![Four Year Old Girl Killed In Molestation And Father Sucide - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/14/murde.jpg.webp?itok=LoNnNp_P)
సిల్వస్సా: నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన ఓ రాక్షసుడు ఆమెను గొంతుకోసి చంపేశాడు. మృతదేహం చూసి తట్టుకోలేని ఆమె తండ్రి విషం తాగి మృతి చెందాడు. ఈ ఘటన దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సంతోష్ రజత్(30) సిల్వస్సాలో చిన్నఉద్యోగాలు చేస్తున్నాడు. శుక్రవారం తన ఫ్లాట్ వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి యత్నించగా చిన్నారి కేకలు వేసింది.
దీంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపి గోనెసంచిలో కట్టి ఫ్లాట్ పక్క సందులో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిసరాల్లో గాలించారు. ఆ సమయంలో రజత్ ఇంట్లో బాత్‌రూంలో రక్తపుమరకలు కనిపించడంతో చుట్టుపక్కల శోధించగా బాలిక మృతదేహం ఉన్న సంచి కనిపించింది. విచారణలో రజత్ నేరాన్ని అంగీకరించాడు. కూతురు విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేని ఆమె తండ్రి శనివారం పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు. నిందితుడిపై పోక్సోతోపాటు తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment