
మహిళపై అత్యాచారం.. ఆత్మహత్యాయత్నం
అత్యాచారం జరగడంతో అవమాన భారం భరించలేని ఓ వివాహిత ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా అయిలాపూర్లో జరిగింది. ఈ గ్రామానికి చెందిన ఓ వివాహిత కొన్నాళ్లుగా ఒంటరిగా ఉంటోంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం సాయిలు అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చి కల్లు సీసా తెమ్మని చెప్పింది. కల్లు తీసుకొని వచ్చిన సాయిలు.. తలుపులు మూసి ఆమెపై అత్యాచారం చేసి పారిపోయాడు. అవమానాన్ని భరించలేని ఆమె 16వ తేదీన రసాయన గుళికలు మింగింది. అటుగా వచ్చిన ఆమె వదిన అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని గుర్తించి జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. 17వ తేదీన బాధితురాలు స్పృహలోకి వచ్చి వివరాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం
మరోవైపు మాక్లూర్ మండలం గుత్ప గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు. గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు ఈ నెల 14న చాక్లెట్లు కొనిస్తానని చెప్పి చిన్నారిని ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారయత్నం చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి చిన్నారిని కాపాడారన్నారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సోమవారం రాకేశ్‌పై కేసు నమోదు చేసుకున్నామని తెలిపారు.