కంటోన్మెంట్పై బాబు కన్ను | T TDP leaders meeting with AP CM Chandrababu naidu over cantonment elections | Sakshi
Sakshi News home page

కంటోన్మెంట్పై బాబు కన్ను

Published Fri, Dec 26 2014 10:04 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

కంటోన్మెంట్పై బాబు కన్ను - Sakshi

కంటోన్మెంట్పై బాబు కన్ను

హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టీటీడీపీ నేతలతో హైదరాబాద్లో భేటీ కానున్నారు. ఈ భేటీలో టీటీడీపీ కీలక నేతలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నేతలు కూడా హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టవలసిన కార్యచరణపై బాబు, టీటీడీపీ నేతలు ఈ సందర్భంగా చర్చిస్తారు. అయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే.

2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది.

ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement