chaild death
-
రోజుకు 31 మంది బాలలు బలవన్మరణం
న్యూఢిల్లీ: దేశంలో 2020 సంవత్సరంలో రోజుకు 31 మంది చొప్పున చిన్నారులు(18 ఏళ్లలోపు వారు) బలవన్మరణాలకు పాల్పడినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. పిల్లలు ఎదుర్కొనే మానసిక సమస్యలు కోవిడ్ మహమ్మారితో ఏర్పడిన పరిస్థితులతో మరింత పెరగడమే ఇందుకు కారణం కావచ్చునని నిపుణులు అంటున్నారు. 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 11,396 మంది బాలలు ఆత్మహత్య చేసుకున్నట్లు నేషనల్ క్రైం బ్యూరో నివేదిక తెలిపింది. 2019తో పోలిస్తే 18%, 2018 కంటే 21% ఇది ఎక్కువని పేర్కొంది. 2019లో 9,613 మంది, 2018లో 9,413 మంది బాలలు ఆత్మహత్యలకు పాల్పడినట్లు గణాంకాలు వెల్లడించాయి. నివేదిక ప్రకారం.. 2020లో ప్రధానంగా కుటుంబసమస్యలతో 4,006 మంది, ప్రేమ వ్యవహారం కారణంగా 1,337 మంది, అనారోగ్య కారణాలతో 1,327 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవికాకుండా, సినీ హీరోల ఆరాధన, నిరుద్యోగం, ఆకస్మిక నష్టం, డ్రగ్స్ అలవాటు తదితర కారణాలతోనూ ఆత్మహత్యలు చేసుకున్న కేసులున్నాయి. కోవిడ్ మహమ్మారితో స్కూళ్లు మూతబడటం, సామాజికంగా ఒంటరితనంతోపాటు పెద్దల్లో ఆందోళన వల్ల కూడా చిన్నారుల మానసిక ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువై, వారిలో విపరీత నిర్ణయాలకు కారణమై ఉండవచ్చని సేవ్ ది చిల్డ్రన్ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ ప్రభాత్ కుమార్ అభిప్రాయపడ్డారు. ‘మన సమాజంలో విద్య, ఆరోగ్యం సంబంధ అంశాలపై పెట్టినంత శ్రద్ధ మానసిక ఆరోగ్యానికి ఇవ్వలేకపోతున్నాం. చిన్నారుల బలవన్మరణాలు పెరుగుతుండటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. పిల్లలు తమ శక్తియుక్తులను తెలుసుకుని, భవిష్యత్ కలలను నిజం చేసుకునే వాతావరణం కల్పించడం తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వాల బాధ్యత’ అని కుమార్ అన్నారు. ఎన్సీబీ రిపోర్టుపై క్రై(చైల్డ్ రైట్స్ అండ్ యూ) సంస్థ పాలసీ రీసెర్చ్ డైరెక్టర్ ప్రీతి మహారా స్పందిస్తూ.. 2020లో బలవన్మరణాలకు పాల్పడిన 11,396 మందిలో బాలురు 5,392 మంది కాగా బాలికలు 6,004 మంది ఉన్నారన్నారు. రోజుకు 31 మంది, గంటకు సుమారు ఒకరు చొప్పున తనువు చాలించారు. చిన్నారులు ఇళ్లలోనే ఉండిపోవాల్సి రావడం, కుటుంబసభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు వారితో సన్నిహితంగా మాట్లాడేందుకు అవకాశం లేకపోవడం, కుటుంబసభ్యుల మరణం వంటివి ఈ పరిస్థితికి దారి తీసింది’ అని తెలిపారు. ‘దీనిని నివారించేందుకు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ బిడ్డల మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేస్తుండాలి’ అని మానసిక ఆరోగ్య నిపుణురాలు ప్రకృతి పొద్దార్ అన్నారు. -
చిన్నారిపై మృగాడి పైశాచికం.. తండ్రి ఆత్మహత్య
సిల్వస్సా: నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడికి యత్నించిన ఓ రాక్షసుడు ఆమెను గొంతుకోసి చంపేశాడు. మృతదేహం చూసి తట్టుకోలేని ఆమె తండ్రి విషం తాగి మృతి చెందాడు. ఈ ఘటన దాద్రానగర్ హవేలీలోని సిల్వస్సాలో చోటుచేసుకుంది. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌కు చెందిన సంతోష్ రజత్(30) సిల్వస్సాలో చిన్నఉద్యోగాలు చేస్తున్నాడు. శుక్రవారం తన ఫ్లాట్ వద్ద ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలికను మాయమాటలు చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లాడు. లైంగికదాడికి యత్నించగా చిన్నారి కేకలు వేసింది. దీంతో పదునైన ఆయుధంతో ఆమె గొంతుకోసి చంపి గోనెసంచిలో కట్టి ఫ్లాట్ పక్క సందులో పడేశాడు. చిన్నారి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ పరిసరాల్లో గాలించారు. ఆ సమయంలో రజత్ ఇంట్లో బాత్రూంలో రక్తపుమరకలు కనిపించడంతో చుట్టుపక్కల శోధించగా బాలిక మృతదేహం ఉన్న సంచి కనిపించింది. విచారణలో రజత్ నేరాన్ని అంగీకరించాడు. కూతురు విగతజీవిగా కనిపించడంతో తట్టుకోలేని ఆమె తండ్రి శనివారం పురుగు మందు తాగి బలవన్మరణం చెందాడు. నిందితుడిపై పోక్సోతోపాటు తదితర నేరాల కింద కేసులు నమోదు చేశారు. -
సభ్య సమాజానికే ఇది తలవంపు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో 2013లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో ఇద్దరు నిందితులను పోక్సో కోర్టు శనివారం దోషులుగా నిర్ధారించింది. ఈ ఘటన సమాజానికే తలవంపులు తెచ్చిందని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణ సంఘటన 2012 డిసెంబర్లో నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసు తర్వాత నాలుగు నెలలకు చోటుచేసుకుంది. నిందితులు మనోజ్ షా, ప్రదీప్ కుమార్ బాధితురాలిని లైంగికంగా హింసించారు. అనంతరం బాలిక చనిపోయిందనుకుని వదిలేసి వెళ్లారు. 40 గంటల తరువాత ఏప్రిల్ 17న బాలికను రక్షించారు. ప్రస్తుతం ఈ కేసులో అదనపు సెషన్స్ జడ్జి నరేశ్‌కుమార్ మల్హోత్రా ఇద్దరినీ దోషులుగా నిర్ధారించారు. బాలికను వారు క్రూరంగా హింసించారని వ్యాఖ్యానించారు. ‘మన సమాజంలో మైనర్ బాలికలను దేవతలుగా ఆరాధిస్తారు. కానీ ఈ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా ఉంది’ అని పోక్సో కోర్టు వ్యాఖ్యానించింది. కాగా, తన కుమార్తెకు న్యాయం లభించినందుకు బాలిక తండ్రి సంతృప్తి వ్యక్తం చేశారు. ‘విచారణ రెండేళ్ళలో పూర్తి కావాలి, కానీ ఆరేళ్ల తరువాతైనా మాకు న్యాయం లభించినందుకు సంతోషం’ అని అన్నారు. దోషులకు శిక్షల విధింపుపై జనవరి 30న విచారిస్తామని కోర్టు తెలిపింది. 2013లో నిందితులను అరెస్టు చేసిన పోలీసులు మే 24 చార్జిషీట్ దాఖలు చేశారు. జూలై 11న అభియోగాలు మోపుతూ హాజరుపరిచారు. -
న్యుమోనియానూ ఎదుర్కోలేకపోతున్నాం
ఐక్యరాజ్యసమితి: అదేమి అరికట్టలేని భయంకరమైన వ్యాధి కాదు. చికిత్స లేని ప్రాణాంతకమైన జబ్బు కూడా కాదు. కానీ భారత్ మాత్రం ఆ వ్యాధిని నియంత్రించడంలో చతికిలపడిపోతోంది. అదే న్యుమోనియా. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్తో వచ్చే ఈ వ్యాధి సోకి ఐదేళ్లలోపు వయసు చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉందని ఐక్యరాజ్య సమితి నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా న్యుమోనియా ప్రతీ 39 సెకండ్లకు ఒక చిన్నారి ఉసురు తీస్తున్నట్టు యూఎన్ అధ్యయనంలో వెల్లడైంది. 2018లో న్యుమోనియా వ్యాధి సోకి ఎందరు చిన్నారులు బలయ్యారో యూనిసెఫ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలను సేకరించి ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అయిదేళ్లలోపు చిన్నారులు అత్యధికంగా న్యుమోనియో సోకి మరణిస్తున్నారు. ఆ దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉండడం ఆందోళన పుట్టిస్తోంది. 2018లో ప్రపంచ దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల్లో 8 లక్షల మందికి పైగా న్యూమోనియా వ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయారు. మొదటి నెలలోనే ప్రాణాలు కోల్పోయిన పసివారు లక్షా 53 వేలుగా ఉంది. పేదరికమే కారణం అసలు న్యుమోనియా అన్న వ్యాధి ఉందన్న సంగతి కూడా ఎన్నో దేశాలు మర్చిపోయిన వేళ హఠాత్తుగా కొన్ని దేశాల్లో ఈ వ్యాధి తీవ్రత పెరగడంపై యూనిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది. అయిదేళ్ల కంటే తక్కువ వయసున్న వారి మృతుల్లో 15 శాతం న్యుమోనియా కారణంగా నమోదవుతున్నాయని చెప్పింది. పేదరికానికి, ఈ వ్యాధికి గల సంబంధాన్ని కొట్టి పారేయలేమని పేర్కొంది. సురక్షిత మంచినీరు అందుబాటులో లేకపోవడం, ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు తక్కువ సంఖ్యలో ఉండడం, పౌష్టికాహార లోపాలు పెరిగిపోవడం, కాలుష్యం కాటేయడం వంటివి న్యుమోనియా పెరిగిపోవడానికి కారణాలుగా యూనిసెఫ్ నివేదిక వెల్లడించింది. న్యుమోనియా మరణాల్లో ఆ దేశాలే టాప్ న్యుమోనియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో సగానికి పైగా అయిదు దేశాల్లోనే నమోదవుతున్నాయి. నైజీరి యా, భారత్, పాకిస్తాన్, డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఇథియోపియా దేశాలే దీనికి బాధ్యత వహించాలని యూఎన్ వెల్లడించింది గత ఏడాది మృతుల సంఖ్య నైజీరియా 1,62,000 భారత్ 1,27,000 పాకిస్తాన్ 58,000 డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో 40,000 ఇథియోపియా 32,000 -
11 సెకన్లకో ప్రాణం బలి
జెనీవా: ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యరంగంలో అంతరాలు పెరుగుతున్నాయా? కొన్నిదేశాల్లో గర్భిణులు, నవజాతశిశు మరణాలు గణనీయంగా తగ్గుతుంటే, మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందా? అంటే ఐక్యరాజ్యసమితి(ఐరాస) అవుననే జవాబిస్తోంది. సరైన వైద్య సౌకర్యాలు, పరిశుభ్రతలేమి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి 11 సెకన్లకు ఓ గర్భిణి–బాలింత లేదా నవజాతశిశువు చనిపోతున్నారని ఐరాస తెలిపింది. అందుబాటులో మెరుగైన వైద్యం, మందులు, పరిశుభ్రత, పోషకాహారంతో ఈ మరణాలను నివారించవచ్చని వెల్లడించింది. అధికాదాయం ఉన్న ధనికదేశాల్లో స్త్రీ, శిశు మరణాలు తగ్గుతుంటే, ఆఫ్రికాతో పాటు మరికొన్ని దేశాల్లో మరణాల సంఖ్య పెరుగుతోందన్నారు. జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఐరాస అనుబంధ సంస్థలు సమర్పించిన నివేదికల్లోని వివరాలను ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోలేమని హెచ్చరించారు. ► గతేడాదితో పోల్చుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు సగానికి తగ్గిపోయి 53 లక్షలకు చేరాయి. ► ప్రసవ సమయంలో సమస్యలతో చనిపోయే గర్భిణుల సంఖ్య మూడోవంతు తగ్గింది. ఈ సంఖ్య 2000లో 4,51,000 ఉండగా, 2017 నాటికి 2,95,000కు పడిపోయింది. ► ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా 28 లక్షల మంది మహిళలు, నవజాతశిశువులు చనిపోతున్నారు. ► పరిశుభ్రమైన నీరు, పోషకాహారం, మందులు, వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే ఈ మరణాలన్నీ నివారించవచ్చు. ► ప్రతీ 11 సెకన్లకు ప్రపంచవ్యాప్తంగా ఓ బాలింత లేదా గర్భిణి లేదా నవజాతశిశువు ప్రాణాలు కోల్పోతున్నారు. ► ధనిక దేశాలతో పోల్చితే ఆఫ్రికా దేశాల్లో గర్భిణులు/బాలింతల మరణాలు 50 రెట్లు ఎక్కువ. ► ఆఫ్రికా దేశాల్లోని చిన్నారులు అధికాదాయం ఉన్న దేశాల చిన్నారుల కంటే చనిపోయే అవకాశాలు 10 రెట్లు అధికం. ► 2018లో ఆఫ్రికాలో ప్రతీ 13 మంది చిన్నారుల్లో ఒకరు పుట్టిన ఐదేళ్లలోపే చనిపోయారు. యూరప్‌లో ఈ సంఖ్య ప్రతి 196 మందిలో ఒక్కరే. ► ఆఫ్రికాలో ప్రసవ సమయంలో ప్రతి 37 మంది గర్భిణుల్లో ఒకరు మరణిస్తున్నారు. యూరప్‌లో ప్రతి 6,500 మంది మహిళలకు గానూ ఒకరు మాత్రమే ప్రసవ సమయంలో కన్నుమూస్తున్నారు. ► అమెరికాలోలో ప్రసవ మరణాలు 58 శాతం పెరిగాయి. అమెరికాలో 2017లో ప్రతి లక్ష ప్రసవాల సందర్భంగా 19 మంది చనిపోయారు. -
మరో గర్భశోకం
రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో గర్భిణులు జాయినైతే చాలు ‘క్రిటికల్’ అని ముద్ర వేసి రాజమహేంద్రవరంలోని వైద్య విధాన పరిషత్తు జిల్లా ఆసుపత్రికి తరలించేస్తున్నారు. క్రిటికల్ అనే కేసులను 108 సిబ్బంది మార్గం మధ్యలో డెలివరీలు చేసేస్తున్నారంటే వైద్యుల్లో ఏమేరకు నిర్లక్ష్యం ఆవహించి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ వివరాలు ఇలా... తూర్పుగోదావరి ,రంపచోడవరం: అమ్మ గర్భగుడి నుంచి బయట ప్రపంచంలోకి వచ్చి కళ్లు తెరవకుండానే పసి కందులకు నిండూ నూరేళ్లు నిండిపోతున్నాయి. ఆసుపత్రుల్లో ప్రసవా లు సురక్షితమని ఓ వైపు చెబుతున్నా ఆ ఆ సుపత్రుల్లో గర్భిణులకు వైద్య సేవలు అం దడం లేదు. ఏజెన్సీలో ఎంత మంది పసికందుల ప్రాణాలు పోతే ఇక్కడ వైద్య సేవలు మెరుగుపడతాయని పురిటిలోనే పిల్లలను కోల్పోయిన తల్లులు శాపనార్థాలు పెడుతున్నారు. ఎంతమంది పసికందుల కళ్లు మూస్తే అధి కారులు కళ్లు తెరుస్తారోనని కన్నీళ్ల పర్యంతమవుతున్నారు. రం పచోడవరం ఏరియాఆసుపత్రిలో మారేడుమిల్లిమండలం చావి డికోటగ్రామానికి చెందిన బత్తుల ప్రేమలత అనే గర్భిణి కాన్పు లోనే పసికందును కోల్పోయి గర్భశోకాన్ని అనుభవిస్తోంది. పురిటి నొప్పులతో బాధ పడుతున్నా పట్టించుకోని వైనం... చావిడికోట గ్రామం నుంచి ప్రేమలత సోమవారం మధ్యాహ్నం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి ఇన్ పేషెంట్‌గా చేరింది. ఆ సమయంలో వైద్యులు పరీక్ష చేసి బాగానే ఉందని ఆసుపత్రిలోనే ఉంచారు. అదే రోజు రాత్రి పురిటి నొప్పులతో బాధ పడుతుండడంతో బాధితురాలి అత్త అక్కడే ఉన్న నర్సులకు చెప్పినా చిరాకు పడ్డారే తప్ప ప్రాథమిక వైద్యం కూడా అందించలేదు. ప్రధాన వైద్యులెవరూ అందుబాటులో లేకపోవడంతో బాధతో నరకయాతన అనుభవించింది. అప్పటికే బిడ్డ సగం బయటకు వచ్చి ఆగిపోయింది. ఈ విషయం మళ్లీ వచ్చి ప్రాధేయపడడంతో నర్సులు వచ్చి చూసేసరికే ప్రాణం పోయింది. గర్భిణులకు వైద్యం అందే పరిస్ధితి లేదా... రంపచోడవరంఏరియా ఆసుపత్రిలో గర్భిణులకు కనీస వైద్యం అందించి భరోసానివ్వడంలో ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది వి ఫలమవుతున్నారని ఇటీవల జరిగిన ఘటనలే రుజువు చేస్తున్నాయి. వచ్చిన కేసులు క్రిటికల్‌గా ఉన్నాయని రాజమహేంద్రవరం పెద్దాసుపత్రికి రిఫర్ చేస్తున్నారు. విషమంగా ఉన్నయన్న కేసులు మార్గమ«ధ్యలో 108 సిబ్బంది సుఖ ప్రసవం చేయడం విశేషం. రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి కేసుల రిఫర ల్ పరిశీలిస్తే ఏప్రిల్ నెలలో 27 మంది గర్భిణులను రిఫర్ చేయగా మేలో 28 మంది, జూన్‌లో 26 మంది, జూలైలో 55 మంది, ఆగస్టులో 55, సెప్టెంబర్‌లో 21 మంది గర్భిణి కేసులను రాజ మహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. ఏరియా ఆసుపత్రిలో ఒక గైనిక్ వైద్యుడిని డిప్యూటేషన్‌పై నియమించా రు. సెలవు పెట్టినప్పుడు, రాత్రి సమయాల్లో ప్రాణంమాదకు వస్తోంది. సోమవారం మృతశిశువు జనన ఘటనపై ఆసుపత్రి ఇన్చార్జి కార్తీక్‌ను వివరణ కోరగా పురిటి నొప్పుల విషయం డ్యూటీలో ఉన్న సిబ్బంది తనకు చెప్పలేదని తెలిపారు. -
విషాహారం తిని చిన్నారి మృతి
తిరువణ్ణామలై: కలుషిత నీటిని తాగి తొమ్మిది నెలల కిందట ఆరుగురు మృతి చెందిన సంఘటన మరువకముందే అదేగ్రామంలో మరో చిన్నారి విషాహారం తినడంతో మంగళవారం ఉదయం మృతి చెందింది. తిరువణ్ణామలై జిల్లా విరివూర్ సమీపం తండరై గ్రామానికి చెందిన ఆంథోని విమల్‌రాజ్ కుమారుడు శరణ్(4)కు సోమవారం మధ్యాహ్నం భోజనం అనంతరం వాంతులు, విరోచనాలు ఏర్పడ్డాయి. . దీంతో హుటాహుటిన తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అక్క డ చికిత్సలు ఫలించక మంగళవారం మధ్యాహ్నం శరణ్ మృతి చెందాడు. దీని పై వైద్యులు మాట్లాడుతూ విషతుల్య మైన ఆహారం తినడంతోనే చిన్నారి మృ తి చెందినట్టు తెలిపారు. ఇదే గ్రామంలో గతేడాది అక్టోబర్‌లో తాగునీరు కలుషి తం కావడంతో ఆ నీటిని తాగి 6మంది మృతిచెందారు.