సీఎం దగ్గర పని చేయట్లేదు కాబట్టి..
సరిగ్గా ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శివపాల్ యాదవ్ శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ.. నవంబర్ 3 నుంచి ప్రారంభం కానున్న రథయాత్రకు తాను కూడా హాజరవుతానని, అయితే అఖిలేశ్ స్వయంగా ఆహ్వానిస్తేనే ఆ అక్కడికి వెళతానని అన్నారు. రథయాత్రపై విలేకరులు అడిగి ప్రశ్నలకు బదులిచ్చిన శివపాల్..'నన్ను మంత్రి వర్గం నుంచి తొలగించారు. అంటే ఇప్పుడు నేను సీఎం దగ్గర పనిచేయడం లేదు. కాబట్టి రథయాత్రకు విధిగా వెళ్లను. పిలిస్తేనే వెళతా'అని వ్యాఖ్యానించారు. అఖిలేశ్ తండ్రి మాట వినాలని హితవుపలికారు.
మరి 'కాంగ్రెస్ పార్టీ, బీజేపీలను కూడా ఆహ్వానిస్తారా?' అని ప్రశ్నించగా.. 'కేవలం సోషలిస్టు పార్టీలను మాత్రమే పిలుస్తున్నాం'అని బదులిచ్చారు. కొడుకు అఖిలేశ్ తిరుగుబావుటా సంకేతాల నేపథ్యంలో ములాయం.. పార్టీ పాతికేళ్ల వేడుకను కొత్త పొత్తులకు కేంద్రంగా మలుచుకుంటారనే ప్రచారం యూపీలో జోరుగా సాగుతోంది.