అమెరికాలో ఉన్మాదుల దుశ్చర్యకు మరో తెలుగువాడు బలయ్యాడు. జీవనోపాధి కోసం అమెరికాకు వెళ్లి.. స్టోర్ మేనేజర్‌గా పనిచేస్తున్న కొత్త గోవర్ధన్ రెడ్డి (45)పై మంగళవారం రాత్రి (స్థానిక కాలమానం ప్రకారం) 8 గంటలకు స్టోర్‌లో ఓ నల్లజాతీయుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలలో గోవర్ధన్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. 15 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లిన ఆయన.. సెలవులపై మార్చిలో ఇంటికొస్తానని కుటుంబసభ్యులు, మిత్రులకు చెప్పారు.