Expelled BJP leader
-
రిసెప్షనిస్ట్ హత్యోదంతం.. నిందితుడి తండ్రి సంచలన వ్యాఖ్యలు!
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్, రిషికేష్‌లోని వంతారా రిసార్ట్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేసే యువతి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఆ మరుసటి రోజున నిందితుడి తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ క్రమంలో తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండించారు బీజేపీ మాజీ నేత వినోద్ ఆర్య. పుల్కిత్ అమాయకుడని పేర్కొన్నారు. ‘అతడు ఒక సాదా సీదా అబ్బాయి. తన పనేదో తాను చూసుకుంటాడు. నా కుమారుడు పుల్కిత్, హత్యకు గురైన యువతి ఇరువురికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా. పుల్కిత్ ఇలాంటి వాటిలో ఎప్పుడూ పాల్గొనలేదు. అతడు నిర్దోషి.’ అని తెలిపారు వినోద్ ఆర్య. చాలా రోజులుగా పులికిత్ తమ కుటుంబానికి దూరంగా జీవిస్తున్నాడని చెప్పారు. కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా, న్యాయబద్ధంగా జరగాలనే ఉద్దేశంతోనే పార్టీకి రాజీనామా చేసినట్లు వెల్లడించారు. హత్యకు గురైన రిసెప్షనిస్ట్, 19 ఏళ్ల యువతి పని చేస్తున్న రిసార్ట్ ఓనర్ పుల్కిత్ ఆర్య, మేనేజర్ సౌరభ్ భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అంకిత్ గుప్తాలను శుక్రవారమే అరెస్ట్ చేశారు పోలీసులు. దర్యాప్తులో నిందితులు తెలిపిన వివరాలు, బాధితురాలి మొబైల్ ఫోన్ ఛాటింగ్ ప్రకారం..టూరిస్టులకు ‘ప్రత్యేక సేవలు’ అందించాలని ఆమెపై ఒత్తిడి చేసినట్లు తేలిందని పోలీసు అధికారి అశోక్ కుమార్ శనివారం వెల్లడించారు. నిందితుడు పుల్కిత్ ఆర్య, హత్యకు గురైన యువతి ఇదీ చదవండి: రిసెప్షనిస్ట్ హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ -
యువతి హత్య కేసులో కుమారుడు అరెస్టు.. తండ్రిని సస్పెండ్ చేసిన బీజేపీ
దెహ్రాదూన్: ఉత్తరాఖండ్ రిషికేష్‌లోని వంతారా రిసార్టులో రెసెప్షనిస్ట్ హత్యకు గురైన ఘటన ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పుల్కిత్ ఆర్యను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ మరునాడే ఆయన తండ్రి వినోద్ ఆర్య, సోదరుడు అంకిత్ ఆర్యను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే జిల్లా పరిపాలనా యంత్రాంగం హత్యపై విచారణ జరిపి ఆ తర్వాత తమపై ఏ చర్యలు తీసుకున్నా ఓకే అని వినోద్ ఆర్య తెలిపారు. హరిద్వార్‌కు చెందిన ఈయన గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాఖండ్ మాటీ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు, నిందితుడు పుల్కిత్ ఆర్య సోదరుడు అంకిత్ ఆర్య ఓబీసీ కమిషన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. సస్పెన్షన్‌తో ఇప్పుడు పదవి పోయింది. రిసెప్షనిస్ట్ అంకిత భండారీ హత్య ఆదివారం జరగ్గా.. కాలువలో కొట్టుకుపోయిన ఆమె మృతదేహాన్ని పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. బీజేపీ తనయుడి క్రూర చర్యకు స్థానికుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. హత్య జరిగిన రిసార్టుకు నిప్పుపెట్టారు. హత్య ఘటన దురదృష్టకరం అని, పోలీసులు వేగంగా చర్యలు తీసుకున్నారని సీఎం పుష్కర్ సింగ్ ధామీ తెలిపారు.విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏం జరిగింది? పుల్కిత్ ఆర్య యజమానిగా ఉన్న వంతారా రిసార్టులో పనిచేసే రిసెప్షనిస్ట్ అంకితా భండారీ ఆదివారం అదృశ్యమైంది. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేశారు. పుల్కిత్ ఆర్య కూడా ఏమీ తెలియనట్లు స్టేషన్‌కు వెళ్లి రిసెప్షనిస్ట్ కన్పించడం లేదని ఫిర్యాదు చేశాడు. అయితే బాధితురాలి తల్లిదండ్రులు పుల్కిత్ ఆర్యపై అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు వెంటనే విచారణ చేపట్టారు. రిసార్టులో పనిచేసే మరో ఇద్దరు సిబ్బందితో కలిసి పుల్కిత్ ఆర్యనే ఆమెను హత్య చేసినట్లు గుర్తించారు. అంకిత భండారీతో గొడవపడి ఆమెను రిసార్టు వెనకాల కాలువలోకి తోసేసినట్లు పుల్కిత్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు. ఆరు రోజుల తర్వాత శవాన్ని గుర్తించారు. పుల్కిత్తో పాటు రిసార్ట్ మేనేజర్ సౌరభ్‌భాస్కర్, అసిస్టెంట్ మేనేజర్ అకింత్ గుప్తాలను అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు పోలీసులు. అయితే తమ కుమార్తెపై లైంగిక దాడి జరిగిందని, ఆ తర్వాతే హత్యకు గురైందని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నట్లు చెప్పారు. చదవండి: యువతి హత్య కేసులో బీజేపీ నేత కుమారుడు అరెస్టు -
మాయావతిపై దయాశంకర్ మళ్లీ పరుష వ్యాఖ్యలు
ఆగ్రా: బీజేపీ బహిష్కృత నేత దయాశంకర్ సింగ్ మరోసారి బీఎస్పీ అధినేత్రిని తీవ్రంగా విమర్శించారు. మాయావతి ఓ కుక్కలాంటిదని సంబోధించాడు. ఆమె డబ్బు వెనుకే పరుగెడుతోందని ఆరోపించారు. ఆమె ఒక వంచకురాలని, పిరిక పంద అని వ్యాఖ్యానించాడు. దీనిపై ఒక్కసారిగా బీఎస్పీపై నేతలతోపాటు దళితులు కూడా తీవ్రంగా స్పందించడంతో తాను ఆ మాటలు అనలేదని కొట్టిపారేశాడు. అయితే, దయానంద్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు వీడియో రికార్డింగ్ కూడా ఉంది. ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన దయాశంకర్ మాయవతిని వ్యభిచారిణి అంటూ పరుష వ్యాఖ్యలు చేసి పదవీ కోల్పోయి పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యాడు. అతడిపై ఎస్సీ యాక్ట్ కూడా నమోదైంది. అయితే, ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడిన దయాశంకర్ 'ఆమె పేరాశగల మహిళ. బైకు వెంట ఓ కుక్క పరుగెత్తుకుంటూ అరుస్తూ వెళుతుంది. కానీ బైక్ ఆపిన వెంనటే తోకముడిచి వెనక్కు వెళ్లిపోతుంది' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. మాయావతి, ఆమె సోదరుడు, ఇతర సన్నిహితులు కోట్లు వెనుకేసుకున్నారని, వాస్తవానికి మాయావతి పెద్ద వంచన చేసే మహిళ, పిరికి పంద అని ఆరోపించారు.