బర్త్‌డే: తప్పతాగి యువకుడి మృతి? | Cantonment: Young Man Celebrating His Birthday Has Died | Sakshi
Sakshi News home page

బర్త్‌డే: తప్ప తాగి యువకుడి మృతి?

Feb 17 2021 8:53 AM | Updated on Jul 28 2022 7:28 PM

Cantonment: Young Man Celebrating His Birthday Has Died - Sakshi

మృతుడు కేశవ్‌ ప్రసాద్‌

సాక్షి, కంటోన్మెంట్‌: పుట్టిన రోజు వేడుక జరుపుకొన్న ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే.. విందులో అధికంగా మద్యం తాగడం వల్లే మరణించినట్లు తెలుస్తోంది. గోపాలపురం పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు తమిళనాడులోని ముళ్లిపట్టుకు చెందిన కేశవ ప్రకాశ్‌ (28) ఎనిమిది నెలలుగా రెజిమెంటల్‌ బజార్‌లోని జేఎంజే హాస్టల్‌లో ఉంటున్నాడు. స్థానికంగా ఓ కాల్‌ సెంటర్‌లో ఉద్యోగం చేసే కేశవ్‌ సోమవారం రాత్రి తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకొని రూమ్‌కు వచ్చాడు.

మంగళవారం ఉదయం అతను బయటికి రాకపోవడంతో హాస్టల్‌ నిర్వాహకులు తలుపులు పగులగొట్టి చూడగా కేశవ్‌ ప్రకాశ్‌ తన రూమ్‌లో పడి ఉన్నాడు. ఈ మేరకు హాస్టల్‌ నిర్వాహకులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. అధికంగా మద్యం సేవించడం వల్లే కేశవ్‌ మృతి చెందినట్లు భావిస్తున్నప్పటికీ, ఇతర కారణాలు ఏవైనా ఉంటాయన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: ‘రేవంత్‌ ఉన్నడా.. నాకు బాగా దగ్గరోడు ఆయన’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement