వేషన్లు అమల్లో లేని 2006లోనూ ఏ. మంజుల రెడ్డి బోర్డు సభ్యురాలిగా ఎన్నికై, తొలి మహిళా బోర్డు సభ్యురాలిగా రికార్డు సృష్టించారు. ఆమె కంటోన్మెంట్ బోర్డు మాజీ సానిటరీ ఇన్స్పెక్టర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి. ఇదిలా ఉండగా మిగిలిన ఆరుగురు మహిళా బోర్డు సభ్యుల్లో భానుక నర్మద మినహా మిగిలిన వారంతా, మాజీ బోర్డు సభ్యుల వారసులిగానే బోర్డులో అడుపెట్టారు. -
ఆ ఓటమి పార్టీది కాదు: టీ టీడీపీ
సాక్షి, హైదరాబాద్: ‘కంటోన్మెంట్ ఎన్నికలు పార్టీ గుర్తు మీద జరిగినవి కావు. అధికార పార్టీ వార్డుకు ఇద్దరేసి మంత్రులను దింపి అధికార దుర్వినియోగం చేసింది. ఈ ఫలితాలు పార్టీకి సంబంధించినవి కావనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లాలి’ అని టీడీపీ తెలంగాణ నేతలు సమర్థించుకున్నట్లు సమాచారం. కంటోన్మెంట్ ఎన్నికల ఫలితాలు, ఎన్టీఆర్ వర్ధంతి గురించి చర్చించేందుకు ఎల్.రమణ అధ్యక్షతన శుక్రవారం ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీని వీడనున్న గ్రేటర్ నాయకులు, ఇతర జిల్లాల నేతల గురించి చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
కంటోన్మెంట్ ఎన్నికల్లో ‘గులాబీ’ హవా
4 వార్డుల్లో టీఆర్ఎస్.. 2 చోట్ల టీఆర్ఎస్ రెబెల్స్ పాగా ఒకచోట కాంగ్రెస్, మరోచోట స్వతంత్ర అభ్యర్థి విజయం ఖాతా తెరవని టీడీపీ-బీజేపీ కూటమి డిపాజిట్ కోల్పోయిన సర్వే వారసులు గెలవని సాయన్న కూతురు హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది. మొత్తం ఎనిమిది వార్డులకుగానూ.. టీఆర్ఎస్ నాలుగు వార్డుల్లో గెలుపొంది ఆధిక్యంలో నిలిచింది. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ పీజీ కళాశాలలో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఆద్యంతం ఆసక్తిని రేకెత్తించింది. రెండో వార్డులో కేశవరెడ్డి, నాలుగో వార్డులో నళిని కిరణ్, ఆరో వార్డులో పాండు యాదవ్, ఎనిమిదో వార్డులో లోకనాథం కారు గుర్తుపై గెలుపొందారు. మొదటి వార్డులో టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి జక్కుల మహేశ్వర్‌రెడ్డి, మూడో వార్డులో టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి అనిత ప్రభాకర్ విజయం సాధించారు. ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ, ఏడో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిని పి.భాగ్యశ్రీ గెలుపొందారు. ఎనిమిది వార్డుల్లో మొత్తం 74,712 ఓట్లు పోలవ్వగా.. ఇందులో 22,788 ఓట్లు సాధించి టీఆర్ఎస్ ప్రథమ స్థానంలో నిలిచింది. టీడీపీ-బీజేపీ కూటమికి 13,713 ఓట్లు, కాంగ్రెస్ పార్టీకి 9,641 ఓట్లు దక్కాయి. ఉపాధ్యక్ష పదవి టీఆర్ఎస్కే.. బోర్డు ఉపాధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు టీఆర్ఎస్కు ఒక వార్డు సభ్యుని మద్దతు దొరికితే సరిపోతుంది. బోర్డు ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. రెండు వార్డుల్లో పార్టీ రెబెల్స్, మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందిన నేపథ్యంలో ఉపాధ్యక్ష పదవిని దక్కించుకోవడం టీఆర్ఎస్కు కష్టసాధ్యం కాదన్నది స్పష్టమవుతోంది. రెబెల్స్, స్వతంత్రులను కలుపుకునిపోతామని ఇప్పటికే మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు ప్రకటించడం గమనార్హం. నేతల వారసులకు ఎదురుదెబ్బ.. నాలుగో వార్డు నుంచి పోటీ చేసిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందిత రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక రెండు, ఐదో వార్డుల నుంచి బరిలో నిలిచిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూతురు సుహాసినీ, కొడుకు నవనీత్ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. రెండో వార్డులో సుహాసినీ 560 ఓట్లతో నాలుగో స్థానంలోనూ.. ఐదో వార్డులో నవనీత్ 341 ఓట్లతో ఆరో స్థానంలోనూ నిలిచారు. ఇక స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు టీడీపీకి చెందినవారే అయినా ఆ పార్టీ పోటీ చేసిన ఐదు స్థానాల్లోనూ ఓటమిపాలైంది. టీడీపీ మిత్రపక్షం బీజేపీ మూడు స్థానాల్లో పోటీ చేసినా ఒక్కచోటా గెలవలేకపోయింది. -
'చంద్రబాబు రూ. 5 కోట్లు ఖర్చు పెట్టించారు'
హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. టీఆర్ఎస్ తిరుగుబాటు అభ్యర్థులు ఎవరూ లేరని చెప్పారు. వైఎస్ చైర్మన్ గా టీఆర్ఎస్ అభ్యర్థే ఉంటారని పేర్కొన్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.5 కోట్లు ఖర్చు పెట్టించారని ఆరోపించారు. టీడీపీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్పారని, జీహెచ్ ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని అన్నారు. మొత్తం 8 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. -
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం
-
ఓడిపోయిన రాజకీయ ప్రముఖుల కుమార్తెలు!
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలలో బీజేపీ, టీడీపీలకు చావుదెబ్బ తగిలింది. ఈ రెండు పార్టీలు ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయి. రాజకీయ ప్రముఖుల కుమార్తెలు ఓడిపోయారు. కంటోన్మెంట్ టీడీపీ ఎమ్మెల్యే జీ.సాయన్న,కాంగ్రెస్ సీనియర్ నేతలు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి శంకర్రావు కుమార్తెలు ముగ్గురూ ఓడిపోయారు. 4వ వార్డు పికెట్‌లో పోటీ చేసిన ఎమ్మెల్యే సాయన్న కూతురు లాస్య నందితపై 844 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మొత్తం 8 వార్డులకు 114 మంది పోటీ చేశారు. నాలుగు టీఆర్ఎస్, రెండు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందారు. రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ తాను టీఆర్ఎస్లోనే కొనసాగుతానని ప్రకటించారు. మిగిలిన రెండిటిలో ఒకటి కాంగ్రెస్, మరొకటి కాంగ్రెస్ రెబల్స్ గెలుచుకున్నారు. 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్‌పై 616 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు 1వ వార్డు మహేశ్వర రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) 2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్) 3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ ) 4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్) 5వ వార్డు మారేడ్‌పల్లి రామకృష్ణ (ఇండిపెండెంట్) 6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్) 7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్) 8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్) -
కంటోన్మెంట్లో టీఆర్ఎస్ విజయం
హైదరాబాద్: కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం 8 స్థానాలలో నాలుగు టీఆర్ఎస్ గెలుచుకోగా, రెండు స్థానాలను టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఆ ఇద్దరు కూడా టీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలిసింది. ఒక స్థానంలో కాంగ్రెస్, మరో స్థానం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి గెలిచారు. టీడీపీ, బీజేపీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయాయి. కంటోన్మెంట్‌ను తొలిసారిగా టీఆర్ఎస్ చేజిక్కించుకుంది. వార్డుల వారీగా గెలిచిన అభ్యర్థులు 1వ వార్డు మహేశ్వర రెడ్డి (టీఆర్ఎస్ రెబల్) 2వ వార్డు కేశవరెడ్డి (టీఆర్ఎస్) 3వ వార్డు అనితా ప్రభాకర్ (టీఆర్ఎస్ రెబల్ ) 4వ వార్డు నళినీ కిరణ్ (టీఆర్ఎస్) 5వ వార్డు రామకృష్ణ (కాంగ్రెస్ రెబల్) 6వ వార్డు పాండు యాదవ్ (టీఆర్ఎస్) 7వ వార్డు తిరుమలగిరి భాగ్యశ్రీ(కాంగ్రెస్) 8వ వార్డు బొల్లారం లోకనాథం (టీఆర్ఎస్) -
టీఆర్ఎస్ సత్తా చూపించాం: తలసాని
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తన సత్తా చూపించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్ నగర్లో తేల్చుకుందామన్న టీడీపీకీ కంటోన్మెంట్ ఫలితాలే సమాధానమని ఆయన అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని తలసాని అన్నారు. ఉపాధ్యక్షులు ఎవరు అనేది పార్టీ నిర్ణయిస్తుందని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ఏజెంట్ల సత్తా బయటపడిందని తలసాని ఎద్దేవా చేశారు. కాగా ఇప్పటివరకూ ఆరు వార్డుల ఫలితాలు వెలువడ్డాయి. ఒకటవ వార్డులో స్వతంత్ర అభ్యర్థి మహేశ్వర్‌రెడ్డి గెలుపొందగా, 2వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి కేశవరెడ్డి విజయం సాధించారు. 3వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్, 4వ వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి నళినీ కిరణ్ విజయం సాధించారు. అయిదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి రామకృష్ణ గెలుపొందగా, ఆరో వార్డులో టీఆర్ఎస్ అభ్యర్థి పాండు యాదవ్ విజయం సాధించారు. ఇంకా రెండు వార్డుల ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి. -
ఎమ్మెల్యే సాయన్నకుమార్తెకు తప్పని ఓటమి
కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో స్థానిక టీడీపీ ఎమ్మెల్యే సాయన్నకు ఎదురుదెబ్బ తగిలింది. 4 వ వార్డు పికెట్ లో పోటీ చేసిన సాయన్న కూతురు లాస్య నందిత ఓటమి పాలైయ్యారు. లాస్య నందితపై 844 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి నళిని కిరణ్ విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్ననానికి అన్ని ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 8 వార్డుల్లో నాలుగింటికి ఫలితాలు వెల్లడయ్యాయి. 2 వార్డులు టీఆర్ఎస్, 2 వార్డులు టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. -
మరో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపు
కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో మరో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి గెలుపొందారు. 3 వార్డు కార్ఖానాలో టీఆర్ఎస్ అభ్యర్ధి జంపన విద్యావతిపై 2500 ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి అనితా ప్రభాకర్ విజయం సాధించారు. 2 వ వార్డు రసూల్ పుర లో టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి గెలుపొందారు. సుహాసిని పై 1534 ఓట్ల ఆధిక్యంతో సదాకేశవ రెడ్డి విజయం సాధించారు. 1 వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర రెడ్డి గెలుపొందారు. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మధ్యాహ్ననానికి అన్ని ఫలితాలు వెలువడే అవకాశం. ఉంది. 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి
-
టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం
-
సర్వే సత్యనారాయణ కుమార్తె ఓటమి
కంటోన్మెంట్: కంటోన్మెంట్ ఎన్నికల్లో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ కుమార్తె సుహాసిని ఓటమి పొందారు. 2వ వార్డు రసూల్ పురలో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన సుహాసినిపై టీఆర్ఎస్ అభ్యర్థి సదాకేశవ రెడ్డి గెలుపొందారు. సుహాసిని పై సదాకేశవ రెడ్డి 1534 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మరోవైపు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాగా 1వ వార్డులో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు. కంటోన్మెంట్ 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
కంటోన్మెంట్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
-
టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి విజయం
కంటెన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో తొలి ఫలితం నమోదు అయింది. కంటెన్మెంట్ 1వ వార్డులో స్వతంత్రంగా పోటీ చేసిన టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి జక్కుల మహేశ్వరరెడ్డి గెలుపొందారు. టీఆర్ఎస్ అభ్యర్థి జంపన ప్రతాప్ పై 616 ఓట్ల ఆధిక్యంతో మహేశ్వర రెడ్డి విజయం సాధించారు. ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికలను అధికార పార్టీ టీఆర్ఎస్ సహా అన్నిప్రధాన రాజకీయ పార్టీలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
కంటోన్మెంట్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
హైదరాబాద్ : ప్రతిష్టాత్మక కంటోన్మెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంటలలోపే ఎన్నికల ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 8 వార్డులకు 114 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ సహా అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. -
కంటోన్మెంట్‌పై బాబు కన్ను
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టీటీడీపీ నేతలతో హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో టీటీడీపీ కీలక నేతలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నేతలు కూడా హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టవలసిన కార్యచరణపై బాబు, టీటీడీపీ నేతలు ఈ సందర్భంగా చర్చిస్తారు. అయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. 2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది. ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది. -
'కంటోన్మెంట్'పై టీ మంత్రులు కసరత్తు
హైదరాబాద్ : కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తుంది. అందులోభాగంగా ఆ పార్టీకి చెందిన తెలంగాణ మంత్రులు గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీకి మంత్రులు పద్మారావు, తలసాని శ్రీనివాసయాదవ్తోపాటు పలువురు కీలక నేతలు హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చేపట్టవలసిన కార్యచరణపై వారు ఈ సందర్భంగా చర్చిస్తారు. 2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది. ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది.