కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం | Shooting At California Synagogue Possibly May Hate Crime | Sakshi
Sakshi News home page

కాలిఫోర్నియాలో కాల్పుల కలకలం

Published Sun, Apr 28 2019 11:25 AM | Last Updated on Sun, Apr 28 2019 2:31 PM

Shooting At California Synagogue Possibly May Hate Crime - Sakshi

కాలిఫోర్నియాలోని పోవేలో గల సినాగోగ్‌(యూదుల ప్రార్థనా మందిరం)పై జరిగిన కాల్పుల్లో మరణించిన..

వాషింగ్టన్‌ : కాలిఫోర్నియాలో గుర్తు తెలియని ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు.  పోవేలోని యూదుల ప్రార్థనా మందిరంలో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా..మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అనుమానితుడిగా భావిస్తున్న పందొమ్మిదేళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా జాతి విద్వేషం కారణంగానే దుండుగుడు కాల్పులు జరిపినట్టు భావిస్తున్నారు.

ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పందించారు. ప్రస్తుతానికి దీనిని జాతి విద్వేష చర్యగానే భావిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన, గాయపడిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు... ‘ కాలిఫోర్నియాలోని పోవేలో గల సినాగోగ్‌(యూదుల ప్రార్థనా మందిరం)పై జరిగిన కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. చట్ట సంస్థలు (పోలీసులు) అద్భుతంగా తమ విధిని నిర్వర్తిస్తున్నాయి. ధన్యవాదాలు అని ఆయన ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement