swathi singh
-
మంత్రి బెదిరింపులు.. సీఎం హెచ్చరికలు
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతిసింగ్‌పై ఇటీవల బెదిరింపు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ పోలీస్ అధికారిపై ఆమె ఫోన్లో బెదిరిస్తున్న ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వాతిసింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఆరా తీసిన సీఎం యోగి.. సదరు మంత్రికి నోటీసులు పంపారు. ఫోన్‌కాల్ రికార్డుపై 24 గంటల్లో సీఎం కార్యాలయానికి, డీజీపీకి వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే అధికారులతో హుందాగా వ్యహరించాలని కూడా హెచ్చరించినట్లు సమాచారం. -
బీజేపీ నేతలకు అఖిలేశ్ బంపర్ ఆఫర్
లక్నో: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతిపై గతంలో అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేతకు ప్రస్తుత సీఎం అఖిలేశ్ యాదవ్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. శుక్రవారం లక్నోలో నిర్వహించిన ఓ అవార్డు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అఖిలేశ్.. అదే కార్యక్రమానికి దయాశంకర్, ఆయన సతీమణి, ప్రస్తుత యూపీ మహిళా మోర్ఛా అధ్యక్షురాలు స్వాతి సింగ్ లను సమాజ్ వాదీ పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అఖిలేశ్ మాట్లాడుతూ.. 'బువా జీ(మాయవతి) మిమ్మల్ని (దయాశంకర్ ను) అరెస్ట్ చేయమని పదేపదే నాపై ఒత్తిడి తెచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అప్పుడుగానీ, ఇప్పుడుగానీ బీజేపీ మిమ్మల్ని ఆదుకోలేదు, ఆదుకోదు. కాబట్టి అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తోన్న సమాజ్ వాదీ పార్టీలోకి రండి' అని అన్నారు. (మాయవతిపై మొరటు వ్యాఖ్యలు) బహిష్కృతుడు అయ్యేనాటికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడైన దయాశంకర్ సింగ్ కు యూపీ రాజకీయాల్లో మంచి పట్టుంది. అతని భార్య స్వాతి సింగ్ సైతం చురుకైనా నాయకురాలు. వారిని తన మనుషులుగా సమాజ్ వాదీ పార్టీలోకి చేర్చుకుంటే ఎంతోకొంత లాభం జరుగుతుందనే సీఎం అఖిలేశ్ బహిరంగ ఆహ్వానం పలికారు. దీనిపై భిన్నస్వరాలు వ్యక్తం అవుతున్నాయి. (నోరు జారాడు.. పదవి పోయింది) -
మాయావతిపై ఎఫ్ఐఆర్ నమోదు
లక్నో: బీఎస్పీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై మొరటు వ్యాఖ్యలు వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ శుక్రవారం మాయవతిపై హజ్రత్ గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మాయావతితో పాటు మరో ముగ్గురు బీఎస్పీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు అయింది. పార్టీ అధినేత్రితో పాటు సీనియర్ నేత నసీముద్దీన్ సిద్దఖీపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తమ కుటుంబసభ్యుల పట్ల బీఎస్పీ కార్యకర్తలు అనుచితంగా ప్రవర్తించారని స్వాతిసింగ్ ఆరోపించారు. తన కుమార్తెను ఆ పార్టీ కార్యకర్తలు బెదిరిస్తున్నారని ఆమె వాపోయారు. తన భర్త మాత్రమే రాజకీయాల్లో ఉన్నారని, తమ కుటుంబం కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ వ్యవహారంలో తమను అనవసరంగా లాగుతున్నారని స్వాతి సింగ్ వాపోయారు. కాగా దయాశంకర్ సింగ్ ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోర్టులో లొంగిపోయే అవకాశం ఉంది. -
'మొరటు' వ్యవహారంలో మరో ట్విస్ట్
న్యూఢిల్లీ/లక్నో: బీఎస్పీ అధినేత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యల వ్యవహారం మరో మలుపు తిరిగింది. బీఎస్పీ కార్యకర్తలు తమను వేధిస్తున్నారంటూ మాయావతిపై ఉత్తరప్రదేశ్ బీజేపీ మాజీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ భార్య స్వాతి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ఆమె సిద్ధమవుతున్నారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తల అనుచిత వ్యాఖ్యలతో మానసికంగా నలిగిపోతున్నామని, ముఖ్యంగా తమ 12 ఏళ్ల కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైందని స్వాతి సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే దయాశంకర్ కుటుంబ సభ్యులను తమ పార్టీ మద్దతురాలు వేధించలేదని మాయావతి అన్నారు. తనపై దయాశంకర్ చేసిన వ్యాఖ్యలతో బీఎస్పీ కార్యకర్తలు ఆవేదనకు లోనయ్యారని చెప్పారు. బలహీనవర్గాల ప్రజలను తనను సోదరి, దేవతగా ఆరాధిస్తారని అన్నారు. దయాశంకర్ కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని తమ పార్టీ కార్యకర్తలకు సూచించినట్టు చెప్పారు. తమను అవమానించారని చెబుతున్న దయాశంకర్ కుటుంబ సభ్యులు.. మహిళలకు జరిగిన పరాభవాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. -
డోపీ దొరికింది.. మనకు పతకం వచ్చింది!
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ ఖాతాలో అనూహ్యంగా మరో పతకం చేరనుంది. మహిళల 53 కిలోల విభాగంలో పతకం సాధించిన నైజీరియా వెయిట్ లిఫ్టర్ చికా అమలహా డోపీగా తేలింది. డోప్ పరీక్షలో పాజిటీవ్‌గా తేలడంతో చికా పతకాన్ని రద్దు చేసే అవకాశముంది. ఇదే విభాగంలో కాంస్యం గెలిచిన తెలుగుతేజం మత్స సంతోషితో పాటు నాలుగో స్థానంలో నిలిచిన భారత లిఫ్టర్ స్వాతి సింగ్‌కు కలసి రానుంది. సంతోషికి రజత పతకాన్ని, స్వాతి సింగ్‌కు కాంస్య పతకాన్ని ప్రకటించే అవకాశముంది. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగడ.