మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు | Expelled BJP leader Dayashankar insults Mayawati again | Sakshi
Sakshi News home page

మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు

Published Mon, Sep 5 2016 12:58 PM | Last Updated on Wed, Aug 29 2018 8:07 PM

మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు - Sakshi

మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు

ఆగ్రా: బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ మరోసారి బీఎస్పీ అధినేత్రిని తీవ్రంగా విమర్శించారు. మాయావతి ఓ కుక్కలాంటిదని సంబోధించాడు. ఆమె డబ్బు వెనుకే పరుగెడుతోందని ఆరోపించారు. ఆమె ఒక వంచకురాలని, పిరిక పంద అని వ్యాఖ్యానించాడు. దీనిపై ఒక్కసారిగా బీఎస్పీపై నేతలతోపాటు దళితులు కూడా తీవ్రంగా స్పందించడంతో తాను ఆ మాటలు అనలేదని కొట్టిపారేశాడు. అయితే, దయానంద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియో రికార్డింగ్ కూడా ఉంది.

ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన దయాశంకర్ మాయవతిని వ్యభిచారిణి అంటూ పరుష వ్యాఖ్యలు చేసి పదవీ కోల్పోయి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతడిపై ఎస్సీ యాక్ట్ కూడా నమోదైంది. అయితే, ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన దయాశంకర్ 'ఆమె పేరాశగల మహిళ. బైకు వెంట ఓ కుక్క పరుగెత్తుకుంటూ అరుస్తూ వెళుతుంది. కానీ బైక్ ఆపిన వెంనటే తోకముడిచి వెనక్కు వెళ్లిపోతుంది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మాయావతి, ఆమె సోదరుడు, ఇతర సన్నిహితులు కోట్లు వెనుకేసుకున్నారని, వాస్తవానికి మాయావతి పెద్ద వంచన చేసే మహిళ, పిరికి పంద అని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement