t tdp leaders
-
టీఆర్ఎస్వి ప్రజా వ్యతిరేక విధానాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని టీ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భవన్లో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మాట్లాడారు. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి మరీ మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పెద్దిరెడ్డి విమర్శించారు. విమర్శలు చేస్తే కేసులు పెట్టిస్తామని సీఎం కేసీఆర్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో గవర్నర్‌ను సంప్రదిస్తామని చెప్పారు. గోదావరి ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయారని రావుల విమర్శించారు. -
టీ.టీడీపీ నేతలతో లోకేశ్ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా టీ.టీడీపీ నేతలతో లోకేశ్ శనివారం భేటీయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు పార్టీ బలోపేతంపై ప్రధానంగా లోకేశ్ నేతలతో చర్చించనున్నారు. -
కంటోన్మెంట్‌పై బాబు కన్ను
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ కసరత్తు చేస్తోంది. అందులోభాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు శుక్రవారం టీటీడీపీ నేతలతో హైదరాబాద్‌లో భేటీ కానున్నారు. ఈ భేటీలో టీటీడీపీ కీలక నేతలు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్నతోపాటు ఆ ప్రాంతానికి చెందిన నేతలు కూడా హాజరుకానున్నారు. కంటోన్మెంట్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేపట్టవలసిన కార్యచరణపై బాబు, టీటీడీపీ నేతలు ఈ సందర్భంగా చర్చిస్తారు. అయితే కంటోన్మెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. 2015, జనవరి 11న కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. కంటోన్మెంట్లో మొత్తం ఎనిమిది వార్డులకు చెందిన దాదాపు 2.30 లక్షల మంది ఓటర్లు.... ఎనిమిది మంది సభ్యులను ఎన్నుకుంటారు. కంటోన్మెంట్ చట్టం -1924 స్థానంలో కొత్తగా ది కంటోన్మెంట్స్ యాక్ట్ -2006 అమల్లోకి వచ్చింది. ఆ చట్ట ప్రకారం 2008లో మే 18 కంటోన్మెంట్‌కు ఎన్నికలు జరిగాయి. తద్వారా సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు తొలి పాలకమండలి ఏర్పాటైంది. ఆ పాలక మండలి గడువు 2013 జూన్ 5వ తేదీతో ముగిసింది. అయితే పాలక మండలి గడువును మరో రెండు సార్లు పొడిగించారు. 2014 జూన్ 5వ తేదీతో ఆ గడువు కూడా పూర్తి అయింది. అప్పటి నుంచి కంటోన్మెంట్ అధికారుల పాలన సాగుతోంది. -
టీ టీడీపీ నేతలది దళారీ పాత్ర: కేటీఆర్
టీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య మైత్రి కుదిర్చేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు దళారీ పాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు విమర్శించారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇరు ప్రాంతాల ప్రజలు నమ్మడం లేదని, అసలు ఇంతవరకు రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడిని చూడలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో ఏం చేయాలో చెప్పకుండా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న బాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు.