racist remarks
-
మహిళా క్యాషియర్‌పై దాడి, అనుచిత వ్యాఖ్యలు, ఎన్ఆర్ఐకు జైలు, జరిమానా
మహిళా క్యాషియర్‌పై అనుచితంగా ప్రవర్థించిన భారత సంతతికి చెందిన 27 ఏళ్ల వ్యక్తికి సింగపూర్ కోర్టు జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించింది. క్యూలో నిలబడమని చెప్పినందుకు సింగపూర్‌లోని ఒక కేఫ్‌లోని కేఫ్‌లోని క్యాషియర్‌పై (Cafe Cashier) దాడి చేశాడు. ఘటనలో భారత సంతతికి చెందిన రిషి డేవిడ్ రమేష్ నంద్వానీ (Rishi David Ramesh Nandwani ) దోషిగా తేలాడు. దీంతో సింగపూర్ కోర్ట్( Singapore Court ) నాలుగు వారాల జైలు శిక్షతో పాటు 4000 వేల సింగపూర్ డాలర్ల జరిమానా విధించింది.సింగపూర్‌లోని హాలండ్ విలేజ్‌లోని ప్రాజెక్ట్ అకాయ్ కేఫ్లొ అక్టోబర్ 31న ఈ ఘటన జరిగింది. కేఫేలో ఫుడ్ ఆర్డర్ చేయడానికి వచ్చాడు రిషి. దాదాపు మధ్యాహ్నం 12:20 గంటల సమయంలో అక్కడంతా పిల్లలతో సహా కస్టమర్లు కిక్కిరిసి ఉన్నారు. ఈ సమయంలో క్యూలో తప్పుగా నిలబడటం గమనించిన మహిళా క్యాషియర్, రిషీని వెనక్కి వెళ్లమని సూచించింది. దీంతో అతను వెళ్లలేదు సరికదా అసహనంతో రెచ్చిపోయాడు. ఆ దేశం, అక్కడి ప్రజల గురించి అభ్యంతరకరంగా వ్యాఖానించాడు. ఆమెపై దుర్భాషలాడాడుతూ, అసభ్యమైన పదజాలంతో దూషించాడు. ఆవేశంతో కౌంటర్లో ఉన్న టిప్ బాక్స్ తీసుకుని ఆమెపైకి విసిరాడు. దీంతో ఆమె పైఅధికారులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రెండుగంటల్లోనే రిషిని అరెస్టు చేశారు. విచారణ అనంతరం రిషీ దురుసుగా ప్రవర్తించినట్లు తేల్చారు.వీడియో లింక్ ద్వారా రిషిని కోర్టులో హాజరుపరిచారు. కేఫ్ నుంచి బయటికి వెళ్లేటప్పుడు కూడా క్యాషియర్‌కు అసభ్యకరమైన సైగలు, దూషణలు చేస్తూ ఉన్న వీడియోను కోర్టులో ప్లే చేశారు. కేఫ్‌లో బాధితురాలి భద్రతకు హాని కలిగించే అవమానకరమైన పదాలను ఉపయోగించడం , అసభ్యకరమైన చర్యకు పాల్పడినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఛానల్ న్యూస్ ఆసియా ప్రకారం, శిక్ష సమయంలో రెండు అదనపు ఛార్జీలను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అనంతరం డిసెంబరు 30 జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
న్యూజిలాండ్‌కు పాకిన విద్వేషం
భారతీయుణ్ని దేశం నుంచి వెళ్లిపోవాలన్న స్థానికుడు ► అసభ్య పదజాలంతో దూషణ ► తరచూ ఇలాంటివి జరుగుతున్నాయని భారతీయుల ఆవేదన అక్లాండ్: అమెరికాలో భారతీయులపై జరుగుతున్న విద్వేషపూరిత ఘటనలు ఇప్పుడు న్యూజిలాండ్‌కు పాకాయి. అక్లాండ్లో ఓ సిక్కు జాతీయుడిపై స్థానికుడు గతవారం చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు ఆలస్యంగా బయటకు వచ్చాయి. అక్లాండ్లో ఉండే నరీందర్వీర్ సింగ్ పార్కింగ్‌లో నుంచి కారు తీస్తుండగా ఓ జంట కారులో వచ్చింది. వీరు వెళ్లిపోయేందుకు తను దారి ఇచ్చినప్పటికీ.. కారు నడుపుతున్న వ్యక్తి అసభ్య పదజాలంతో దూషిస్తూ దేశం విడిచి వెళ్లాలని బెదిరించాడని నరీందర్వీర్ వాపోయారు. ‘వారు వెళ్లేందుకు నేను పక్కకు తప్పుకున్నా. కారులోని మహిళ నావైపు వేలు చూపించింది. కారులోని వ్యక్తి నన్ను దూషిస్తూ.. అసభ్యంగా దూషించాడు. ఈ మొత్తాన్ని నేను వీడియో తీశాను. దీంతో అతడు మరింత రెచ్చిపోయి తిట్టాడు. మీ దేశానికి వెళ్లిపోండంటూ బెదిరించాడు. పంజాబీల గురించి చాలా అవమానంగా మాట్లాడాడు’ అని నరీందర్వీర్ తెలిపారు. ఇంతటితో అయిపోయింది కదా అని వెళ్లిపోతుంటే.. అదే జంట రోడ్డు పక్కన కారు ఆపుకుని మరీ మరోసారి తనపై మాటలతో దాడి చేశారని నిగ్గర్ (నల్లజాతీయులు) వెళ్లిపో అని బెదిరించాడని నరీందర్వీర్ వెల్లడించారు. మరోఘటనలోనూ..: న్యూజిలాండ్‌లో జరిగిన మరో ఘటనలోనూ విక్రమ్‌జిత్ సింగ్ అనే యువకుడిపైనా స్థానికుడొకరు అసభ్యంగా మాట్లాడారు. న్యూజిలాండ్‌లో ఎంత వేగంగా నడపాలో తెలియదా అని గద్దించిన స్థానికుడు.. మీ దేశానికి వెళ్లిపోండి అని బెదిరించాడు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక న్యూజిలాండ్‌లో ఇలాంటి ఘటనలు తరచు ఎదుర్కొనాల్సి వస్తోందని అక్కడి భారతీయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు ఒహయోలో విద్వేషపు వీడియో న్యూయార్క్: అమెరికాలో భారతీయులపై దాడులను మరువకముందే మరో విద్వేష వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. ‘భారత సంతతి ప్రజలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. ఇక్కడ ఉండే మధ్య, ఎగువమధ్య తరగతి అమెరికన్లు ఏమైపోయారు? ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వస్తోంది’ అంటూ స్టీవ్ పుషర్ (66) అనే ప్రోగ్రామర్ ఒహయో పార్క్‌లో రహస్యం గా చిత్రించిన వీడియోను సేవ్అమెరికన్ ఐటీజాబ్స్ అనే జాత్యహంకార వెబ్సైట్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో పార్క్‌లో వాలీబాల్ ఆడుతున్న భారత సంతతి వారిని చూపిస్తూ ‘గతేడాది వరకూ వాళ్లు క్రికెట్ ఆడేవాళ్లు. ఇప్పుడు క్రమంగా అమెరికన్ జీవనశైలికి అనుగుణంగా మారుతున్నారు’ అని ఆక్రోశం వెళ్లగక్కాడు. గతేడాది కంటే ఈ ఏడాది స్థానికులు కోల్పోయిన ఉద్యోగాల సంఖ్యను చూస్తే పిచ్చెక్కిపోతుందన్నాడు. గతంలో ఇక్కడ ఉద్యోగాలు, పనిచేసిన స్థానికుల గురించే బెంగం తా అని విద్వేషాన్ని వెళ్లగక్కాడు. భారత సంతతి మహిళలు వేసుకునే సంప్రదాయ దుస్తులు మతిపోగొడుతున్నాయన్నాడు. కాగా.. భారతీయులపై విద్వేష నేరాలకు సంబం ధించి వేగంగా న్యాయం జరిగేలా చూస్తామ ని భారత్‌కు అమెరికా హామీనిచ్చింది.