
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కేబినెట్ మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి స్వాతిసింగ్‌పై ఇటీవల బెదిరింపు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ పోలీస్ అధికారిపై ఆమె ఫోన్‌లో బెదిరిస్తున్న ఆడియో రికార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో స్వాతిసింగ్‌పై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆమె పదవికి రాజీనామా చేయాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఘటనపై ఆరా తీసిన సీఎం యోగి.. సదరు మంత్రికి నోటీసులు పంపారు. ఫోన్‌కాల్ రికార్డుపై 24 గంటల్లో సీఎం కార్యాలయానికి, డీజీపీకి వివరణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అలాగే అధికారులతో హుందాగా వ్యహరించాలని కూడా హెచ్చరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment