Dayashankar
-
బీజేపీ నేతలకు అఖిలేశ్ బంపర్ ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేతకు ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. శుక్రవారం లక్నోలో నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిలేశ్.. అదే కార్యక్రమానికి దయాశంకర్, ఆయన సతీమణి, ప్రస్తుత యూపీ మహిళా మోర్ఛా అధ్యక్షురాలు స్వాతి సింగ్ లను సమాజ్ వాదీ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. 'బువా జీ(మాయవతి) మిమ్మల్ని (దయాశంకర్ ను) అరెస్ట్ చేయమని పదేపదే నాపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ బీజేపీ మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదుకోదు. కాబట్టి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోన్న సమాజ్ వాదీ పార్టీలోకి రండి' అని అన్నారు. (మాయవతిపై మొరటు వ్యాఖ్యలు) బహిష్కృతుడు అయ్యేనాటికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన దయాశంకర్ సింగ్ కు యూపీ రాజకీయాల్లో మంచి పట్టుంది. అతని భార్య స్వాతి సింగ్ సైతం చురుకైనా నాయకురాలు. వారిని తన మనుషులుగా సమాజ్ వాదీ పార్టీలోకి చేర్చుకుంటే ఎంతోకొంత లాభం జరుగుతుందనే సీఎం అఖిలేశ్ బహిరంగ ఆహ్వానం పలికారు. దీనిపై భిన్నస్వరాలు వ్యక్తం అవుతున్నాయి. (నోరు జారాడు.. పదవి పోయింది) -
మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు
ఆగ్రా: బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ మరోసారి బీఎస్పీ అధినేత్రిని తీవ్రంగా విమర్శించారు. మాయావతి ఓ కుక్కలాంటిదని సంబోధించాడు. ఆమె డబ్బు వెనుకే పరుగెడుతోందని ఆరోపించారు. ఆమె ఒక వంచకురాలని, పిరిక పంద అని వ్యాఖ్యానించాడు. దీనిపై ఒక్కసారిగా బీఎస్పీపై నేతలతోపాటు దళితులు కూడా తీవ్రంగా స్పందించడంతో తాను ఆ మాటలు అనలేదని కొట్టిపారేశాడు. అయితే, దయానంద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన దయాశంకర్ మాయవతిని వ్యభిచారిణి అంటూ పరుష వ్యాఖ్యలు చేసి పదవీ కోల్పోయి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతడిపై ఎస్సీ యాక్ట్ కూడా నమోదైంది. అయితే, ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన దయాశంకర్ 'ఆమె పేరాశగల మహిళ. బైకు వెంట ఓ కుక్క పరుగెత్తుకుంటూ అరుస్తూ వెళుతుంది. కానీ బైక్ ఆపిన వెంనటే తోకముడిచి వెనక్కు వెళ్లిపోతుంది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మాయావతి, ఆమె సోదరుడు, ఇతర సన్నిహితులు కోట్లు వెనుకేసుకున్నారని, వాస్తవానికి మాయావతి పెద్ద వంచన చేసే మహిళ, పిరికి పంద అని ఆరోపించారు. -
దయాశంకర్ను కఠినంగా శిక్షించాలి
మునుగోడు: పార్లమెంట్లో దళిత ప్రజా ప్రతినిధి మాయవతిని అసభ్య పదజాలంతో దూషించిన ఉత్తరప్రదేష్ ఎంపీ దయాశంకర్ను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రాల నాగయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ కరువైయిందన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళీ అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పందుల వెంకటేశ్వర్లు, కొడి రామక్రిష్ణ, ఇరిగి బాలస్వామి, గుర్రాల సైదులు, వివిధ పార్టీల నాయకులు మాలిగ యాదయ్య, పిట్టల లక్ష్మయ్య, నక్క యాదీశ్వర్, ఎస్కె బషీర్, ముచ్చపోతుల నర్సింహా పాల్గొన్నారు. -
మాయావతిపై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై మొరటు వ్యాఖ్యలు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ శుక్రవారం మాయవతిపై హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాయావతితో పాటు మరో ముగ్గురు బీఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పార్టీ అధినేత్రితో పాటు సీనియర్ నేత నసీముద్దీన్ సిద్దఖీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ కుటుంబసభ్యుల పట్ల బీఎస్పీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారని స్వాతిసింగ్ ఆరోపించారు. తన కుమార్తెను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. తన భర్త మాత్రమే రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో తమను అనవసరంగా లాగుతున్నారని స్వాతి సింగ్ వాపోయారు. కాగా దయాశంకర్ సింగ్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది. -
'మొరటు' వ్యవహారంలో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ/లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం మరో మలుపు తిరిగింది. బీఎస్పీ కార్యకర్తలు తమను వేధిస్తున్నారంటూ మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలతో మానసికంగా నలిగిపోతున్నామని, ముఖ్యంగా తమ 12 ఏళ్ల కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దయాశంకర్ కుటుంబ సభ్యులను తమ పార్టీ మద్దతురాలు వేధించలేదని మాయావతి అన్నారు. తనపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలతో బీఎస్పీ కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. బలహీనవర్గాల ప్రజలను తనను సోదరి, దేవతగా ఆరాధిస్తారని అన్నారు. దయాశంకర్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించినట్టు చెప్పారు. తమను అవమానించారని చెబుతున్న దయాశంకర్ కుటుంబ సభ్యులు.. మహిళలకు జరిగిన పరాభవాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు.