ప్రొద్దుటూరు(వైఎస్సార్ జిల్లా): రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు పేడ చల్లారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న అంబేడ్కర్ విగ్రహంపై దుండగులు పేడ చల్లారు. దీంతో దళిత సంఘాలు ఆందోళనకు దిగాయి. దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని రోడ్డుపై బైఠాయించిన ఆందోళన కారులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.