భీమిలి పోలీసు స్టేషన్లో ఓ గర్భిణికి తీవ్ర అవమానం జరిగింది.
భీమిలి పోలీసు స్టేషన్లో ఓ గర్భిణికి తీవ్ర అవమానం జరిగింది. ఓ వ్యక్తి తనను నమ్మించి మోసం చేశాడని పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు ఆమె వెళ్లింది. అయితే.. ప్రసవం అయిన తర్వాత బిడ్డతో కలిసి వస్తే.. పరీక్షలు చేసి, ఆ బిడ్డకు అసలు తండ్రి ఎవరో చెబుతామంటూ పోలీసులు తనను అవమానించారని ఆ గర్భిణి ఆరోపిస్తోంది.
ఎట్టకేలకు.. ఆమెను మోసం చేసిన ఆటోడ్రైవర్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిడి వల్లే నిందితుడిని అరెస్టు చేయకుండా వదిలేశారని సదరు గర్భిణి ఆరోపిస్తోంది.