మహిళల 53 కిలోల విభాగంలో పతకం సాధించిన నైజీరియా వెయిట్ లిఫ్టర్ చికా అమలహా డోపీగా తేలింది.
గ్లాస్గో: కామన్వెల్త్ గేమ్స్లో భారత్ ఖాతాలో అనూహ్యంగా మరో పతకం చేరనుంది. మహిళల 53 కిలోల విభాగంలో పతకం సాధించిన నైజీరియా వెయిట్ లిఫ్టర్ చికా అమలహా డోపీగా తేలింది. డోప్ పరీక్షలో పాజిటీవ్గా తేలడంతో చికా పతకాన్ని రద్దు చేసే అవకాశముంది.
ఇదే విభాగంలో కాంస్యం గెలిచిన తెలుగుతేజం మత్స సంతోషితో పాటు నాలుగో స్థానంలో నిలిచిన భారత లిఫ్టర్ స్వాతి సింగ్కు కలసి రానుంది. సంతోషికి రజత పతకాన్ని, స్వాతి సింగ్కు కాంస్య పతకాన్ని ప్రకటించే అవకాశముంది. మత్స సంతోషిది విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొండవెలగడ.