బీజేపీ అభ్యర్థి వంశ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించిన శ్రీగణేశ్
కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ విజయం సాధించారు. సమీప ప్రత్యరి్థ, బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్‌పై 13,206 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. గత నెల 13న జరిగిన ఉపఎన్నికలో 1,30,929 ఓట్లు పోలయ్యాయి.
ఇందులో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్. శ్రీగణేశ్ 53,651 ఓట్లు దక్కించుకొని విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్ 40,445 ఓట్లతో ద్వితీయ స్థానంలో నిలవగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి జి. నివేదిత కేవలం 34,462 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.
గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున పోటీ చేసిన లాస్య నందిత విజయం సాధించారు. గత ఫిబ్రవరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడంతో ఉప ఎన్నిక జరిగింది. లాస్య నందిత స్థానంలో ఆమె అక్క నివేదితకు బీఆర్‌ఎస్‌కు టికెట్ కేటాయించింది. గత ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన శ్రీగణేశ్, కాంగ్రెస్‌లో చేరి పార్టీ టికెట్ దక్కించుకున్నారు.
3.. 2.. 1 : తొలినాళ్లలో కాంగ్రెస్ యువనేతగా రాజకీయాల్లోకి వచి్చన నారాయణన్ శ్రీగణేశ్, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. అనంతరం శ్రీగణేశ్ ఫౌండేషన్ స్థాపించి కంటోన్మెంట్‌లో తన సేవాకార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికలో మరోసారి కాంగ్రెస్ టికెట్ కోసం యతి్నంచినా, దక్కలేదు. ఆఖరి నిమిషంలో బీజేపీ టికెట్ కేటాయించడంతో పోటీ చేసి 15వేల పైచిలుకు ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. 2023 నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బీజేపీ తరఫున పోటీ చేసి 41,888 ఓట్లతో రెండోస్థానం దక్కించుకున్నారు. ఉపఎన్నిక రావడంతో సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు శ్రీగణేశ్ సొంతగూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఎట్టలకేలకు విజయం అందుకున్నారు. దీంతో శ్రీగణేశ్‌ను 3.. 2.. 1గా ఆయన అభిమానులు అభివర్ణిస్తూ ఉండటం గమనార్హం.
రేవంత్‌ను కలిసిన శ్రీగణేశ్: ఉప ఎన్నికల్లో విజయం సాధించిన శ్రీగణేశ్ సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. మంగళవారం సాయంత్రం ఆయన జూబ్లీహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ఆయనను అభినందించారు.
అసెంబ్లీలో కాంగ్రెస్‌కు పెరిగిన బలం
సాక్షి, హైదరాబాద్: శాసనసభలో కాంగ్రెస్ బలం పెరిగింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరిగింది. అదే సమయంలో బీఆర్‌ఎస్ బలం మరింత తగ్గినట్లయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసిన శ్రీగణేశ్ బీజేపీ అభ్యర్థి వంశ తిలక్‌పై 13 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇక్కడ బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన నందిత సోదరి నివేదిత మూడోస్థానానికి పరిమితమయ్యారు. కాగా, కంటోన్మెంట్‌లో విజయంతో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల సంఖ్య 65కి పెరగ్గా, బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలతో ఆ సంఖ్య 68కి చేరింది. మిత్రపక్షం సీపీఐ నుంచి గెలిచిన కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ పార్టీకి అదనపు బలం. కంటోన్మెంట్‌లో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడం, ముగ్గురు ఎమ్మెల్యేల ఫిరాయింపుతో అసెంబ్లీలో బీఆర్‌ఎస్ బలం 39 నుంచి 35కి తగ్గింది.
Comments
Please login to add a commentAdd a comment