బంధువులు కొట్టారని బావిలో దూకాడు | man committed suicide | Sakshi
Sakshi News home page

బంధువులు కొట్టారని బావిలో దూకాడు

Published Sat, Mar 14 2015 5:33 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

man committed suicide

శంషాబాద్ : బంధువులు చేయి చేసుకోవడంతో ఆవేదనకు గురైన ఓ వ్యక్తి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని మదన్‌పల్లి పాత తండా నివాసి లాల్‌సింగ్ (30) శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రైవేటు ఉద్యోగి. ఇతడు మద్యం తాగి తరచూ భార్య సునీతతో గొడవ పడేవాడు. ఈ నెల 12వ తేదీ రాత్రి భార్యపై చేయి చేసుకున్నాడు.

విషయం తెలిసిన భార్య తరపు బంధువులు అతడిని చితకబాదారు. దీన్ని అవమానంగా భావించిన లాల్‌సింగ్ తండాలోని బావిలో దూకాడు. అయితే బావిలో నీళ్లు లేకపోవడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. లాల్‌సింగ్‌కు భార్య, కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అతనిపై దాడి చేసిన బంధువులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై భాస్కర్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement