
దుండగులు ఇంకా నగరంలోనే ఉన్నట్లు తమకు సమాచారం అందిందని.. ఇంటి నుంచి ఎవరూ బయటికి రావొద్దని కోరారు.n
ఆమ్‌స్టర్‌డ్యామ్ : న్యూజిలాండ్‌లో ఉన్మాద కాండను మరువక ముందే నెదర్లాండ్స్‌లో అటువంటి తరహా ఘటనే చోటుచేసుకుంది. ఉట్రెక్ట్ నగరంలోని 24 అక్టోబెర్‌ప్లీన్‌లో గుర్తు తెలియని దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సోమవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘాతుకం వెనుక ఉగ్రవాదుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కాగా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు సహాయ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఇక.. స్థానిక మీడియా కాల్పులకు పాల్పడిన అనుమానితుల ఫొటోలు విడుదల చేసిందని పోలీసులు తెలిపారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. దుండగులు ఇంకా నగరంలోనే ఉన్నట్లు తమకు సమాచారం అందిందని.. ఇంటి నుంచి ఎవరూ బయటికి రావొద్దని విఙ్ఞప్తి చేశారు. కాగా గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చి మసీదులపై జరిగిన కాల్పుల ఘటనలో 49 మంది మృతి చెందగా 20 మందికి పైగా తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.