
అట్లాంటాలో కాల్పులకు పాల్పడినట్లు భావిస్తోన్న రాబర్డ్ ఆరోన్ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
వాషింగ్లన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగిపోయింది. దుండగులు అట్లాంటాలోని మసాజ్ పార్లర్, స్పాలను లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా చోటు చేసుకున్న కాల్పుల్లో ఎనిమింది మంది చనిపోయారు. వీరిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉండటం గమనార్హం. కాల్పులకు పాల్పడినట్లు భావిస్తున్న అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. వుడ్‌స్టాక్‌కు చెందిన రాబర్ట్ ఆరోన్ లాంగ్ మంగళవారం అట్లాంటాలో ఉన్న ఓ బ్యూటీ స్పా దగ్గర దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
ఇలా రెండు స్పాలు, ఓ మసాజ్ సెంటర్ దగ్గర మొత్తం ఎనిమిది మందిపై కాల్పులు జరిపాడు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మరణించిన వారిలో ఆరుగురు ఆసియా ఖండానికి చెందిన మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. కాల్పులకు తెగబడిన రాబర్ట్ ఆరన్ కోసం గాలించడం ప్రారంభించారు. రాబర్ట్ ఆరోన్ లాంగ్‌ను రాత్రి 8:30 గంటలకు అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment