
ప్రతీకాత్మక చిత్రం
ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు.
నోయిడా/జాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) నేతను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. శుక్రవారం నోయిడాలోని దద్రీ ప్రాంతంలోని తన ఇంటి సమీపంలోనే ఆయన్ను కాల్చి చంపారు. రామ్‌తేక్ కటారియా దద్రీ అసెంబ్లీ నియోజకవర్గం ఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నారు. ‘జర్చా రోడ్డు సమీపంలో 12.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కారులో వచ్చిన నలుగురు గుర్తు తెలియని దుండగులు ఆయన్ను 5 సార్లు కాల్చి పరారయ్యారు. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది’అని పోలీసు అధికారి వెల్లడించారు. దీనివెనుక ఎలాంటి రాజకీయ కుట్రలేదని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా జాన్‌పూర్‌లో శుక్రవారం ముసుగులు ధరించిన ఆరుగురు అగంతకులు జరిపిన కాల్పుల్లో మరో ఎస్పీ నేత లాల్జీ యాదవ్ (51) మరణించారు. ఖాన్‌పూర్ సమీపంలోని షాగంజ్–జాన్‌పూర్ రోడ్డుపై ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.