దయాశంకర్‌ను కఠినంగా శిక్షించాలి
దయాశంకర్‌ను కఠినంగా శిక్షించాలి
Published Sat, Jul 23 2016 6:26 PM | Last Updated on Wed, Aug 29 2018 8:07 PM
మునుగోడు: పార్లమెంట్‌లో దళిత ప్రజా ప్రతినిధి మాయవతిని అసభ్య పదజాలంతో దూషించిన ఉత్తరప్రదేష్ ఎంపీ దయాశంకర్‌ను కఠినంగా శిక్షించాలని బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు గుర్రాల నాగయ్య డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ కరువైయిందన్నారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళీ అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు పందుల వెంకటేశ్వర్లు, కొడి రామక్రిష్ణ, ఇరిగి బాలస్వామి, గుర్రాల సైదులు, వివిధ పార్టీల నాయకులు మాలిగ యాదయ్య, పిట్టల లక్ష్మయ్య, నక్క యాదీశ్వర్, ఎస్‌కె బషీర్, ముచ్చపోతుల నర్సింహా పాల్గొన్నారు.
Advertisement
Advertisement