టీఆర్‌ఎస్‌వి ప్రజా వ్యతిరేక విధానాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోందని టీ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు పెద్దిరెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి శుక్రవారం మాట్లాడారు. సాంకేతిక నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పక్కన పెట్టి మరీ మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని పెద్దిరెడ్డి విమర్శించారు. విమర్శలు చేస్తే కేసులు పెట్టిస్తామని సీఎం కేసీఆర్ మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఈ విషయంలో గవర్నర్‌ను సంప్రదిస్తామని చెప్పారు. గోదావరి ప్రాజెక్టుల అంశంలో కేసీఆర్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లొంగిపోయారని రావుల విమర్శించారు.