కంటోన్మెంట్, న్యూస్‌లైన్: 2013-14 వార్షిక బడ్జెట్‌కు కంటోన్మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. రూ.217 కోట్ల బడ్జెట్‌ను అధికారులు రూపొందించారు. బోర్డు అధ్యక్షుడు సునీల్ బీ బోదే అధ్యక్షతన శుక్రవారం జరిగిన పాలకమండలి సమావేశంలో ఉ పాధ్యక్షుడు కేశవరెడ్డి, సభ్యులు జంపన విద్యావతి, జంపన ప్రతాప్, వెంకట్రావు, అనూరాధ, భానుక నర్మద, పి.శ్యామ్‌కుమార్, జైప్రకాశ్, నామినేటెడ్ సభ్యులు, బోర్డు అధికారులు పాల్గొన్నారు.
బోర్డు పరిధిలో చేపట్టనున్న రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి సదుపాయాలు, భవన నిర్మాణాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ఈ నిధులను ఖర్చు చేయనున్నారు. ఇందులో రూ.55 కోట్లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంటుగా ఇవ్వాలని సభ్యులు కోరారు. జలమండలికి బోర్డు బకాయి పడ్డ రూ.55 కోట్లను చెల్లించేందుకు వీలు గా ఈ గ్రాంటును కోరారు. గత ఏడాదితో పోలిస్తే ఈ వార్షిక బడ్జెట్ రూ.29 కోట్లు అధికం.
బోర్డు ఉపాధ్యక్షుడిపై అవిశ్వాసం
కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడు కేశవరెడ్డికి పదవీ గండం వచ్చి పడింది. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సభ్యులు శుక్రవారం ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. బోర్డు సభ్యురాలు అనూరాధ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా జైప్రకాశ్, వెంకట్రావు, జంపన ప్రతాప్, జంపన విద్యావతి, భానుక నర్మద సంతకాలు చేసి సమావేశం ముగింపులో అధ్యక్షుడు సునీల్ బోదేకు అందించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని సీఈఓ సుజాత గుప్తాకు అధ్యక్షుడు సూచించారు. వారం రోజుల్లో బోర్డు సమావేశం జరిగే అవకాశం ఉంది.
‘కంటోన్మెంట్’ బడ్జెట్ రూ.217 కోట్లు
Published Sat, Aug 24 2013 1:34 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement