దయాశంకర్ సింగ్, ఆయన భార్య స్వాతి(ఇన్ సెట్ లో సీఎం అఖిలేశ్)
బీజేపీ నేతలకు అఖిలేశ్ బంపర్ ఆఫర్
Published Fri, Oct 28 2016 2:28 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 PM
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేతకు ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. శుక్రవారం లక్నోలో నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిలేశ్.. అదే కార్యక్రమానికి దయాశంకర్, ఆయన సతీమణి, ప్రస్తుత యూపీ మహిళా మోర్ఛా అధ్యక్షురాలు స్వాతి సింగ్ లను సమాజ్ వాదీ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. 'బువా జీ(మాయవతి) మిమ్మల్ని (దయాశంకర్ ను) అరెస్ట్ చేయమని పదేపదే నాపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ బీజేపీ మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదుకోదు. కాబట్టి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోన్న సమాజ్ వాదీ పార్టీలోకి రండి' అని అన్నారు. (మాయవతిపై మొరటు వ్యాఖ్యలు)
బహిష్కృతుడు అయ్యేనాటికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన దయాశంకర్ సింగ్ కు యూపీ రాజకీయాల్లో మంచి పట్టుంది. అతని భార్య స్వాతి సింగ్ సైతం చురుకైనా నాయకురాలు. వారిని తన మనుషులుగా సమాజ్ వాదీ పార్టీలోకి చేర్చుకుంటే ఎంతోకొంత లాభం జరుగుతుందనే సీఎం అఖిలేశ్ బహిరంగ ఆహ్వానం పలికారు. దీనిపై భిన్నస్వరాలు వ్యక్తం అవుతున్నాయి. (నోరు జారాడు.. పదవి పోయింది)
Advertisement
Advertisement