టీఆర్ఎస్కు, కాంగ్రెస్ పార్టీకి మధ్య మైత్రి కుదిర్చేందుకు తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు దళారీ పాత్ర పోషిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారక రామారావు విమర్శించారు. తమ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నారంటూ మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఇరు ప్రాంతాల ప్రజలు నమ్మడం లేదని, అసలు ఇంతవరకు రాజకీయాల్లో చంద్రబాబు లాంటి నాయకుడిని చూడలేదని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో ఏం చేయాలో చెప్పకుండా ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలన్న బాబు వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా విమర్శించారు.
టీ టీడీపీ నేతలది దళారీ పాత్ర: కేటీఆర్
Published Fri, Dec 27 2013 1:02 PM | Last Updated on Sat, Sep 2 2017 2:01 AM
Advertisement
Advertisement