Dadra and Nagar Haveli
-
మువ్వన్నెల జెండాతో చికెన్ శుభ్రం.. అరెస్ట్
Viral News: మువ్వన్నెల పతాకంతో చికెన్‌ను తుడిచిన ఓ వ్యక్తి పోలీసులు అరెస్ట్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. స్పందించిన అధికారులు జాతీయజెండాను అవమానించినందుకుగానూ అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. దాద్రా-నగర్ హవేలీకి చెందిన ఓ వ్యక్తి ఓ ఫ్రౌల్ట్రీ షాప్‌లో చికెన్‌ను జాతీయ జెండాతో శుభ్రం చేశాడు. అయితే అదంతా వీడియోను తీసిన ఓ వ్యక్తి.. దానిని సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. ఇది సిల్వస్సా పోలీసుల దాకా చేరింది. దీంతో జాతీయ జెండాను అవమానించినందుకు గానూ.. ‘‘ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం ఆ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. నిందితుడ్ని మొహమ్మద్ సైఫ్ నదీమ్ ఖురేషీగా గుర్తించారు. గురువారమే అతన్ని అరెస్ట్ చేశామని, శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టగా జ్యూడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు మున్సిపల్ శాఖ అతని దుకాణానికి సీజ్ వేసింది. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971’’ సెక్షన్ 2 ప్రకారం.. జాతీయ జెండాను కాల్చినా, చించేసినా, మురికి అంటించినా, చెత్తలో పడేసినా, నాశనం చేసినా, పబ్లిక్‌గా తొక్కి అవమానించినా సరే పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. న్యాయస్థానంలో అలాంటి వ్యక్తులకు మూడేళ్ల శిక్ష, జరిమానా లేదంటే రెండూ విధిస్తారు. Mohammad Saif Nadim Qureshi was seen cleaning chopped chicken using the national flag in Silvassa. And then they say " Don't question our Patriotism " ! pic.twitter.com/KtPjuYvrSl — Mohit Babu 🇮🇳 (@Mohit_ksr) April 22, 2023 -
చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య
సిల్వస్సా: నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన ఓ రాక్షసుడు ఆమెను గొంతుకోసి చంపేశాడు. మృతదేహం చూసి తట్టుకోలేని ఆమె తండ్రి విషం తాగి మృతి చెందాడు. ఈ ఘటన దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సంతోష్ రజత్(30) సిల్వస్సాలో చిన్నఉద్యోగాలు చేస్తున్నాడు. శుక్రవారం తన ఫ్లాట్ వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి యత్నించగా చిన్నారి కేకలు వేసింది. దీంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపి గోనెసంచిలో కట్టి ఫ్లాట్ పక్క సందులో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిసరాల్లో గాలించారు. ఆ సమయంలో రజత్ ఇంట్లో బాత్రూంలో రక్తపుమరకలు కనిపించడంతో చుట్టుపక్కల శోధించగా బాలిక మృతదేహం ఉన్న సంచి కనిపించింది. విచారణలో రజత్ నేరాన్ని అంగీకరించాడు. కూతురు విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేని ఆమె తండ్రి శనివారం పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు. నిందితుడిపై పోక్సోతోపాటు తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. -
ఎంపీ ఆత్మహత్య: 15 పేజీల లేఖ, వైరలవుతోన్న వీడియో
న్యూఢిల్లీ: రెండు రోజుల క్రితం దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. పోస్ట్‌మార్టం నివేదిక ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా నిర్ధారించింది. అంతేకాక ఘటనా స్థలం నుంచి పోలీసులు 15 పేజీల సూసైడ్ నోట్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన అధికారిక లెటర్‌హెడ్ మీద గుజరాతీలో ఉన్న ఈ లేఖలో ఎంపీ ఆత్మహత్యకు గల కారణాలను వివరించినట్లు సమాచారం. లేఖలో ఉన్న విషయాల గురించి పోలీసులు బయటకు వెల్లడించడం లేదు. సోమవారం ఉదయం సౌత్ ముంబైలోని ఓ హోటల్లో మోహన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయం డ్రైవర్ వచ్చి హోటల్ రూమ్ తలుపు కొట్టాడు. అటువైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దాంతో అతడు ఎంపీ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు హోటల్ సిబ్బందికి విషయం చెప్పమని సూచించడంతో.. డ్రైవర్ హోటల్ స్టాఫ్‌కి విషయం చెప్పాడు. ఆ తర్వాత అతడు బల్కానీలో నుంచి గది లోపలికి ప్రవేశించి చూడగా.. అక్కడ సీలింగ్ ఫ్యాన్‌కు మోహన్ ఉరి వేసుకుని ఉండటం కనిపించింది. దాంతో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. ప్రస్తుతం పోలీసులు మోహన్ దేల్కర్ డ్రైవర్, బాడీగార్డును విచారిస్తున్నారు. ఇక మోహన్ మృతి చెందిన తర్వాత గతేడాది అతడు లోక్‌సభలో ప్రసంగించిన ఓ వీడియో తెగ వైరలయ్యింది. దీనిలో అతడు.. ‘‘గత నాలుగు నెలలుగా కొందరు అధికారులు నన్ను అవమానించాలని.. నాపై తప్పుడు కేసులు బనాయించాలని చూస్తున్నారు. మహమ్మారి సమయంలో, కొంతమంది అధికారులు నన్ను తప్పుడు కేసులలో బుక్ చేయడానికి ప్రయత్నించారు. నా విధులను నిర్వర్తించడానికి నన్ను అనుమతించలేదు. అందువల్ల నేను ప్రజలకు సహాయం చేయలేకపోయాను. కేంద్ర పాలిత దాద్రా, నగర్ హవేలీల ముక్తి దివాస్ సందర్భంగా నన్ను అవమానించారు. 35 సంవత్సరాలుగా వస్తోన్న సంప్రదాయం ప్రకారం దాద్రానగర్ హవేలీ ప్రజలను ఉద్దేశించి నేను ప్రసంగించకుండా అడ్డుకున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రజలను ఉద్దేశించి ప్రసంగించడానికి నన్ను ఎందుకు అనుమతించలేదని నేను అడిగినప్పుడు, డిప్యూటీ కలెక్టర్, ఈవెంట్ నిర్వాహకులు నాతో అసభ్యంగా ప్రవర్తించారు. వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు.. ఇది నాపై జరుగుతున్న కుట్ర" అని మోహన్ ఈ వీడియోలో వెల్లడించారు. -
హోటల్లో ఎంపీ అనుమానాస్పద మృతి
-
హోటల్లో ఎంపీ అనుమానాస్పద మృతి
ముంబై : దాద్రానగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సౌత్ ముంబైలోని ఓ హోటల్లో మోహన్ నిర్జీవంగా పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ప్రాథమిక అంచనా ప్రకారం ఎంపీ మోహన్‌ది ఆత్మహత్యగా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే గుజరాతీలో రాసిన సూసైడ్ నోట్‌ను దేల్కర్ బస చేసిన గది నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఎంపీ మోహన్ దేల్కర్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ మొదలు పెట్టారు. కాగా 58 ఏళ్ల మోహన్‌కు భార్య కలాబెన్, ఇద్దరు పిల్లలు అభినవ్, దివిత ఉన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో దాద్రా నగర్ హవేలి లోక్‌సభ స్థానం నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. గతంలో కూడా ఏడుసార్లు ఎంపీగా పనిచేశారు. కాంగ్రెస్‌లో కీలక నేతగా ఉన్న మోహన్.. 2019 వరకు దాద్రానగర్ హవేలీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. అనంతరం ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి గెలుపొందారు. గతేడాది బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌తో భేటీ తర్వాత దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలకు మోహన్ డెల్కర్ జేడీయూతో ఒప్పందం కుదుర్చుకున్నారు. జేడీయూకు ఆయన మద్దతు ఇవ్వడం వల్ల దాద్రా, నగర్ హవేలీలలో జరిగిన స్థానిక ఎన్నికలలో బీజేపీకి గట్టి దెబ్బ తగిలింది. చదవండి: కీలకంగా మారిన బిట్టు.. మధుపై అనుమానం! వికారాబాద్‌లో మాజీ ఎంపీపీ భర్త దారుణ హత్య -
రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఏకం!
న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను ఒకే కేంద్ర పాలిత ప్రాంతం కిందకు మార్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు వచ్చే వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ లోక్‌సభలో శుక్రవారం తెలిపారు. పాలనను మరింత సులభతరం చేసేందుకే వీటిని కలపనున్నట్లు చెప్పారు. కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ వీటికి వేర్వేరు సచివాలయాలు, బడ్జెట్ ఉన్నాయి. రెండు ప్రాంతాలను ఏకం చేసిన తర్వాత ఏర్పడే కేంద్రపాలిత ప్రాంతానికి ‘దాద్రా, నాగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ’ అనే పేరు పెట్టే అవకాశం ఉంది. దీంతో కేంద్రపాలిత పారంతాల సంఖ్య 8కి తగ్గనుంది.