కంపాలా: ఉగాండా దేశంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగాండా దేశ మంత్రిపై తన బాడీగార్డు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
వివరాల ప్రకారం.. ఉగాండా రాజధాని కంపాలాలో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా నివాసంలో ఆయనకు బాడీగార్డుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాడీగార్డ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, బాడీగార్జ్ కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందాడు.
అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని బాడీగార్డు కాల్చి చంపినట్లు సమాచారం. ఇక, ఈ కాల్పుల ఘటనపై ఆర్మీ అధికారులు దురదృష్టకరమని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్వే వెల్లడించారు. ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Col Charles Engola shot dead by the Body Guard. RIP.😭
— Davic Films Bsa (@davic_films) May 2, 2023
! BREAKING NEWS ! pic.twitter.com/CVmbWzMTqU
ఇది కూడా చదవండి: డింగ్ డాంగ్ డిచ్ కేసు: ముగ్గురిని బలిగొన్న ఎన్నారై చంద్రను దోషిగా తేల్చిన కోర్టు
Comments
Please login to add a commentAdd a comment