అబ్బాయికి బాబాయ్ సపోర్ట్! | i am responsible for election debacle, says shivpal yadav | Sakshi
Sakshi News home page

అబ్బాయికి బాబాయ్ సపోర్ట్!

Published Mon, Mar 13 2017 8:25 PM | Last Updated on Tue, Aug 14 2018 9:04 PM

అబ్బాయికి బాబాయ్ సపోర్ట్! - Sakshi

అబ్బాయికి బాబాయ్ సపోర్ట్!

నిన్న మొన్నటి వరకు ఇద్దరూ కత్తులు దూసుకున్నారు. ఇప్పుడు ఒకరంటే ఒకరు అభిమానం కురిపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ పార్టీలో ప్రస్తుత పరిస్థితి ఇది. యూపీలో పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదే గానీ.. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌ది కాదని పార్టీ సీనియర్ నాయకుడు శివపాల్ యాదవ్ అన్నారు. యూపీ  ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి కేవలం 47 స్థానాలు మాత్రమే వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు శివపాల్  - అఖిలేష్ ఇద్దరూ ఉప్పు నిప్పులా ఉన్న విషయం తెలిసిందే.

ఇంతటి మోదీ గాలి, ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా కూడా శివపాల్ మాత్రం జస్వంత్‌నగర్ స్థానంలో బీజేపీ నాయకుడు మనీష్ యాదవ్ పాత్రేను 52 వేల ఓట్ల తేడాతో ఓడించారు. పార్టీ ఓటమికి ఏ ఒక్కరినీ నిందించబోమని, నేతాజీ పోరాటానికి ఇప్పుడు కూడా తామంతా మద్దతుగా ఉంటామని ఆయన అన్నారు. పార్టీ ఇంతకుముందు ఎక్కడ ఉండేదో మళ్లీ అక్కడకు తీసుకెళ్తామన్నారు. ములాయం సింగ్ యాదవ్ మరో తమ్ముడు అభయ్ రామ్ యాదవ్ మాత్రం ఎన్నికల ఫలితాలపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. జరిగిందేదో జరిగిపోయిందని నిట్టూర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement